జగన్నాథునికి ఊంజల సేవ
జగన్నాథునికి ఊంజల సేవ
Published Thu, Jan 5 2017 12:20 AM | Last Updated on Tue, Sep 5 2017 12:24 AM
కర్నూలు(న్యూసిటీ): శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవాల్లో భాగంగా బుధవారం రాధాసమేత శ్రీకృష్ణ భగవానునికి ఊంజల సేవ నిర్వహించారు. కర్నూలులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ముందుగా బలదేవి, సుభద్రదేవి సమేత జగన్నా«థస్వామికి అష్టోత్తర శతనామావళి మంత్రాలను పఠించారు. హారితిచ్చిన అనంతరం హరేకృష్ణ మహా మంత్ర జపం చేశారు. ఇస్కాన్ నరసరావుపేట ఇన్‌చార్జ్ వైష్ణవ ప్రభుదాస్.. భాగవత ప్రవచాలను బోధించారు. అమ్మవార్లకు స్వామికి ఊంజల సేవ జరిపారు. ఇస్కాన్ కర్నూలు ప్రాజెక్టు డైరెక్టర్ రూపేశ్వర్ చైతన్యదాస్, కర్నూలు ఇన్‌చార్జ్ చైతన్య చంద్ర ప్రతిదాస్ పాల్గొన్నారు. 7న రథయాత్ర: జగన్నాథస్వామి రథయాత్రను ఈ నెల 7వ తేదీన జరుపుతామని ఇస్కాన్ కర్నూలు ఇన్‌చార్జ్ చైతన్య చంద్ర ప్రతిదాస్ తెలిపారు. రథయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Advertisement
Advertisement