జగన్నాథ రథయాత్ర మహోత్సవాలు ప్రారంభం
జగన్నాథ రథయాత్ర మహోత్సవాలు ప్రారంభం
Published Sun, Jan 1 2017 10:38 PM | Last Updated on Tue, Sep 5 2017 12:08 AM
- ప్రారంభించిన టీజీ వెంకటేశ్
కర్నూలు (న్యూసిటీ) : అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) రెండేళ్లకోసారి నిర్వహిస్తున్న జగన్నాథ రథయాత్ర మహోత్సవాలు ఈ ఏడాదికి సంబంధించి ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ ప్రారంభించారు. శ్రీకృష్ణ భగవానుని విశ్వరూప ప్రదర్శన ఆకట్టుకునేలా ఉందని తెలిపారు. ఇస్కాన్ కర్నూలు ప్రాజెక్టు డైరెక్టర్ రూపేశ్వర్ చైతన్యదాస్ మాట్లాడుతూ నేటి నుంచి 8వ తేదీ వరకు మహోత్సవాలు జరుపుతామన్నారు. 7వ తేదీన రథయాత్ర, 8వ తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం శ్రీదామోదర దీపోత్సవాన్ని నిర్వహించారు. ఇస్కాన్ నరసరావుపేట ఇన్‌చార్జి వైష్ణవ కృపదాస్, కర్నూలు ఇన్‌చార్జి చైతన్య చంద్రపతి దాస్, మణికంఠ అయ్యప్పస్వామి దేవాలయం అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి ఈ. మల్లికార్జునరెడ్డి, భరతమాతృ మండలి అధ్యక్షురాలు ఇ.పద్మవతమ్మ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement