కళ్లున్నకబోదిలా ప్రభుత్వాలు
హిందూపురం టౌన్ : ప్రభుత్వాలు, అధికారులు కార్మికులపై కళ్లుండి కబోదిలా వ్యవహరిస్తున్నాయని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు ఓబులు ధ్వజమెత్తారు. మంగళవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు ఓబులు, ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు రామకష్ణారెడ్డి పాల్గొని మాట్లాడారు. పరిగి మండలంలో ఉన్న ఎస్‌ఏ రావ్‌తార్ పరిశ్రమలో అన్యాయంగా 193 మంది కార్మికులను తొలగించి 15 నెలలు గడిచినా ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. చట్టం ప్రకారం కనీస వేతనాలు పెంచాలని yì మాండ్ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు.
దీనిపై వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, రైతు, యువజన సంఘాలు, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, వైఎస్సార్‌టీయూ ఆధ్వర్యంలో ఎస్‌ఏ రావ్‌తార్ కార్మిక సంఘీభావ కమిటీగా ఏర్పడి బుధవారం నుంచి పాదయాత్ర చేపట్టామన్నారు. హిందూపురంలో ప్రారంభమై అనంత కలెక్టరేట్ వరకు యాత్ర సాగుతుందన్నారు. దీంతో పాటు 16న కదిరి, 17న గుంతకల్లు, 18న తాడిపత్రిలో పాదయాత్రలు ప్రారంభమవుతాయని చెప్పారు. సమావేశంలో సీఐటీ యూ డివిజన్ కార్యదర్శి జెడ్పీ శ్రీనివాసులు, నాయకులు రాజప్ప, నారాయణస్వామి, లింగారెడ్డి, పురుషోత్తం, రాము, వినోద్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.