శోభాయమానం..జగన్నాథ రథయాత్ర | fanfare Jagannatha rathayatra | Sakshi
Sakshi News home page

శోభాయమానం..జగన్నాథ రథయాత్ర

Published Sat, Jan 7 2017 10:31 PM | Last Updated on Tue, Sep 5 2017 12:41 AM

శోభాయమానం..జగన్నాథ రథయాత్ర

శోభాయమానం..జగన్నాథ రథయాత్ర

కర్నూలు (న్యూసిటీ): జగన్నాథ రథయాత్ర కర్నూలు నగరంలో శనివారం శోభాయమానంగా సాగింది. స్థానిక మున్సిపల్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్ నుంచి.. పాతబస్టాండ్, పెద్దపార్క్, రాజ్‌విహార్ మీదుగా..బంగారుపేట, ఆర్‌ఎస్‌ రోడ్డు నుంచి తిరిగి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌కు చేరింది. హరే రామ..హరే కృష్ణ సంకీర్తనలు, భజనలు, కోలాటాలతో  రథయాత్ర రమణీయంగా జరిగింది. నంద్యాల విద్యార్థుల హరినామ సంకీర్తనలు ఆకట్టుకున్నాయి. రథయాత్ర ప్రారంభ కార్యక్రమంలో ఎస్పీ ఆకె రవికృష్ణ మాట్లాడారు. ఇస్కాన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రథయాత్ర మహోత్సవాలు యువకుల్లో ఆధ్యాత్మిక భావాలు పెంపొందించాయన్నారు. రథయాత్ర ప్రారంభోత్సవంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్,  కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌ మల్లికార్జునరెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ శమంతకమణి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement