త్వరలోనే ఖరారు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు: భట్టి
నేషనల్ ఫిజికల్ సెక్యూరిటీ సమ్మిట్–24కు హాజరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పని చేస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు త్వరలో కనీస వేతనాలను ఖరారు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రస్తుతం ఇక్కడి కంటే తమిళనాడు, కర్ణాటకల్లో సెక్యూరిటీ గార్డుల వేతనాలు ఎక్కువగా ఉన్నాయని, త్వరలో తెలంగాణలో దేశంలోనే ఉత్తమమైన వేతనాలను సిఫార్సు చేయనున్నట్లు ఆయన తెలిపారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(టీజీ సీసీసీ)లో శుక్రవారం జరిగిన నేషనల్ ఫిజికల్ సెక్యూరిటీ సమ్మిట్–2024ను భట్టి విక్రమార్క ప్రారంభించారు.
హైదరాబాద్ పోలీసులు, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్‌సీఎస్సీ) సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ సమ్మిట్‌కు నగర కొత్వాల్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి, అదనపు డీజీ (శాంతిభద్రతలు) మహేశ్‌ఎం.భగవత్, అదనపు సీపీ (శాంతిభద్రతలు) విక్రమ్‌సింగ్ మాన్‌తో పాటు హెచ్‌సీఎస్సీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. డిçప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ..’’రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు 3.5 లక్షల వరకు ఉండగా.. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు 4 లక్షల మంది ఉన్నారు. అపారమైన ఉద్యోగావకాశాలు ఉన్న ఈ రంగం యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. ఈ సమ్మిట్ చేసే సిఫార్సులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది.’’అని చెప్పారు.
సెక్యూరిటీ ఏజెన్సీలు రిజి్రస్టేషన్ చేసుకోవాలి: సీపీ
నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు ఇప్పటికీ తక్కువ జీతాలే ఇస్తున్నారు. రాష్ట్రంలో 1500 ఏజెన్సీలు ఉండగా... 500 మాత్రమే రిజి్రస్టేషన్ చేసుకున్నాయి. మిగిలినవీ రిజి్రస్టేషన్ చేసుకోవాలి’అని పేర్కొన్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఏదైనా ఉదంతం జరిగినప్పుడు ఫస్ట్ రెస్పాండెంట్స్‌గా మారాలని అదనపు డీజీ (శాంతిభద్రతలు) మహేశ్ ఎం.భగవత్ పిలుపునిచ్చారు. ‘పోలీసులు వచ్చే వరకు నేర స్థలిని పరిరక్షించాలి.
చట్ట వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతి అంశాన్నీ గుర్తిస్తూ, సంబంధిత శాఖలు, పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ప్రైవేట్ సెక్యూరిటీలకు సంబంధించిన పసేరా చట్టం కూడా అదే చెప్తోంది. సెక్యూరిటీ గార్డులు ఇలా రూపొందేలా ప్రతి ఏజెన్సీ వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. పోలీసు విభాగం అప్పట్లో నక్సలైట్లతో ఇప్పుడు సైబర్ క్రిమినల్స్‌తో పోరాటం చేస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే సైకిల్ పెట్రోలింగ్ పోయి సైబర్ పెట్రోలింగ్ వచి్చంది’అని మహేశ్‌భగవత్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment