నేత్రపర్వంగా శ్రీవారి కల్యాణం | Special prayers at Penchalakona | Sakshi
Sakshi News home page

నేత్రపర్వంగా శ్రీవారి కల్యాణం

Published Sun, Sep 11 2016 1:03 AM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM

నేత్రపర్వంగా  శ్రీవారి కల్యాణం

నేత్రపర్వంగా శ్రీవారి కల్యాణం

రాపూరు: జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైనపెంచలకోనలో  శ్రీవారి కల్యాణాన్ని శనివారం నేత్రపర్వంగా నిర్వహించారు. ఉదయం పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మిదేవి, ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. 11 గంటలకు నిత్య కల్యాణమండపంలో లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మిదేవి, చెంచులక్ష్మిదేవి ఉత్సవ విగ్రహాలను కొలువుదీర్చి కల్యాణం జరిపారు. మధ్యాహ్న అన్నదానం చేశారు. సాయంత్రం 6గంటలకు  ఉత్సవవిగ్రహాలను తిరుచ్చిపై సహస్రదీపాలంకరణ మండపంలో కొలువుదీర్చి ఊంజల్‌సేవ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement