28 నుంచి శ్రామిక మహిళా జాతీయ మహాసభలు
గుంటూరు వెస్ట్: శ్రామిక మహిళా 11వ అఖిల భారత మహాసభలు ఈనెల 28 నుంచి 30 వరకు గుంటూరులోని రెవెన్యూ కళ్యాణ మండపంలో జరుగుతాయని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.బాలకాశి తెలిపారు. బ్రాడీపేటలోని యూనియన్ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 28న మధ్నాహ్నం 2 గంటలకు ‘శ్రామిక మహిళలు, జీవన భద్రత’ అనే అంశంపై సదస్సు జరుగుతుందని చెప్పారు. సదస్సుకు శ్రామిక మహిళా జాతీయ కన్వీనర్ డాక్టర్ కే.హేమలత, శ్రామిక మహిళా అఖిల భారత నాయకురాలు ఎస్.వరలక్ష్మి ముఖ్యఅతిధులుగా హాజరై ప్రసంగించనున్నారని తెలిపారు. 29, 30 తేదీలలో ప్రతినిధుల సభ జరుగుతాయని చెప్పారు. 29న సాయంత్రం 5 గంటలకు బ్రాడీపేటలోని యూటీఎఫ్ హాలులో ‘ప్రస్తుత పరిస్థితులు, ఉద్యోగ కార్మికవర్గం ముందున్న సవాళ్లు’ అనే అంశంపై సదస్సు జరుగుతుందని చెప్పారు. సీఐటీయు జాతీయ అధ్యక్షుడు ఏ.కె.పద్మనాభన్ సదస్సుకు హాజరై ప్రసంగించారని తెలిపారు. ఈసందర్భంగా మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ పోస్టర్‌ను ఆవిష్కరించారు.