jagannatha rathayatra
-
శోభాయమానం..జగన్నాథ రథయాత్ర
కర్నూలు (న్యూసిటీ): జగన్నాథ రథయాత్ర కర్నూలు నగరంలో శనివారం శోభాయమానంగా సాగింది. స్థానిక మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి.. పాతబస్టాండ్, పెద్దపార్క్, రాజ్‌విహార్ మీదుగా..బంగారుపేట, ఆర్ఎస్ రోడ్డు నుంచి తిరిగి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేరింది. హరే రామ..హరే కృష్ణ సంకీర్తనలు, భజనలు, కోలాటాలతో రథయాత్ర రమణీయంగా జరిగింది. నంద్యాల విద్యార్థుల హరినామ సంకీర్తనలు ఆకట్టుకున్నాయి. రథయాత్ర ప్రారంభ కార్యక్రమంలో ఎస్పీ ఆకె రవికృష్ణ మాట్లాడారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రథయాత్ర మహోత్సవాలు యువకుల్లో ఆధ్యాత్మిక భావాలు పెంపొందించాయన్నారు. రథయాత్ర ప్రారంభోత్సవంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ మల్లికార్జునరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శమంతకమణి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జగన్నాథునికి ఊంజల సేవ
కర్నూలు(న్యూసిటీ): శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవాల్లో భాగంగా బుధవారం రాధాసమేత శ్రీకృష్ణ భగవానునికి ఊంజల సేవ నిర్వహించారు. కర్నూలులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ముందుగా బలదేవి, సుభద్రదేవి సమేత జగన్నా«థస్వామికి అష్టోత్తర శతనామావళి మంత్రాలను పఠించారు. హారితిచ్చిన అనంతరం హరేకృష్ణ మహా మంత్ర జపం చేశారు. ఇస్కాన్ నరసరావుపేట ఇన్చార్జ్ వైష్ణవ ప్రభుదాస్.. భాగవత ప్రవచాలను బోధించారు. అమ్మవార్లకు స్వామికి ఊంజల సేవ జరిపారు. ఇస్కాన్ కర్నూలు ప్రాజెక్టు డైరెక్టర్ రూపేశ్వర్ చైతన్యదాస్, కర్నూలు ఇన్చార్జ్ చైతన్య చంద్ర ప్రతిదాస్ పాల్గొన్నారు. 7న రథయాత్ర: జగన్నాథస్వామి రథయాత్రను ఈ నెల 7వ తేదీన జరుపుతామని ఇస్కాన్ కర్నూలు ఇన్చార్జ్ చైతన్య చంద్ర ప్రతిదాస్ తెలిపారు. రథయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.