కళాశాలలో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూసీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం ఐఎస్‌సదన్ డివిజన్ వినయ్‌నగర్ కాలనీలోని బోజిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు బాలు, దేవయ్యలు మాట్లాడుతూ..రోజు కూలీ లెక్కన కార్మికుల చేత పని చేయించుకుంటున్న కళాశాల యాజమాన్యం కార్మికులకు కనీస వేతనాలు అందించడంలో విఫలం అవుతున్నాయని అన్నారు. రోజుకు రూ. 500 వందల చొప్పున ప్రతి కార్మికునికి వేతనాలు అందించాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న బోజిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం కార్మికులకు జీతాలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. వెంటనే కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాలలో పని చేస్తున్న మహిళా సిబ్బంది, లక్ష్మయ్య, సీఐటీయూ ప్రతినిధులు పాల్గొన్నారు.