వీధి వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలి | To solve the street traders problems | Sakshi
Sakshi News home page

వీధి వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలి

Published Tue, Aug 2 2016 5:48 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM

వీధి వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలి

వీధి వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలి

హుజూర్‌నగర్‌ : పట్టణంలోని ప్రధాన రహదారి వెంట వీధి వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం స్థానిక నగరపంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోశపతి మాట్లాడుతూ కృష్ణా పుష్కరాల పేరుతో రహదారుల వెంట గల వీధి వ్యాపారుల దుకాణాలను, తోపుడు బండ్లను తొలగించారన్నారు. దీంతో వందలాది మంది వీధి వ్యాపారులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీంతో స్పందించిన నగరపంచాయతీ చైర్మన్‌ జక్కుల వెంకయ్య, కమిషనర్‌ సత్యనారాయణరెడ్డిలు వీధి వ్యాపారులతో చర్చలు జరిపారు. రహదారి ఆక్రమణకు గురికాకుండా వ్యాపారాలు నిర్వహించుకోవాలని సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌కె.అక్బర్, చంద్రు, వెంకటేశ్వర్లు, పిచ్చమ్మ, శేఖర్, సైదులు, రామయ్య, ప్రసాద్, రాజేష్, మట్టయ్య, నాగమణి, రమణ, ఆదెమ్మ, కొండలు పాల్గొన్నారు. 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement