iscon
-
కాషాయం కట్టొద్దు.. తులసి మాల దాచేయండి: ఇస్కాన్ సూచన
కోల్‌కతా:‘కాషాయం ధరించడం మానుకోండి.. తిలకం పెట్టకండి.. తులసి జపమాల ఎవరికీ కనపడనీయకండి’.. ఇదీ కోల్‌కతాలోని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ (ఇస్కాన్) బంగ్లాదేశ్‌లోని హిందువులకు, కృష్ణ భక్తులకు ఇచ్చిన సలహా. ఇలా చేసినప్పుడే మతఛాందసవాదుల నుంచి రక్షించుకోగలుగుతారని ఇస్కాన్ అక్కడి హిందువులకు సూచించింది.ఇస్కాన్ కోల్‌కతా వైస్ ప్రెసిడెంట్ రాధారమణ్ దాస్.. బంగ్లాదేశ్‌లోని హిందువులు దేవాలయాలలో లేదా తమ ఇళ్లలో మాత్రమే తమ మతాచారాలను పాటించాలని, బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సంక్షోభ సమయంలో తమను తాము రక్షించుకునే దృష్టితో ఉండాలని ఆయన సలహా ఇచ్చారు. కాషాయ వస్త్రాలు ధరించవద్దని, నుదుటిపై తిలకం పెట్టుకోవద్దని రాధారమణ్ దాస్ సూచించారు. తులసిమాలను మెడలో ధరించాలనుకుంటే దానిని బయటకు కనిపించకుండా చూసుకోవాలని రాధారమణ్ దాస్ విజ్ఞప్తి చేసినట్లు ఓ ఆంగ్ల దినపత్రిక కథనం వెలువరించింది.బంగ్లాదేశ్‌లోని హిందువులు బయటకు సాధువులుగా కనిపించకుండా తమను తాము చూసుకోవాలని రాధారమణ్ దాస్ కోరారు. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలు, ఇస్కాన్ సన్యాసులపై హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయి. ఇటీవల బంగ్లాదేశ్‌లో ఒక చట్టపరమైన కేసులో ఆధ్యాత్మికవేత్త చిన్మయ్ కృష్ణ దాస్‌ను అరెస్టు చేశారు. న్యాయవాది రమణ్‌రాయ్‌పై దాడి జరిగింది. అతని పరిస్థితి విషమంగా ఉందని ఆయన పేర్కొన్నారు.ఆధ్యాత్మిక బోధకుడు చిన్మయ్ కృష్ణ దాస్‌ను అక్టోబర్ 25న అరెస్టు చేసినప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్ జాతీయ జెండాపై కాషాయ జెండాను ఎగురవేసినందుకు ఆయనపై దేశద్రోహం కేసు నమోదైంది. దాస్ అరెస్టు అనంతరం నవంబర్ 27న చిట్టగాంగ్ కోర్ట్ బిల్డింగ్ ప్రాంతంలో పోలీసులకు, ఆధ్యాత్మిక గురువు అనుచరులకు మధ్య జరిగిన ఘర్షణలో ఒక న్యాయవాది మృతిచెందాడు.బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న హింసాయుత ఘటనలపై భారతదేశం ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ (విహెచ్పీ) ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్భంగా వీహెచ్‌పీ నేతలు బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దురాగతాలను అరికట్టేందుకు ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్‌లోని హిందువులకు భద్రత కల్పించాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రదర్శన నిర్వహించారు.ఇది కూడా చదవండి: Bangladesh: చిన్మయ్ కృష్ణ దాస్ తరపు న్యాయవాదిపై దాడి.. పరిస్థితి విషమం -
తొలి ‘ఇస్కాన్’ అమెరికాలోనే ఎందుకు నిర్మితమయ్యింది? ‘హిప్పీలు’ అనుచరులుగా ఎలా మారారు?
ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణుని ఆలయాలు అనేకం ఉన్నాయి. శ్రీ కృష్ణుని భక్తిని, భగవద్గీత సందేశాన్ని ప్రపంచానికంతటికీ వ్యాప్తి చేయడానికి అనేక సంస్థలు కూడా ఉన్నాయి. ఈ సంస్థలలో ఇస్కాన్ ఒకటి. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్నెస్. ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా వేయికి పైగా ఆలయాలను నెలకొల్పింది. భారతదేశంలోనే ఇస్కాన్‌కు 400 కేంద్రాలు ఉన్నాయి. పాకిస్తాన్లో కూడా 12 ఇస్కాన్ దేవాలయాలు ఉండటం విశేషం. ఇస్కాన్ సంస్థను స్థాపించాలనే ఆలోచన యూపీలోని వీరభూమి ఝాన్సీలో ఉద్భవించిందనే సంగతి మీకు తెలుసా? అవును.. ఇస్కాన్ వ్యవస్థాపకులు భక్తివేదాంత స్వామి ప్రభుపాద జీ మహారాజ్ ఈ ఆలయాన్ని ఝాన్సీలో నిర్మించాలకున్నారు. భక్తివేదాంత స్వామి ప్రభుపాద తొలినాళ్లలో ఆయుర్వేద మందులను తయారు చేసేవారు. ఇందుకోసం ఆయన ఝాన్సీలోని ఆయుర్వేద కళాశాలకు తరచూ వచ్చేవారని ఇస్కాన్ కమిటీ సీనియర్ సభ్యుడు ఏనీర్ ప్రభు తెలిపారు. 1952 నుంచి ఆయన ఇక్కడికి క్రమం తప్పకుండా వచ్చేవారు. ఈ నేపధ్యంలో ఝాన్సీలో అతనికి ఇద్దరు స్థానికులు అనుచరులుగా మారారు. ఈ సందర్శనల సమయంలో స్వామి ప్రభుపాదుల దృష్టి ఇక్కడి రాధా బాయి స్మారక చిహ్నంపై పడింది. స్మారక చిహ్నంపై కృష్ణ మంత్రం రాసివుంది. ఆ సమయంలో తాను కృష్ణభక్తి సంస్థను ఇక్కడే స్థాపించనున్నట్లు స్వామి ప్రభుపాద తన అనుచరులకు తెలిపారు. 1957లో ప్రారంభమైన భక్తుల సంఘం స్వామి ప్రభుపాద మొదట ఈ సంస్థకు భక్తుల సంఘం అని పేరు పెట్టారు. దీనిపై నాటి దినపత్రికల్లోనూ ప్రకటనలు ఇచ్చారు. ఈ సంస్థకు భగవద్గీత సందేశాన్ని ప్రపంచమంతటా చాటగల విద్యావంతులైన యువత అవసరం ఎంతైనా ఉందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సంస్థకు అంకితమయ్యే యువతకు సంబంధించిన ప్రయాణ ఖర్చులు, ఆహారం, దుస్తులను సంస్థ అందిస్తుందని తెలిపారు. స్వామి ప్రభుపాద 1957లో ఈ సంస్థను స్థాపించాలనుకున్నారు. అయితే ఆయన అనుచరులు, కొందరు రాజకీయ నేతలు వివాదాలు సృష్టించారని చెబుతారు. ఫలితంగా ఆలయం అధికారికంగా ఝాన్సీలో నిర్మాణం కాలేదు. ఇస్కాన్ 1966లో స్థాపితం అనంతర కాలంలో స్వామి ప్రభుపాద బృందావనానికి తరలివెళ్లారు. అక్కడ ఆయన 16 సంవత్సరాల పాటు ఉన్నారు. పిమ్మట అమెరికాకు వెళ్లారు. అక్కడ అధికారికంగా 1966లో ఇస్కాన్‌ను స్థాపించాడు. న్యూయార్క్ నగరంలో 1966, జూలై 13న తొలి ఇస్కాన్ ఆలయం నిర్మించారు. తొలి రోజుల్లో స్వామి ప్రభుపాద అక్కడ సమాజం నుండి బహిష్కృతులైన హిప్పీలను ఇస్కాన్‌కు అనుసంధానించారు. భగవద్గీత సారాశం ఇస్కాన్ ద్వారా ప్రపంచ ప్రజలకు చేరువయ్యింది. ప్రస్తుతం ఇస్కాన్‌కు ప్రపంచవ్యాప్తంగా అనుచరులు ఉన్నారు. ఇది కూడా చదవండి: యుగాంతానికి అందిన హెచ్చరికలు! -
ఇస్కాన్ సంకల్పం
-
విద్యార్థుల భోజనంలో ఎలుక చర్మం
సాక్షి, అమరావతి/ వైఎస్ఆర్ : ప్రభుత్వ పాఠశాలలో భోజన తయారీలో ప్రభుత్వ నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. జిల్లాలోని సరోజిని నగర్లో ఆదర్శ పాఠశాల విద్యార్థులకు వడ్డించే పప్పులో సోమవారం ఎలుక చర్మం, పేగులు వచ్చాయి. పిల్లలకు వడ్డించే భోజనంలో ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది దీన్ని బట్టిచూస్తే అర్థమవుతోంది. భోజన తయారిని ఏపీ ప్రభుత్వం ప్రయివేటీకరించడంతో ఇస్కాన్ సంస్థ భోజనాన్ని తయారు చేస్తోంది. విద్యార్థుల ప్రాణాలతో ఇస్కాన్ చెలగాటం ఆడుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని 100 పాఠశాలలకు ఇదే సంస్థ భోజనాన్ని పంపిణీ చేస్తోంది. కాగా భోజన తయారిని ప్రభుత్వం ప్రయివేటీకరించడం ప్రజలు తీవ్రంగ తప్పుపడుతున్న విషయం తెలిసిందే. -
విద్యార్థుల మిడ్ డే మీల్స్‌లో ఎలుక చర్మం పేగులు
-
శోభాయమానం..జగన్నాథ రథయాత్ర
కర్నూలు (న్యూసిటీ): జగన్నాథ రథయాత్ర కర్నూలు నగరంలో శనివారం శోభాయమానంగా సాగింది. స్థానిక మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి.. పాతబస్టాండ్, పెద్దపార్క్, రాజ్‌విహార్ మీదుగా..బంగారుపేట, ఆర్ఎస్ రోడ్డు నుంచి తిరిగి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేరింది. హరే రామ..హరే కృష్ణ సంకీర్తనలు, భజనలు, కోలాటాలతో రథయాత్ర రమణీయంగా జరిగింది. నంద్యాల విద్యార్థుల హరినామ సంకీర్తనలు ఆకట్టుకున్నాయి. రథయాత్ర ప్రారంభ కార్యక్రమంలో ఎస్పీ ఆకె రవికృష్ణ మాట్లాడారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రథయాత్ర మహోత్సవాలు యువకుల్లో ఆధ్యాత్మిక భావాలు పెంపొందించాయన్నారు. రథయాత్ర ప్రారంభోత్సవంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ మల్లికార్జునరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శమంతకమణి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జగన్నాథునికి ఊంజల సేవ
కర్నూలు(న్యూసిటీ): శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవాల్లో భాగంగా బుధవారం రాధాసమేత శ్రీకృష్ణ భగవానునికి ఊంజల సేవ నిర్వహించారు. కర్నూలులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ముందుగా బలదేవి, సుభద్రదేవి సమేత జగన్నా«థస్వామికి అష్టోత్తర శతనామావళి మంత్రాలను పఠించారు. హారితిచ్చిన అనంతరం హరేకృష్ణ మహా మంత్ర జపం చేశారు. ఇస్కాన్ నరసరావుపేట ఇన్చార్జ్ వైష్ణవ ప్రభుదాస్.. భాగవత ప్రవచాలను బోధించారు. అమ్మవార్లకు స్వామికి ఊంజల సేవ జరిపారు. ఇస్కాన్ కర్నూలు ప్రాజెక్టు డైరెక్టర్ రూపేశ్వర్ చైతన్యదాస్, కర్నూలు ఇన్చార్జ్ చైతన్య చంద్ర ప్రతిదాస్ పాల్గొన్నారు. 7న రథయాత్ర: జగన్నాథస్వామి రథయాత్రను ఈ నెల 7వ తేదీన జరుపుతామని ఇస్కాన్ కర్నూలు ఇన్చార్జ్ చైతన్య చంద్ర ప్రతిదాస్ తెలిపారు. రథయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
ఘనంగా శ్రీజగన్నా«థ రథయాత్ర
కర్నూలు(న్యూసిటీ) : కర్నూలులోని ఎగ్జిబిషన్ ఆవరణలో ఇస్కాన్ ఆధ్యర్యంలో శ్రీజగన్నాధ రథయాత్ర ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు బలదేవి, సుభద్రదేవి సమేత జగన్నాథస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నృసింహ, తులసి హారతులు ఇచ్చారు. సాయంకాలం 1008 ఆహార పదార్థాలతో అమ్మవార్లు స్వామికి నివేదన చేశారు. ఇస్కాన్ కర్నూలు ప్రాజెక్టు డైరెక్టర్ రూపేశ్వర్ చైతన్యదాస్, నరసరావుపేట ఇన్చార్జి వైష్ణవ ప్రభుదాస్, కర్నూలు ఇన్చార్జి చైతన్య చంద్ర ప్రతిదాస్ పాల్గొన్నారు. -
ఆకట్టుకుంటున్న ఇస్కాన్ ఎగ్జిబిషన్
-
జగన్నాథ రథయాత్ర మహోత్సవాలు ప్రారంభం
- ప్రారంభించిన టీజీ వెంకటేశ్ కర్నూలు (న్యూసిటీ) : అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) రెండేళ్లకోసారి నిర్వహిస్తున్న జగన్నాథ రథయాత్ర మహోత్సవాలు ఈ ఏడాదికి సంబంధించి ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ ప్రారంభించారు. శ్రీకృష్ణ భగవానుని విశ్వరూప ప్రదర్శన ఆకట్టుకునేలా ఉందని తెలిపారు. ఇస్కాన్ కర్నూలు ప్రాజెక్టు డైరెక్టర్ రూపేశ్వర్ చైతన్యదాస్ మాట్లాడుతూ నేటి నుంచి 8వ తేదీ వరకు మహోత్సవాలు జరుపుతామన్నారు. 7వ తేదీన రథయాత్ర, 8వ తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం శ్రీదామోదర దీపోత్సవాన్ని నిర్వహించారు. ఇస్కాన్ నరసరావుపేట ఇన్చార్జి వైష్ణవ కృపదాస్, కర్నూలు ఇన్చార్జి చైతన్య చంద్రపతి దాస్, మణికంఠ అయ్యప్పస్వామి దేవాలయం అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి ఈ. మల్లికార్జునరెడ్డి, భరతమాతృ మండలి అధ్యక్షురాలు ఇ.పద్మవతమ్మ తదితరులు పాల్గొన్నారు. -
మధ్యాహ్న భోజనం ఇస్కాన్‌కు ఇవ్వద్దు
– కలెక్టరేట్ ముట్టడి, ధర్నా, నినాదాలు – వాగ్వాదం, తోపులాటలు, అరెస్టులు చిత్తూరు కలెక్టరేట్ : మధ్యాహ్నభోజన పథకాన్ని ఇస్కాన్ సంస్థకు అప్పగించకూడదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పి.చైతన్య డిమాండ్ చేశారు. జిల్లాలోని మధ్యాహ్నభోజన కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10గంటలకు కలెక్టరేట్ ప్రధాన గేట్లను మూసివేసి ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. అక్కడే బైఠాయించి ధర్నా చేశారు. చైతన్య మాట్లాడుతూ మధ్యాహ్నభోజన పథకాన్ని ఇస్కాన్ సంస్థకు అందజేయడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదన్నారు. ఉదయం ఎప్పుడో చేసిన భోజనాన్ని తీసుకొచ్చి విద్యార్థులకు వడ్డిస్తుండటంతో జ్వరాల బారిన పడుతున్నారన్నారు. జిల్లా అధికారులు ఇస్కాన్ సంస్థకు మధ్యాహ్నభోజన పథకాన్ని అప్పగించేందుకు రహస్య చర్యలు చేపడుతున్నారని ఆయన దుయ్యపట్టారు. ఈ పథకాన్ని ఇస్కాన్‌కు అప్పగిస్తే జిల్లా వ్యాప్తంగా 9వేల మంది మధ్యాహ్నభోజన కార్మికులు వీధినపడాల్సి వస్తుందన్నారు. 13 ఏళ్లుగా మధ్యాహ్నభోజన పథకాన్ని కార్మికులు అప్పులు చేసి నిర్విఘ్నంగా నిర్వహించారన్నారు. కార్మికులకు మధ్యాహ్నభోజన పథకాన్ని అప్పగిస్తామని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ బహిర ంగ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు. ఓ దశలో కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. కార్మికులను పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించినప్పుడు తోపులాట జరిగింది. కొందరు మహిళా కార్మికులు కిందపడిపోయారు, దాదాపు 100 మంది కార్మికులను పోలీసులు అరెస్టుచేసి రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి నాగరాణి, మధ్యాహ్నభోజన పథకం కార్మిక నాయకులు అముద, మంజుల, విమల, సావిత్ర తదితరులు పాల్గొన్నారు. –19సీటీఆర్ 18 –