unjal seva
-
జగన్నాథునికి ఊంజల సేవ
కర్నూలు(న్యూసిటీ): శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవాల్లో భాగంగా బుధవారం రాధాసమేత శ్రీకృష్ణ భగవానునికి ఊంజల సేవ నిర్వహించారు. కర్నూలులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ముందుగా బలదేవి, సుభద్రదేవి సమేత జగన్నా«థస్వామికి అష్టోత్తర శతనామావళి మంత్రాలను పఠించారు. హారితిచ్చిన అనంతరం హరేకృష్ణ మహా మంత్ర జపం చేశారు. ఇస్కాన్ నరసరావుపేట ఇన్చార్జ్ వైష్ణవ ప్రభుదాస్.. భాగవత ప్రవచాలను బోధించారు. అమ్మవార్లకు స్వామికి ఊంజల సేవ జరిపారు. ఇస్కాన్ కర్నూలు ప్రాజెక్టు డైరెక్టర్ రూపేశ్వర్ చైతన్యదాస్, కర్నూలు ఇన్చార్జ్ చైతన్య చంద్ర ప్రతిదాస్ పాల్గొన్నారు. 7న రథయాత్ర: జగన్నాథస్వామి రథయాత్రను ఈ నెల 7వ తేదీన జరుపుతామని ఇస్కాన్ కర్నూలు ఇన్చార్జ్ చైతన్య చంద్ర ప్రతిదాస్ తెలిపారు. రథయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
నేత్రపర్వంగా శ్రీవారి కల్యాణం
రాపూరు: జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైనపెంచలకోనలో శ్రీవారి కల్యాణాన్ని శనివారం నేత్రపర్వంగా నిర్వహించారు. ఉదయం పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మిదేవి, ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. 11 గంటలకు నిత్య కల్యాణమండపంలో లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మిదేవి, చెంచులక్ష్మిదేవి ఉత్సవ విగ్రహాలను కొలువుదీర్చి కల్యాణం జరిపారు. మధ్యాహ్న అన్నదానం చేశారు. సాయంత్రం 6గంటలకు ఉత్సవవిగ్రహాలను తిరుచ్చిపై సహస్రదీపాలంకరణ మండపంలో కొలువుదీర్చి ఊంజల్‌సేవ నిర్వహించారు.