street traders
-
వీధి వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు
రాజేంద్రనగర్: వీధి వ్యాపారుల జీవనోపాధిని మెరుగు పరిచేందుకు జీహెచ్ఎంసీ తరఫున గుర్తింపు కార్డులు అందిస్తూ, గ్రూపులను ఏర్పాటు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీధి వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి సర్కిల్లో స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ ప్రకారం ఏర్పాట్లు చేస్తామన్నారు. వారు దళారుల భారిన పడి మోసపోతున్నారని, సంపాదన అంతా వడ్డీలకే సరిపోతుందన్నారు. వారి ఇబ్బందులను పరిష్కరించేందుకు మూడు జోన్ లను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో జీహెచ్ఎంసీ ట్రాపిక్, లా ఆండ్ ఆర్డర్, స్థానిక వ్యాపారస్తులను సభ్యులుగా ఉంటారని తెలిపారు. వ్యాపారులకు గుర్తింపు కార్డులను ఇవ్వడంతో పాటు గ్రూపులు ఏర్పాటు చేశామన్నారు. గ్రూప్ సభ్యులంతా కలిసి పొదుపు చేసుకునేలా బ్యాంక్ అకౌంట్లను తెరిపించి వడ్డీలేని రుణాలు అందించనున్నట్లు తెలిపారు. జోన్ ల వారిగా వ్యాపారులకు అవకాశం కల్పించడం ద్వారా ట్రాపిక్కు సైతం ఎలాంటి ఇబ్బందులు ఉండవని, దీనిని వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఐదు గ్రూపులకు చెందిన 80 మందికి గుర్తింపు కార్డులు అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, ఉపకమిషనర్ దశరథ్, అధికారులు శ్రీనివాస్, పత్యానాయక్, ఆశోక్‌కుమార్, నాయకులు సుధాకర్‌రెడ్డి, సునీత, స్వామి, కృష్ణాయాదవ్, నర్సింగ్‌రావు, రవీందర్, విజయలక్ష్మి, వి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
వీధి వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలి
హుజూర్నగర్ : పట్టణంలోని ప్రధాన రహదారి వెంట వీధి వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం స్థానిక నగరపంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోశపతి మాట్లాడుతూ కృష్ణా పుష్కరాల పేరుతో రహదారుల వెంట గల వీధి వ్యాపారుల దుకాణాలను, తోపుడు బండ్లను తొలగించారన్నారు. దీంతో వందలాది మంది వీధి వ్యాపారులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీంతో స్పందించిన నగరపంచాయతీ చైర్మన్ జక్కుల వెంకయ్య, కమిషనర్ సత్యనారాయణరెడ్డిలు వీధి వ్యాపారులతో చర్చలు జరిపారు. రహదారి ఆక్రమణకు గురికాకుండా వ్యాపారాలు నిర్వహించుకోవాలని సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్కె.అక్బర్, చంద్రు, వెంకటేశ్వర్లు, పిచ్చమ్మ, శేఖర్, సైదులు, రామయ్య, ప్రసాద్, రాజేష్, మట్టయ్య, నాగమణి, రమణ, ఆదెమ్మ, కొండలు పాల్గొన్నారు. -
బండిపై బేరం... బతుకు భారం
సత్తెనపల్లి రోజంతా వీధుల్లో తిరిగితేనే వీధి వ్యాపారుల పొట్ట నిండేది. తోపుడు బండ్లనే నమ్ముకుని వీధుల వెంట తిరుగుతూ ఏరోజు కారోజు పెట్టుబడితో వ్యాపారం చేస్తున్న వారి బతుకులు దుర్భరమవుతున్నాయి. వారి కోసం ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా అమలుకు నోచలేదు. వీధి వ్యాపారులను గుర్తించి ఆర్థిక చేయూతనివ్వాలని మెప్మాకు మూడేళ్ల కిందట కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అప్పట్లో క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే సిబ్బంది కాకి లెక్కలు చూపారు. సుప్రీం కోర్టు సమగ్ర సర్వే చేయాలని, వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రత్యేక వాణిజ్య జోన్లు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీంతో జిల్లాలోని 12 పురపాలక సంఘాలు, గుంటూరు నగరంలో మరోసారి సర్వేకు శ్రీకారం చుట్టారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలోని పట్టణాల్లో సామాజిక కార్యకర్తలను ఎంపిక చేసి సమగ్ర సర్వే ప్రారంభించారు. మెప్మాలోని సిబ్బంది వారిని పర్యవేక్షిస్తున్నారు. ఒక్కో వీధి వ్యాపారి నుంచి వివరాలు సేకరించి దరఖాస్తులో నమోదు చేసి ఈ నెలాఖరులోగా సర్వే ముగించాల్సి ఉంది. ఇది ముఖ్యం... వీధి వ్యాపారి పాస్‌పోర్టు సైజు ఫొటో, వారి కుటుంబ సభ్యులతో ఉన్న ఫొటో, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, తాను ఏ ప్రాంతంలో, ఏ వస్తువులు విక్రయిస్తున్నాడో ధ్రువీకరించిన పత్రం ఇవ్వాల్సి ఉంది. ఆన్లైన్లో......... జిల్లాలోని తెనాలి, నరసరావుపేట, బాపట్ల, చిలకలూరిపేట, మాచర్ల, మంగళగిరి, పిడుగురాళ్ల, పొన్నూరు, సత్తెనపల్లి, రేపల్లె, తాడేపల్లి, వినుకొండ పురపాలక సంఘాల్లో 5,859 మందిని, గుంటూరు కార్పొరేషన్లో 2,769 మంది వీధి వ్యాపారులను గుర్తించారు. వారి నుంచి దరఖాస్తులు తీసుకుని ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. ఇంకా ఎవరైనా ఉంటే ఈ నెలాఖరులోగా నమోదు చేసుకుని, ఆధార్‌కు అనుసంధానం చేయనున్నారు. రోడ్డు ఆక్రమణల పేరుతో పట్టణాల్లో నిత్యం ట్రాఫిక్ పోలీసులతో ఇబ్బందులకు గురవుతున్న వీధి వ్యాపారుల సమస్యలు తీరాలంటే వాణిజ్య జోన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది.