women workers
-
మహిళలు పనిచేసే ఎన్జీవోల మూత
కాబూల్: అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్ పాలకులు మహిళలకు వ్యతిరేకంగా మరో నిర్ణయం తీసుకున్నారు. తమ దేశ మహిళలు పనిచేసే జాతీయ, విదేశీ ప్రభుత్వేతర సంస్థలన్నిటినీ మూసివేయనున్నట్లు సోమవారం ప్రకటించారు. ఇస్లాం సిద్ధాంతాల ప్రకారం ధరించాల్సిన హిజాబ్‌ను ఆయా సంస్థల్లోని అఫ్గాన్ మహిళలు ధరించకపోవడమే ఇందుకు కారణమన్నారు. ఆర్థిక శాఖ ఆదివారం రాత్రి ‘ఎక్స్’లో ఈ విషయం వెల్లడించింది. తమ ఉత్తర్వులను బేఖాతరు చేసే సంస్థల లైసెన్సులను రద్దు చేస్తామని, కార్యకలాపాలను నిలిపివేస్తామని కూడా అందులో హెచ్చరించింది. నాన్ గవర్నమెంటల్ సంస్థల రిజిసే్ట్రషన్, సమన్వయం, నిర్వహణ, పర్యవేక్షణ సహా అన్ని కార్యకలాపాల బాధ్యత తమదేనని స్పష్టం చేసింది. తాలిబాన్ నియంత్రణలో లేని సంస్థలు అన్నిటిలోనూ మహిళలు పనిచేయడం ఆపేయాలని మరోసారి హుకుం జారీ చేసింది. అత్యవసరమైన మానవతా సాయం అందించే కార్యక్రమాల్లోనూ మహిళల ప్రాతినిథ్యాన్ని తాలిబన్లు అడ్డుకుంటున్నారని ఇటీవల ఐరాస సైతం ఆరోపించడం గమనార్హం. బాలికలు ఆరో గ్రేడ్ మించి చదువుకోరాదని, బహిరంగంగా కనిపించే విధుల్లో పాల్గొనరాదని ఇప్పటికే తాలిబన్ పాలకులు నిషేధం విధించడం తెలిసిందే. కిటికీల నుంచి మహిళలు కనిపించొద్దు తాలిబన్ నేత హిబతుల్లా అఖుంద్జాదా మరో తాఖీదు జారీ చేశారు. మహిళలు, నిలబడి లేదా కూర్చున్నట్లుగా కనబడేలా భవనాలకు కిటికీలు ఉండరాదన్నారు. కొత్తగా నిర్మించే వాటితోపాటు ఇప్పటికే ఉన్న భవనాలకు సైతం ఈ నిబంధన వర్తిస్తుందన్నారు. వరండాలు లేదా వంటగదులు కనిపించేలా కిటికీలు ఏర్పాటు చేయవద్దన్నారు. ఒక వేళ కిటికీలుంటే భవన యజమాని ఆ స్థానంలో గోడను నిర్మించడం లేదా ఏదైనా అడ్డుగా ఉంచడం చేయాలన్నారు. నివాస భవనాల్లోపలి భాగం కనిపించేలా కొత్తగా భవన నిర్మాణం చేయరాదని ఆయన మున్సిపల్, ఇతర అధికారులకు సైతం నిర్దేశించడం గమనార్హం. -
ఇంట్లో రెస్ట్ లేదు... ఆ‘పీస్’ లేదు
పూర్వం పురుషుడి సంపాదనకు స్త్రీ సంపాదన తోడైతే ‘ఏదో వేణ్ణీళ్లకు చన్నీళ్లు తోడు’ అనేవారు. రాను రాను స్త్రీ సంపాదన ప్రధానం అయ్యింది. స్త్రీలు ఇంటి పని, ఉద్యోగం చేయాల్సి వస్తోంది. కాని పని గంటలు వారి జీవితాలను కబళిస్తున్నాయా? ప్రయివేటు ఉద్యోగాలు పది గంటలు డిమాండ్ చేస్తుంటే సేల్స్ విమెన్ గానో, చిన్న ఉద్యోగాల్లోనో ఉండే మహిళలు ఏకంగా 12 గంటలు చేయాల్సి వస్తోంది. కుటుంబ, సాంఘిక, సామాజిక జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఈ పని గంటలపైకార్మిక చట్టాలు ఏమీ చేయడం లేదు. స్త్రీలు ప్రాణాలు ΄ోయేంతగా వొత్తిడి అనుభవించాలా?ఇటీవల పూణెలో అన్నా సెబాస్టియన్ అనే యువ చార్టర్డ్ అకౌంటెంట్ తను పని చేసే సంస్థలో ఒత్తిడి తట్టుకోలేక మరణించింది. మంగళవారం (సెప్టెంబర్ 24) లక్నోలోని ఒక ప్రయివేట్ బ్యాంకులో పని చేస్తున్న ఫాతిమా అనే ఉద్యోగిని కుర్చీలోనే కుప్పకూలి మరణించింది. పని ఒత్తిడి వల్లే అని సహోద్యోగుల ఆరోపణ. ఇవి తెలిసి. తెలియనివి ఇంకెన్నో.స్త్రీలకు రెండు ఉద్యోగాలుఉదయం ఎనిమిదన్నర నుంచి రాత్రి ఎనిమిదన్నర వరకూ పని చేస్తే తప్ప జీతం రాని ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలు మన దేశంలో కోట్ల సంఖ్యలో ఉన్నారు. సేల్స్‌గర్ల్స్, హాస్పిటల్ స్టాఫ్, హోటల్ రంగం, కాల్ సెంటర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫ్యాక్టరీ వర్కర్లు... 12 గంటలు చేయలేం అంటే 10 గంటలు అడుగుతున్నారు. అదీ కాదంటే 9 గంటలకు ఒక్క నిమిషం కూడా తక్కువ కాకుండా పని చేయాలన్నది వాస్తవం. ఈ 9 గంటలతో పాటు రాక΄ోకల సమయం కూడా కలుపుకుంటే స్త్రీలకు ఇంటి పనికీ, పిల్లల పెంపకానికి, విశ్రాంతికీ మిగిలే సమయం ఎంత?జీవితం గడవడానికి సంపాదన చాలా ముఖ్యమయ్యాక, ఆ సంపాదనలో ప్రధాన భాగం పిల్లల చదువుకు, వైద్యానికి, రవాణాకు ఖర్చు చేయకతప్పని పరిస్థితుల్లో భార్యాభర్తలు పని చేయక తప్పడం లేదు. మగాడిగా భర్తకు ఉద్యోగ వొత్తిడి తప్పదు. కాని స్త్రీలకు ఇంటి బాధ్యత కూడా ఉంటుంది. వంట వారే చేయాలి. ఇక పిల్లల పనులు, బట్టలు ఉతకడం, ఇంటి శుభ్రత, ఆతిథ్యం, అత్తమామలు ఉంటే వారి బాగోగులు... ఇవన్నీ భారమే. ఇటు ఈ పని అటు ఆ పని వీటి మధ్య సమన్వయం చేసుకోలేక మౌనంగా వొత్తిడి ఎదుర్కొంటూ అనారోగ్యం తెచ్చుకుంటూ ఒక్కోసారి ప్రాణాల మీదకు వచ్చే స్థితికి చేరువ చేస్తోంది మహిళా ఉపాధి.ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలలో కొంత వెసులుబాటు ఉండేది. కాని ప్రస్తుతం వారి పని ఒత్తిడి కూడా తక్కువగా లేదు. సుఖమైన బ్యాంకు ఉద్యోగం ఇప్పుడు పచ్చి అబద్ధం. చాలా చాకిరి అందులో ఉంటోంది. పెద్ద జీతాల సాఫ్ట్వేర్ రంగం విషయానికి వస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాక ఇరవై నాలుగ్గంటలు పనే అనే భావన కలుగుతోంది. ‘మల్టీ నేషనల్ కంపెనీలు భారతీయ ఉద్యోగులను మనుషుల్లా కాకుండా గాడిదలతో సమానంగా చూస్తున్నాయి’...‘లాగిన్ చేయడం వరకే మా చేతుల్లో ఉంటుంది. ఆ తర్వాత ఎన్ని గంటలు పని చేస్తామో మాకే తెలియదు’ అనే మాటలు ఆ రంగంలో సర్వసాధారణం అయ్యాయి. ఈ నేపథ్యంలో స్త్రీలు తమ ఉద్యోగ, కుటుంబ జీవితాలను నిర్వహించుకోవడానికి సతమతమవుతున్నారు.వారానికి 60 గంటలుఈ మధ్య కాలంలో సాఫ్ట్వేర్ రంగంలో ఎవర్ని పలకరించినా చేస్తున్న ఉద్యోగం గురించి గొప్పగా చెప్పుకోవడం కంటే ఆవేదన వ్యక్తం చేసే సందర్భాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. లైఫ్‌కు భరోసా ఇవ్వాల్సిన ఉద్యోగాలే ప్రాణాలను హరిస్తున్నాయనడానికి పూణెలో అన్నా సెబాస్టియన్ అనే మహిళ పని ఒత్తిడితో మరణించడం ఒక ఉదాహరణ మాత్రమే. 26 ఏళ్ల చార్టెడ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ ఉద్యోగంలో చేరిన కొన్ని నెలలకే దారుణమైన వర్క్ కండిషన్స్ కారణంగా ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోయింది. భారత్‌లో యువ మహిళా ఉద్యోగులు ప్రపంచంలో అందరి కంటే ఎక్కువ గంటలు పనిచేస్తున్నారని తాజా సర్వేలు చెబుతున్నాయి. వారానికి 40 గంటలు పాత మాటగా మారగా 55 నుంచి 60 గంటలు మహిళలతో కార్పోరేట్ కంపెనీలు పని చేయించుకుంటున్నాయి. సాఫ్ట్వేర్, ఐటీ, ఫైనాన్స్ రంగాల్లో రోజుకు 18 గంటల పని విధానం సర్వసాధారణంగా మారి΄ోయింది. పని గంటలు ముగిసినా ఇంట్లో ఉన్నా చివరకు వారాంతమైనా సరే టార్గెట్లు పూర్తి చేయించుకోవడానికి ఆయా సంస్థలు ఉద్యోగులను వెంటాడుతున్నాయి. కుటుంబం, వ్యక్తిగత జీవితంతోపాటు ఆరోగ్యాన్ని కూడా త్యాగం చేస్తే తప్ప ఈ తరహా ఉద్యోగాలు చేయలేని పరిస్థితి.హక్కులు ఏవి? చట్టాలు ఎక్కడ?చట్టాలను కఠినంగా అమలు చేసే దేశాల్లో ఇంత చాకిరి చెల్లుబాటు కాదు. ప్రపంచంలో అతి తక్కువ పని గంటలున్న 20 దేశాల్లో ఇండియా ఊసు కూడా లేదు. మన దేశంలో జీవించడానికి ఉద్యోగం చేస్తున్నామా లేక ఉద్యోగం చేయడమే జీవితమా అన్న స్థాయిలో పని కబళించేస్తోంది. ఒకరకంగా మానవ హక్కుల ఉల్లంఘనే జరుగుతోంది. వర్క్ కండిషన్స్ ఎలా ఉండాలి అనే అంశంపై 1948లో ‘యూనివర్సల్ డిక్లరేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్’ను మెజార్టీ దేశాలు ఆమోదించాయి. ఉద్యోగుల హక్కులను కాపాడే ఈ డిక్లరేషన్ ను రూ΄÷ందించడంలో భారత్ కూడా కీలక పాత్ర ΄ోషించింది. అయితే దానికి కట్టుబడి చట్టాలను అమలు చేయడంలో మాత్రం మన ప్రభుత్వాలు, వ్యవస్థలు విఫలమవుతున్నాయి. అందుకే భారతీయులతో గొడ్డుచాకిరీ చేయించుకునే సంస్థలు పెరిగి΄ోయాయి.స్మార్ట్‌వర్క్‌ను ప్రోత్సహించాలిఎక్కువ గంటలు పని చేయడం ఉద్యోగి డెడికేషన్ కు ఏమాత్రం కొలమానం కాదన్న విషయాన్ని సంస్థలు గుర్తించాలి. వర్కింగ్ కండిషన్స్ ఏమాత్రం సానుకూలంగా లేని చోట హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ చేయడం చాలా అవసరం. ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలంటే ‘నో’ చెప్పడం ఒక్కటే ఉత్తమమైన మార్గం. ఇన్ని గంటలు ఇంత పనే చేయగలం అని చె΄్పాలి. ఎవరి జీవితం వాళ్ల చేతుల్లోనే ఉండాలంటే మొహమాటాలను పక్కన పెట్టి నో చెప్పడానికి సిద్ధంగా ఉండాలి.ఫ్యాక్టరీస్ చట్టం 1948, మైన్స్ చట్టం, బీడీ– సిగార్ కార్మికుల చట్టం మొదలగు చట్టాల కింద ప్రత్యేక సందర్భాలలో తప్ప ఉదయం 6 నుంచి సాయంత్రం 7 వరకు మాత్రమే స్త్రీలు పని చేయాల్సి ఉంటుంది. ఈ పని వేళలు దాటి రాత్రి 10 వరకు పనిచేయాలి అంటే సదరు యాజమాన్యం ప్రత్యేకమైన వసతులు; రక్షణ, రవాణా వంటివి కల్పించాల్సి ఉంటుంది. అయితే ఈ పని వేళలు సాఫ్ట్వేర్ రంగానికి కూడా వర్తించినప్పటికీ, కొన్ని వెసులుబాటులను ప్రభుత్వం ఐటీ రంగానికి కల్పించింది. అయినప్పటికీ స్త్రీలను రాత్రి వేళలో పనిచేయాలి అని ఏ యాజమాన్యం కూడా ఒత్తిడి చేయడానికి వీలులేదు. ఒకవేళ అలా పని చేయాల్సి వస్తే రవాణా, చిన్నపిల్లల సౌకర్యార్థం (క్రెచ్) సదుపాయాలు కల్పించాల్సి వుంటుంది. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిస్త్రీలకు పిల్లల పెంపకం, ఇంటి పని భారం, ఉద్యోగ భారం... ట్రిపుల్ బర్డన్ కలిగిస్తున్నాయి. ఇంటిని చూసుకోవాలి... సంపాదించాలి... అంటే రెండు చోట్లా ఆమె ఉత్పాదనను పరీక్షకు పెడుతున్నట్టే లెక్క. ఈ రెండు పనులు ఆమెకు సౌకర్యంగా లేక΄ోతే శారీరకంగా మానసికంగా చాలా సమస్యలు వస్తున్నాయి. మానసికంగా యాంగ్జయిటీ, డిప్రెషన్ చూస్తున్నాం. ఇక ఎముకల బలం క్షీణించడం, బహిష్టు సమస్యలు... కనపడుతున్నాయి. కొందరిలో ఇన్ఫెర్టిలిటీ పెరుగుతోంది. భార్యాభర్తల మధ్య సమన్వయమే ఈ పరిస్థితి నుంచి స్త్రీలను బయటపడేయగలదు.– డాక్టర్ ఆరతి బెల్లారి, కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్– ఫణికుమార్ అనంతోజు, సాక్షి -
స్రీల శ్రమకు అర్థం లేదా..!
మహిళలకు ఉపాధి దానివల్ల వారికి ఆర్థిక స్వావలంబన సమాజంలో లైంగిక వివక్షను చెరపగలదు. కాని స్త్రీ, పురుషులకు ఉపాధి కల్పించడంలో వివక్ష కొనసాగుతూనే ఉంది. తమ జీతభత్యాల బేరసారాల్లో స్త్రీల గొంతు బలపడుతున్నా వారు పొందుతున్నది తక్కువే. ఇక పనిచోట వారి శ్రమదోపిడి తీవ్రం. తమిళనాడులో విస్తారంగా ఉన్న రెడిమేడ్ దుస్తుల రంగంలో స్త్రీల పని పరిస్థితులు ఒక నమూనా. శ్రమ తప్ప ఆదాయం లేని ఉపాధి స్త్రీలకు కొనసాగాల్సిందేనా? స్త్రీలు ఉపాధి పొందాలంటే అంత సులభమా? చెంగల్పట్టులో ఉన్న అనేక ఎక్స్పోర్ట్ గార్మెంట్స్ మాన్యుఫ్యాక్చర్ కంపెనీల్లో ఆ చుట్టుపక్కల పల్లెల్లోని స్త్రీలు వేలాదిగా పని చేస్తారు. వారంతా ఉదయం నాలుగున్నరకే లేచి ఇంట్లో వంట చేసి పిల్లలకు క్యారేజీలు కట్టి తాము టిఫిన్, లంచ్ కట్టుకుని ఏడూ ఏడున్నరకంతా కంపెనీ బస్సు కోసం నిలుచోవాలి. 9 గంటలకు ఫ్యాక్టరీలో డ్యూటీ ఎక్కితే తిరిగి సాయంత్రం 6 గంటల వరకూ నిలుచునే పని చేయాలి. మళ్లీ బస్సెక్కి ఇల్లు చేరి రాత్రి వంటకు పూనుకోవాలి. ఇంతా చేసి వారికి నెలకు దక్కేది ఎంతో తెలుసా? 9,500 రూపాయలు. సీనియర్లకైతే 10,500 రూపాయలు. ట్రాన్స్పోర్ట్ కటింగు, ఫ్యాక్టరీలో ఇచ్చిన టీ, బిస్కెట్ల కటింగు పోను వచ్చే జీతం ఇంతే. కాని వీరు తయారు చేసిన బట్టలు పోలో, ఇండియన్ టెరైన్ వంటి బ్రాండ్లుగా యూరప్, జపాన్, కెనడా, అమెరికాల్లో ఖరీదైన వెలకు అమ్ముడుపోతాయి. తమిళనాడులో గార్మెంట్ ఫ్యాక్టరీల్లో 5 లక్షల మంది స్త్రీలు పని చేస్తున్నారు. మొత్తం ఆ రాష్ట్రంలో 18 లక్షల మంది టైలరింగ్ ఉపాధిలో ఉంటే వారిలో 60 శాతం మంది మహిళలు. తమిళనాడులో వ్యవసాయం తగ్గాక రైతు కూలీలుగా పని చేసే స్త్రీలు ఫ్యాక్టరీల వైపు అడుగులు వేస్తున్నారు. కాని వారి శ్రమను దోచుకునే సమస్త ఏర్పాట్లు ఇదివరకే జరిగిపోయి ఉన్నాయి. అందుకే ఇటీవల చెన్నైలో ఈ ఫ్యాక్టరీలలో పనిచేసే స్త్రీలు నిరసన వ్యక్తం చేశారు. కోర్టులు కూడా వీరి జీతం పెంచమని చెప్పినా తమిళనాడులోని 500 మంది గార్మెంట్ ఫ్యాక్టరీల యజమానులు జీతాలు పెంచితే ఖర్చు పెరిగి ఆర్డర్లు తగ్గుతాయని, దుస్తుల కంపెనీలు ఆర్డర్లను శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాలకు చీప్ కూలీల కోసం తరలిస్తాయని అభ్యంతరం చెబుతున్నారు. అయితే ఆ మాటలన్నీ సాకులే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొత్త జీతాలైనా ఎంతని? 15,000 మాత్రమే. ఆ 15 వేలు కూడా ఇవ్వం అంటున్నారు. స్త్రీలు ఉపాధి పొందితే ఆ ఆర్థిక స్వావలంబనతో వారిలో ఆత్మవిశ్వాసం కలుగుతుంది. కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు వారి అభిలాషల మేరకు నెరవేర్చుకోవచ్చు. భర్తమీద ఆధారపడవలసిన పని లేకుండా నిర్ణయాలు తీసుకోవచ్చు. కాని వారికి లభిస్తున్న ఉపాధి వారికి ఏ ఆదాయమూ మిగల్చనిది అయితే ఆ శ్రమకు అర్థం లేదు. జీతాలు ఎప్పుడూ పురుషుల కోసమే అనే మైండ్‌సెట్ సమాజంలో పోలేదు. స్త్రీల జీతం కోసం పెంపునకు యోగ్యమైనదే అని గ్రహించినప్పుడే పరిస్థితిలో కొద్దిగానైనా మార్పు వస్తుంది. ఇవి చదవండి: మీ అమ్మాయికి చెప్పండి! -
మహిళలది జీతం బత్తెం లేని చాకిరి.. రోజూ బండెడు చాకిరీ.. పురుషులు మాత్రం!
అహ్మదాబాద్ : మహిళలు ఇంట్లో జీతం బత్తెం లేకుండా బండెడు చాకిరీ చేస్తున్నారని, రోజుకున్న 24 గంటల సమయం సరిపోవడం లేదని గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) తాజా అధ్యయనంలో వెల్లడైంది. జీతం లేని ఇంటి పనిని పురుషులు 2.8 గంటలు చేస్తే మహిళలు 7.2 గంటల సేపు ఇంటిపనుల్లోనే ఉంటున్నారని ఆ అధ్యయనంలో తేలింది. అధ్యయనం ఏం చెప్పిందంటే.. ఆఫీసులో పని చేస్తూ సంపాదిస్తున్న మహిళలు కూడా పురుషుల కంటే రెండు రెట్లు ఎక్కువగా ఇంటి పనుల్లో నిమగ్నమైపోతున్నారు. ఇల్లు శుభ్రం చేయడం, వంట చేయడం, పిల్లల్ని చూసుకోవడం వంటి పనులన్నీ మగవారి కంటే మహిళలే ఎక్కువగా చేస్తున్నారు. 15 నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళలందరూ రోజుకి 7 గంటలకు పైగా ఇంటి పనులు చేస్తున్నారు. ఈ విషయం జగమెరిగిన సత్యమే అయినప్పటికీ ‘‘టైమ్ యూజ్ డేటా : ఏ టూల్ ఫర్ జెండర్డ్ పాలిసీ అనాలిసిస్’’ పేర ఎంత సేపు మహిళలు జీతం లేని చాకిరీ చేస్తున్నారో సర్వే చేయగా మహిళలు సగటున రోజుకి 7.2 గంటలు ఇంటి పనులు చేస్తూ వస్తూ ఉంటే , మగవాళ్లు 2.8 గంటలు మాత్రమే చేస్తున్నారని తేలినట్టుగా ఐఐఎంఏ ప్రొఫెసర్ నమ్రత చందార్కర్ తెలిపారు. -
మహిళా కార్మికుల ముందంజ
సాక్షి, అమరావతి: దేశంలో మహిళా శ్రామిక శక్తి నాలుగేళ్లలో 6.4 శాతం మేర పెరిగింది. పురుషుల కన్నా మహిళా కార్మికుల సంఖ్య పెరుగుదల ఎక్కువగా ఉంది. పట్టణాల్లో కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే ఇది ఎక్కువగా ఉందని నీతి ఆయోగ్ వెల్లడించింది. 2017–18లో మహిళా కార్మిక శక్తి 23.1 శాతం ఉంటే 2020–21 నాటికి అది 29.5 శాతానికి చేరిందని పేర్కొంది. ఈ కాలంలో దేశంలో ఉపాధి, శ్రామిక శక్తిలో చోటుచేసుకున్న మార్పులపై నీతి ఆయోగ్ తన అధ్యయన నివేదికను విడుదల చేసింది. 2017–18లో దేశంలో 485.3 మిలియన్ల కార్మిక శక్తి ఉండగా 2020–21 నాటికి అది 563.7 మిలియన్లకు పెరిగింది. అంటే.. మూడేళ్లలో 16.15 శాతం మేర పెరిగింది. కార్మిక శక్తి పెరుగుదల పురుషులతో పాటు మహిళా జనాభాలో కూడా నమోదైంది. అలాగే, ఈ పెరుగుదల పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉందని నివేదిక తెలిపింది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఈ పెరుగుదల తక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది. దేశంలో 2019–20లో గ్రామీణ కార్మిక శక్తి 70.7 శాతం ఉండగా 2020–21లో 73 శాతానికి పెరిగింది. పట్టణాల నుంచి పల్లెలకు వలసలు ఇక కోవిడ్ సమయంలో ఆసక్తికరంగా పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వలసలు జరిగాయని నివేదిక తెలిపింది. దీంతో ఆ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో కార్మిక శక్తి 8 శాతం మేర పెరుగుదల ఉంటే పట్టణ ప్రాంతాల్లో మూడు శాతం తగ్గింది. మూడేళ్లుగా మహిళా కార్మిక శక్తి పురుషుల కన్నా ఎక్కువ శాతం పెరిగింది. ఈ పెరుగుదల గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. నిరుద్యోగ రేటూ తగ్గుముఖం మరోవైపు.. దేశంలో 2017–18 నుంచి నిరుద్యోగ రేటు తగ్గుతూ వస్తోందని నివేదిక పేర్కొంది. 2017–18లో నిరుద్యోగ రేటు 6.07 శాతం ఉండగా 2018–19లో 5.84 శాతానికి.. 2019–20లో 4.84 శాతానికి, 2020–21లో 4.33 శాతానికి తగ్గినట్లు తెలిపింది. అదే సమయంలో.. రాష్ట్రంలో 2018–19లో నిరుద్యోగత రేటు 5.3 శాతం ఉండగా 2020–21 నాటికి 4.1 శాతనికి తగ్గింది. దేశంలో పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగత రేటు తక్కువగా ఉంది. కోవిడ్–19తో ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం పడినప్పటికీ కూడా పరిశ్రమ, సేవల రంగాల్లో 2019–20 నుంచి 2020–21 మధ్య ఉద్యోగాల సంఖ్య పెరిగింది. పరిశ్రమల రంగంలో 2018–19లో 4.8 మిలియన్ల ఉద్యోగాలు జోడించగా 2019–20లో 3.4 మిలియన్ల ఉద్యోగాలు, 2020–21లో 7.6 మిలియన్ల ఉద్యోగాలు పెరిగినట్లు నివేదిక పేర్కొంది. అలాగే, సర్వీసు రంగంలో కూడా 2018–19లో 10.1 మిలియన్ల ఉద్యోగాలు 2019–20లో 6 మిలియన్ ఉద్యోగాలు, 2020–21లో 2.3 మిలియన్ ఉద్యోగాలు పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. -
గయ డిప్యూటీ మేయర్‌గా పారిశుద్ధ్య కార్మికురాలు
పట్నా: పారిశుద్ధ్య కార్మికురాలిని డిప్యూటీ మేయర్ పదవికి ఎన్నుకోవడం ద్వారా బిహార్‌లోని గయ మున్సిపాలిటీ ప్రజలు చరిత్ర సృష్టించారు. చింతాదేవి గత 40 ఏళ్లుగా మున్సిపాలిటీలో స్కావెంజర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈమె 16వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. 1996లో కూడా గయ ప్రజలు ముసాహిర్ వర్గానికి చెందిన రాళ్లు కొట్టుకునే భగవతీదేవి అనే సాధారణ మహిళను లోక్‌సభకు పంపారు. -
ఆటోమొబైల్ రంగంలో సత్తా చాటుతున్న వనితలు
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ తయారీలో సహజంగా పురుషులదే ఆధిపత్యం. అలాంటి చోట మహిళలూ రాణిస్తున్నారు. క్రమంగా తమ స్థానాన్ని బలోపేతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో లింగ సమానత్వం/లింగవైవిధ్యం (పనివారిలో స్త్రీ, పురుషలకు సమ ప్రాధాన్యం) కోసం ప్రముఖ కంపెనీలైన టాటా మోటార్స్, ఎంజీ, బజాజ్ ఆటో, హీరో మోటో కార్ప్ చర్యలు తీసుకోవడం హర్షణీయం. టాటా మోటార్స్‌కు చెందిన ఆరు తయారీ ప్లాంట్లలోని షాప్ ఫ్లోర్లలో సుమారు 3,000 మంది మహిళలు పనిచేస్తున్నారు. చిన్న కార్ల నుంచి వాణిజ్య వాహనాల తయారీ వరకు వివిధ హోదాల్లో వీరు సేవలు అందిస్తున్నారు. తయారీ కేంద్రాల్లో మరింత మంది మహిళలను నియమించుకునే ప్రణాళికలతో టాటా మోటార్స్ ఉంది. టాటా మోటార్స్ పుణె ప్యాసింజర్ వాహన ప్లాంట్‌లో గత రెండేళ్లలోనే మహిళా కార్మికుల సంఖ్య 10 రెట్లు పెరిగింది. 2020లో 178 మంది ఉంటే, వారి సంఖ్య 1,600కు చేరింది. ‘‘పుణెలో పూర్తిగా మహిళలతో కూడిన తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడాన్ని సవాలుగా తీసుకున్నాం. ఇప్పటికే 1,100 మంది మహిళలను నియమించుకున్నాం. వచ్చే రెండేళ్లలో వీరి సంఖ్యను 1,500కు చేర్చే దిశగా పనిచేస్తున్నాం’’అని టాటా మోటార్స్ చీఫ్ హ్యుమన్ రీసోర్సెస్ ఆఫీసర్ రవీంద్ర కుమార్ తెలిపారు. ఎంజీ మోటార్ ఆదర్శనీయం.. ఎంజీ మోటార్ ఇండియా అయితే స్త్రీ, పురుషులు సమానమేనని చాటే విధంగా 2023 డిసెంబర్ నాటికి తన మొత్తం ఫ్యాక్టరీ సిబ్బందిలో మహిళల వాటాను 50 శాతానికి చేర్చాలన్న లక్ష్యం దిశగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థకు చెందిన గుజరాత్‌లోని హలోల్ ప్లాంట్‌లో మొత్తం 2,000 మంది పనిచేస్తుండగా.. మహిళల వాటా 34 శాతంగా ఉంది. తయారీలో కీలకమైన పెయింట్ నాణ్యత, సర్ఫెస్ టెస్టింగ్, పరిశోధన, అభివృద్ధి, అసెంబ్లీ తదితర బాధ్యతల్లోకి మహిళలను తీసుకుంటోంది. జనరల్ మోటార్స్ నుంచి 2017లో హలోల్ ప్లాంట్‌ను సొంతం చేసుకోగా, ఇక్కడి సిబ్బందిలో స్త్రీ, పురుషులను సమానంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. దీనివల్లే మహిళా సిబ్బంది సంఖ్య గణనీయంగా పెరిగింది. పరిశ్రమలో అధిక లింగ వైవిధ్యాన్ని ఇప్పటికే ఎంజీమోటార్స్ సాధించినప్పటికీ.. 50:50 నిష్పత్తికి చేర్చే లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్టు సంస్థ డైరెక్టర్ (హెచ్ఆర్) యశ్వింద్ పాటియాల్ తెలిపారు. హీరో మోటోలో 9.3 శాతం ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్‌లో ప్రస్తుతం 1,500 మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. లింగ సమానత్వ రేషియో 2021–22 నాటికి 9.3 శాతంగా ఉంది. సమీప కాలంలో దీన్ని మరింత పెంచుకునే లక్ష్యంతో కంపెనీ ఉంది. బజాజ్ ఆటో చకాన్ ప్లాంట్‌లో డోమినార్ 400, ఆర్ఎస్ 200 తయారీకి ప్రత్యేకంగా మహిళలనే వినియోగిస్తోంది. 2012-14 నాటికి 148 మందిగా ఉన్న మహిళా ఉద్యోగుల సంఖ్య 2021-22 నాటికి 667కు పెరిగింది. హీరో మోటో కార్ప్ ‘తేజశ్విని’ పేరుతో మహిళా సిబ్బందిని పెంచుకునేందుకు ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టింది. దీనిద్వారా తయారీ కేంద్రాల్లో ఇప్పటికే మహిళల సంఖ్యను పెంచుకున్నట్టు కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. రిక్రూట్మెంట్లు, విద్య, శిక్షణ, మార్గదర్శక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. సవాళ్లు.. తయారీ కేంద్రాల్లో మరింత మంది మహిళలను తీసుకునే విషయంలో ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి టాటా మోటార్స్ చీఫ్ హ్యుమన్ రీసోర్సెస్ ఆఫీసర్ రవీంద్ర కుమార్ వివరించారు. ‘‘ఆటోమొబైల్ రంగం మొదటి నుంచీ పురుషుల ఆధిపత్యంతో కొనసాగుతోంది. టెక్నీషియన్లు, విక్రేతలు, ఇంజనీర్లుగా మహిళలు రావడం అన్నది ఓ కల. కానీ ఇందులో క్రమంగా మార్పు వచ్చింది. ఐటీఐ, 12వ తరగతి చదివిన మహిళలకు రెండు, మూడేళ్ల పాటు సమగ్రమైన శిక్షణ ఇచ్చేందుకు కౌశల్య కార్యక్రమాన్ని చేపట్టాం. దీని తర్వాత వారు బీఈ/బీటెక్‌ను ఎంపిక చేసుకోవచ్చు. లేదంటే కంపెనీ ఉద్యోగిగా కొనసాగొచ్చు’’అని వివరించారు. -
టాటా మరో రికార్డ్ ! చెప్పారంటే చేస్తారంతే..
దేశంలో ఎక్కువ మంది మహిళలకు ఉద్యోగాలు కల్పించిన ప్రైవేటు సంస్థగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రికార్డు సృష్టించింది. బర్గండి ప్రైవేట్ హురున్ ఇండియా లిస్ట్ 2021లో ప్రకటించిన టాప్ 500 కంపెనీల జాబితాలో మహిళా ఉద్యోగుల విషయంలో టాటా కన్సల్టెన్సీ ప్రథమ స్థానంలో నిలిచింది. టాటాయే నంబర్ వన్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కి ప్రపంచ వ్యాప్తంగా 5,06,908 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో మహిళా ఉద్యోగుల సంఖ్య రికార్డు స్థాయిలో 1,78,357గా నమోదు అయ్యింది. దాదాపుగా 35 శాతానికి పైగా టీసీఎస్‌లో మహిళా ఉద్యోగులు పని చేస్తున్నారు. సరిగ్గా పదేళ్ల కిందట టీసీఎస్‌లో మహిళా ఉద్యోగుల సంఖ్య 30 శాతంగా ఉండేది. కంపెనీలో ఉద్యోగుల సంఖ్య పెరుగుతున్నా.. ఎక్కడా మహిళల శాతం తగ్గకుండా రిక్రూట్మెంట్లో జాగ్రత్తలు తీసుకుంటోంది టాటా గ్రూపు. ఇన్ఫోసిస్‌ది అదే బాట టాటాల తర్వాత స్థానంలో మహిళలకు ఉద్యోగాలు కల్పిస్తున్న సంస్థగా ఇన్ఫోసిస్ నిలిచింది. ఇన్ఫోసిస్‌లో మొత్తం 2,59,619 మంది ఉద్యోగులు ఉండగా ఇందులో 1,00,321 మంది ఫిమేల్ ఎంప్లాయిస్ ఉన్నారు. మొత్తం ఉద్యోగులు మహిళల శాతాన్ని పరిగణలోకి తీసుకుంటే 38 శాతం ఫిమేల్ వర్క్‌ఫోర్స్‌తో ఇన్ఫోసిస్ సంస్థ టాటా కంటే ముందు ఉంది. ఇన్ఫోసిస్ తర్వాత స్థానంలో 72,000ల మంది మహిళ ఉద్యోగులతో విప్రో, 61,330 మందితో క్వెస్ కార్పోరేషన్ సంస్థలు మూడు నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఐటీ విప్లవంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో మహిళలు దూసుకుపోతున్నారనడానికి ఈ గణాంకాలు ఉదాహారణగా నిలుస్తున్నాయి. ఐటీ తర్వాత బ్యాంకింగ్ సెక్టార్లో కూడా విమెన్ వర్క్‌ఫోర్స్ పెరుగుతోంది. ఐసీఐసీఐ బ్యాంకు 31,059 మంది మహిళా ఉద్యోగులతో అగ్రస్థానంలో నిలవగా ఆ తర్వాత 21,746 ఎంప్లాయిస్‌తో హెచ్డీఎఫ్సీ రెండో స్థానంలో నిలిచింది. ఇక దేశంలోనే అతి పెద్ద ప్రైవేటు కంపెనీల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో 2,36,334 మంది ఉద్యోగులు ఉండగా ఇందులో మహిళల సంఖ్య 19,561కే పరిమితమైంది. జెండర్ ఈక్వాలిటీలో టాటా దేశంలో అనేక వ్యాపార గ్రూపులు ఉన్నప్పటికీ టాటాది ప్రత్యేక స్థానం. విలువలు, సామాజిక బాధ్యత విషయంలో టాటాలు ఎప్పుడు ఇతర కంపెనీలకు ఆదర్శంగా నిలుస్తూ వచ్చారు. కాగా రతన్ టాటా హాయం నుంచి జెండర్ ఈక్వాలిటీ మీద టాటా గ్రూపు దృష్టి సారించింది. దానికి తగ్గ ఫలితాలు ఇప్పుడు టాటా గ్రూపులో కనిపిస్తున్నాయి. టాటా గ్రూపులో కింది స్థాయిలోనే కాకుండా ఎగ్జిక్యూటివ్ లెవల్లో కూడా చాలా మంది మహిళలు పని చేస్తున్నారు. చదవండి: ‘ఇది మీ ఆకాశం’.. బిగ్బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా కొత్త మంత్రం -
ఈ రంగాలపై మక్కువ చూపుతున్న మగువలు
న్యూఢిల్లీ: ఇంజినీరింగ్, తయారీ, ఆపరేషన్స్ తదితర విభాగాల్లో మరిన్ని బాధ్యతలు తీసుకోవాలని, కీలక విధులు నిర్వహించాలని మహిళలు భావిస్తున్నారు. అదే సమయంలో మహిళా సిబ్బంది సంఖ్య పెరగడం వల్ల ఆయా రంగాలు గణనీయంగా ప్రయోజనం పొందగలవని పురుషులు కూడా అభిప్రాయపడుతుండటం గమనార్హం. జీఈ, అవతార్ రీసెర్చ్ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మధ్యలో జీఈ కోసం అవతార్ ఈ సర్వే నిర్వహించింది. 500 మంది ప్రొఫెషనల్స్ (మహిళలు, పురుషులు) ఇంజినీరింగ్ విద్యార్థినులు, ఆపరేషన్స్.. తయారీ.. ఇంజినీరింగ్ సర్వీసుల సంస్థల్లో బిజినెస్, మానవ వనరుల విభాగాల అధిపతులు ఇందులో పాల్గొన్నారు. పురోగతికి సామర్థ్యాలపై అపోహలే అడ్డంకి.. సర్వే ప్రకారం ఇంజినీరింగ్ సర్వీసులు, ఆపరేషన్స్, తయారీ వంటి రంగాల్లో ప్రస్తుతం 12 శాతం మందే మహిళలు ఉన్నారు. సామర్థ్యాలపై గల అపోహలే ఈ రంగాల్లో తమ కెరియర్ పురోగతికి అవరోధాలుగా ఉంటున్నాయని 63 శాతం మంది మహిళలు అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల సామర్థ్యాల మదింపు ప్రక్రియలో పక్షపాత ధోరణులు కూడా కారణమని మరికొందరు పేర్కొన్నారు. మరోవైపు, ప్రభుత్వ నియంత్రణలే ఆయా విభాగాల్లో మహిళల వృద్ధికి ఆటంకాలుగా ఉన్నాయని 54 శాతం మంది పురుషులు, సూపర్వైజర్ల నుంచి మద్దతు లేకపోవడం కారణమని 51 శాతం మంది పురుషులు అభిప్రాయపడ్డారు. లింగవివక్ష వివిధ విభాగాల్లో లింగ వివక్షకు తావులేకుండా పరిస్థితి మెరుగుపర్చాల్సిన అవసరాన్ని ఈ సర్వే తెలియజేస్తోందని జీఈ దక్షిణాసియా ఐఅండ్‌డీ కౌన్సిల్ లీడర్ శుక్ల చంద్రా తెలిపారు. అటు, పెద్ద సంస్థలు ఈ దిశగా చర్యలు తీసుకుంటే మరింత మంది మహిళలు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి విభాగాలను ఎంచుకునేందుకు, తయారీ.. ఇంజినీరింగ్ రంగాల్లో కెరియర్ ఏర్పర్చుకునేందుకు ప్రోత్సాహం లభించగలదని అవతార్ వ్యవస్థాపక ప్రెసిడెంట్ సౌందర్య రాజేశ్ తెలిపారు. చదవండి:అబల కాదు.. ఐరన్ లేడీ! ఆమె చేతిలో పడితే చిత్తు చిత్తే!! -
Ola Future Factory: రెండు చక్రాలు.. 20 వేల చేతులు
అందరూ స్త్రీలే పని చేసే ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్యాక్టరీని ఓలా కార్యాచరణలో పెట్టింది. 10 వేల మంది మహిళా కార్మికులను భర్తీ చేయనుంది. ప్రపంచంలో ఇంతమంది స్త్రీలు పని చేసేæఫ్యాక్టరీ, ఆటోమొబైల్ ఫ్యాక్టరీ ఇది ఒక్కటే. ‘పురుషులు అప్లై చేయాల్సిన పని లేదు’ అని ఓలా అంటోంది. ఇన్నాళ్లు ఫ్యాక్టరీలను పురుషులు నడిపారు. ఈ పర్యావరణ హిత స్కూటర్ ఫ్యాక్టరీని స్త్రీలు నడపనున్నారు. తమిళనాడు కృష్ణగిరిలో ఒక ఘనమైన మహిళా ఘట్టం మొదలైంది. అక్కడ స్థాపితమైన ‘ఓలా ఈ–స్కూటర్ ఫ్యూచర్ ఫ్యాక్టరీ’ పూర్తిగా మహిళా కార్మికులతో, సిబ్బందితో పని చేయనుంది. మొత్తం 10 వేల మంది స్త్రీలు ఈ ఓలా ఫ్యాక్టరీలో పని చేయనున్నారు. ఇప్పటికే మొదటి బ్యాచ్ ఫ్యాక్టరీలో చేరింది. ఇంకో ఐదారు నెలల్లో మొత్తం మహిళా కార్మికులు చేరితే ఇదొక అద్భుతమైన స్త్రీ కార్మిక వికాస పరిణామం అవుతుంది. దీనికి అంకురార్పణ చేసిన ఓలా చరిత్ర లిఖించినట్టవుతుంది. ‘స్త్రీ బలపడితే సమాజం బలపడుతుంది’ ఓలా చైర్మన్– గ్రూప్ సి.ఇ.ఓ భవిష్ అగర్వాల్ సోమవారం ఈ సంతోషకరమైన వార్తను పంచుకున్నారు. ‘మా మొదటి బ్యాచ్ వచ్చింది. మిగిలిన వారు రావడమే తరువాయి’ అని ఆయన అన్నారు. ఈ–స్కూటర్ తయారు చేయనున్న ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలోని దాదాపు వందమంది తొలి మహిళా కార్మిక బ్యాచ్‌తో ఆయన సెల్ఫీ దిగారు. ‘స్త్రీలను ఆర్థికంగా బలపరిస్తే కుటుంబం బలపడుతుంది. దాంతో సమాజం బలపడుతుంది. మహిళా ఆర్థిక స్వావలంబనతో జి.డి.పి పెరుగుతుంది’ అని భవిష్ అన్నారు. ‘పారిశ్రామిక రంగంలో మహిళల శాతం చాలా తక్కువగా ఉంది. ఈ శాతం పెంచాలంటే అందరం కలిసి స్త్రీలను అందుకు ప్రోత్సహించాలి. మా వంతుగా మేము ఓలా ఈ–స్కూటర్ ఫ్యాక్టరీని పూర్తిగా స్త్రీలతోనే నిర్వహించనున్నాం’ అని ఆయన అన్నారు. పర్యావరణానికి హాని చేసే పెట్రోల్ టూవీలర్లకు ప్రత్యామ్నాయంగా ఈ–స్కూటర్ల తయారీ దేశంలో ఊపందుకుంటోంది. ఓలా ఈ రంగంలో ప్రధాన వాటా పొందేందుకు భారీ స్థాయిలో ఫ్యూచర్ ఫ్యాక్టరీని కృష్ణగిరిలో స్థాపించింది. ఇది పూర్తి కావడానికి సుమారు 2500 కోట్లు అవుతాయని అంచనా. 2022లో మార్కెట్లోకి వచ్చే లక్ష్యంగా ఇది పని చేయనుంది. ‘సంవత్సరానికి కోటి ఈ–స్కూటర్లు లేదా ప్రపంచ మార్కెట్లో 22 శాతం ఈ–స్కూటర్లు తయారు చేయడం ఈ ఫ్యాక్టరీ లక్ష్యం’ అని భవిష్ తెలియచేశారు. ప్రతి రెండు సెకండ్లకు ఒక స్కూటర్ తయారయ్యే స్థాయిలో వేల మంది మహిళా సిబ్బంది ఇక్కడ పని చేస్తారు. వీరికి 3000 రోబోలు సహకరించనున్నాయి. ‘మేము మహిళలతో ఈ ఫ్యాక్టరీని నడిపేందుకు పూర్తిస్థాయి శిక్షణా కేంద్రాలను నిర్వహిస్తున్నాం. అక్కడ శిక్షణ ముగించుకుని వచ్చి ఫ్యాక్టరీలో చేరుతారు’ అని భవిష్ చెప్పారు. ఇంతవరకూ అందరూ సైరన్ మోగుతుంటే డ్యూటీకి వెళ్లే పురుషులను చూశారు. మరి కొన్నాళ్లలో వేల మహిళలు ఈ ఫ్యాక్టరీలోకి వెళ్లే దృశ్యం కచ్చితంగా కోట్ల మంది స్త్రీలకు స్ఫూర్తిదాయకం కానుంది. -
‘ఉపాధి’లో మహిళా శక్తి
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ కూలీల గ్రూపు లీడర్లు (మేట్)గా మహిళలనే ఎంపిక చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఉపాధి హామీ చట్టం ప్రకారం మేట్‌గా కొనసాగే వారికి సంఘం తరఫున పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య ఆధారంగా రూ.3 చొప్పున అదనపు ఆదాయం పొందే వీలుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ జాబ్ కార్డులున్న కూలీలు కలిసి 5,99,256 శ్రమ శక్తి సంఘాలుగా ఏర్పడగా 3.83 లక్షల సంఘాలకు మహిళలే మేట్లుగా ఉన్నారు. మహిళా మేట్లలో అత్యధికులు ఇటీవలే ఎంపిక కాగా మిగిలిన సంఘాల్లో కూడా మహిళల ఎంపికకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. కూలీల పని సామర్థ్యం పెంచడంతోపాటు అత్యధిక వేతనం పొందేలా ఉపాధి పథకం ద్వారా వ్యక్తిగతంగా కాకుండా గ్రూపుల ప్రాతిపదికన పనులు కల్పిస్తోంది. 15 – 25 మంది కూలీలు కలిసి శ్రమ శక్తి సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సంఘం లో కూలీల సంఖ్యపై నిర్దిష్టంగా నిబంధనలు ఏవీ లేవు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఒక్కోశ్రమ శక్తి సంఘంలో కూలీలందరికీ కలిపి ఒకేచోట పనులు అప్పగిస్తున్నారు. ఈ సంఘాల్లో కొన్ని చోట్ల ఇప్పటివరకు పురుషులు మేట్‌గా వ్యవహరిస్తుండగా తాజాగా మేట్లుగా మహిళలనే ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
పులివెందులలో ఘోర రోడ్డు ప్రమాదం..
సాక్షి, వైఎస్సార్ కడప : పులివెందులలోని ముద్దనూరులో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీపు, కారు, మున్సిపాలిటీ ట్రాక్టర్ ఒకదానికొకటి మూడు ఢీకొట్టడంతో ఇద్దరు మహిళ రైతు కూలీలు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతులంతా పులివెందుల మండలం ఇ.కొత్తపల్లె గ్రామస్థులుగా గుర్తించారు. తీవ్ర గాయాలైన వారు మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు, రైతు కూలీలుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. చదవండి: రోడ్డు ప్రమాదంలో యువ గాయకుడు మృతి -
మహిళా కూలీకి వజ్రం లభ్యం
కర్నూలు, తుగ్గలి :తుగ్గలి మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన ఓ మహిళా కూలీకి సోమవారం వజ్రం లభ్యమైనట్లు సమాచారం. వేరుశనగ విత్తనం విత్తేందుకు వెళ్లిన మహిళా కూలీకి వజ్రం కంట పడడంతో ఆగి తీసుకుంది. 5 క్యారెట్లకు పైగా ఉన్న ఈ వజ్రాన్ని అదే రోజు రాత్రి అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఓ వ్యాపారి రూ.5.50 లక్షల నగదు, 3తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేసినట్లు తెలిసింది. (రైతుకు చిక్కిన రూ.కోటి వజ్రం..) -
పని ఉంటే మస్తు.. లేదంటే పస్తు
సినిమా ఒక అందమైన హరివిల్లు. హరివిల్లులోని ఏడు రంగులు తళతళలాడాలంటే దాని వెనక ఇరవై నాలుగు విభాగాల్లో కొన్ని వందల మంది గడియారంలా నిరంతరం శ్రమించాలి. ప్రేక్షకుడికి సినిమా కేవలం ఉల్లాసాన్నిచ్చే వినోదం కావొచ్చు. కానీ తెర వెనక.. కొన్ని వందల మంది ఉపాధి. ప్రస్తుతం కరోనా సినిమా ఇండస్ట్రీని పని చేయనీకుండా చేసింది. అంటే చాలామందికి పని లేకుండా చేసినట్టే. రీల్ (రెక్క) ఆడితే కానీ డొక్కాడని జీవితాలు కృష్ణానగర్ వీధుల్లో తారసపడుతూనే ఉంటాయి. ‘నేనింతే’ సినిమాలో ఓ పాటలో అన్నట్టు ‘పని (షూటింగ్) ఉంటే మస్తుర మావా.. లేదంటే పస్తుర మావా’ అన్నట్లుంది ప్రస్తుత పరిస్థితి. స్పాట్బాయ్, లైట్‌మేన్, జూనియర్ ఆర్టిస్ట్‌లు, ఫైటర్స్, కాస్ట్యూమ్స్, ఆర్టిస్టుల అసిస్టెంట్స్, కెమెరా డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ టీమ్, డ్రైవర్లు, మహిళా వర్కర్స్.. ఇలా 24 క్రాఫ్ట్స్‌లో ఉన్న చిన్న స్థాయి కార్మికుల మీద కరోనా ప్రభావం పడింది. స్టూడియోలు ఖాళీగా ఉంటున్నాయి. 24 క్రాఫ్ట్స్‌లో ఎక్కువ శాతం మంది ఏ రోజు జీతం ఆ రోజు తీసుకునేవాళ్లే. అనుకో కుండా వచ్చిన ఈ బ్రేక్ వల్ల ఎందరో బడ్జెట్ పద్మనాభాల ఆర్థిక ప్రణాళికను కుప్పకూల్చింది. చెప్పాపెట్టకుండా ఊడిపడ్డ ఈ ఇబ్బంది వల్ల ఇంటి బండిని లాగడానికి ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు పలువురు కార్మికులు. రెండున్నర గంటల నిడివి ఉన్న సినిమా పూర్తికావడానికి కొన్ని నెలల నుంచి సంవత్సరాలు పడుతుంది. ఒకరోజు షూటింగ్లో ఆర్టిస్ట్ మీద కెమెరా రన్ అయ్యే ముందు కొన్ని వందల మంది అటూఇటూ పరుగులు తీయాలి. ప్రొడక్షన్ వాళ్లు సెట్లో అడుగుపెట్టడంతో లొకేషన్ పొద్దు పొడుస్తుంది. ఆ తర్వాత లైటింగ్ డిపార్ట్మెంట్, సెట్ అస్టిస్టెంట్లు ఒకరి తర్వాత ఒకరు వస్తారు. సినీ సర్వీస్ సెంటర్లనుంచి కెమెరాలు వస్తుంటాయి. దర్శకుడు తన డైరెక్షన్ టీమ్‌తో ఆ రోజు తీయాల్సిన సన్నివేశాన్ని డిస్కస్ చేసుకుంటారు. ఈలోగా ఆర్టిస్టులు వచ్చి సన్నివేశానికి అనుగుణంగా తయారయి షాట్ రెడీ అయినప్పుడు క్యారవేన్ నుంచి బయటకు వస్తారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకూ ఒక కాల్షీట్, అదే సాయంత్రం 9 వరకూ షూటింగ్ చేస్తే ఒకటిన్నర కాల్షీట్ కింద లెక్క కడతారు. రాత్రి పన్నెండు వరకు షూటింగ్ కొనసాగితే రెండు కాల్షీట్ల కింద లెక్క పెడతారు. ఇలా ఒక్కరోజు షూటింగ్ కాల్షీట్‌ని బట్టి చాలా విభాగాల వారికి ఏ రోజు పారితోషికం ఆ రోజు అందుతుంటుంది. కుదరని పక్షాన వారం రోజులది ఒకేరోజు పే చేస్తారు. కరోనా కారణంగా లొకేషన్లు పొద్దు పొడవట్లేదు. సెట్లు కాంతివిహీనమయ్యాయి. లొకేషన్లు ఆకలి కేకలు పెడుతున్నాయి. సెట్లో ఎప్పుడూ ఉండే సందడి ప్రస్తుతం లేదు. మళ్లీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో సరిగ్గా తెలియదు. ఇండస్ట్రీ షూటింగ్స్‌నే బతుకు‘తెర’వుగా పెట్టుకున్న వాళ్లు విలవిలలాడుతున్నారు. ‘వైరస్‌తో పోతామనే భయం కంటే ఆకలి చావులతో పోకుండా ఉండాలి కదా?’ అని కొందరు పేర్కొన్నారు. మా ‘మహిళా వర్కర్స్ యూనియన్’లో మొత్తం 130 మంది ఉన్నాం. నెలకు పది పదిహేను రోజులు పని దొరుకుతుంది. గిన్నెలు కడగడం, అవసరమైతే వంట చేయడం, భోజనాలు వడ్డించడం, వాటర్ క్యాన్లు మోయడం మా పని. ఈ 130 మందిలో కొన్నేళ్లుగా పని చేసి చేసి అలసిపోయినవాళ్లు, ఆరోగ్యం బాగాలేక పని చేయలేనివాళ్లు ఉన్నారు. మిగతావారిలో కొందరికే పని దొరుకుతుంది. ఉదయం 6 గంటలకు మొదలయ్యే కాల్షీట్ రాత్రి 7 వరకూ ఉంటుంది. రోజుకి 785 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు షూటింగ్‌లు బంద్ కావడంతో అదీ లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో యూనియన్ వైపు నుంచి ఏదైనా చేద్దామన్నా మా దగ్గర అంత ఫండ్ ఉండదు. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే 5 నుంచి 10 వేలు వరకూ ఇవ్వగలుగుతాం. 130 మందిలో మరీ రోజు గడవని పరిస్థితుల్లో 10 మందికి పైనే ఉన్నారు. ఇప్పుడు పని లేక పరిస్థితి దారు ణంగా ఉంది. ఎప్పుడు షూటింగులు మొదలవుతాయా అని ఎదురు చూస్తున్నాం. – టి. లలిత సినీ మరియు టీవీ ప్రొడక్షన్ మహిళా కార్మికుల సంఘం అధ్యక్షురాలు షూటింగ్స్ ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నాం 24 క్రాఫ్ట్స్‌కి చెందిన అందరికీ ఇబ్బందే. వీళ్లందరిలో చాలా మందికి సినిమా తప్ప వేరే పని తెలియదు.. రాదు. అనూహ్యంగా ఎదురైన ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో చాలామందికి అర్థం కావడంలేదు. మార్చి 31 వరకూ షూటింగ్స్ నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ అన్ని రోజులు అంటే అన్ని విభాగాల వారికీ ఇబ్బందే. అందుకే ఈ నెల 21 నుంచి షూటింగ్స్ని మళ్లీ జరుపుకునేలా పర్మిషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరనున్నాం. కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ, తక్కువమంది యూనిట్‌తో షూటింగ్ జరుపుకునేందుకు ప్లాన్ చేస్తున్నాం. 20 రోజులు షూటింగ్స్ లేకుండా ఉంటే సినిమా తయారవడానికి పని చేసే ప్రతి ఒక్కరికీ నష్టమే. – కొమర వెంకటేష్ జూనియర్ ఆర్టిస్ట్స్ ఏజెంట్స్ యూనియన్ అధ్యక్షుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి మా యూనియన్‌లో దాదాపు 1300 మంది ఉన్నారు. నెలలో పదిహేను రోజులే మాకు పని ఉంటుంది. అదీ అందరికీ ఉండదు. రోజుల తరబడి పనిలేనివారు కూడా ఉంటారు. ఇప్పుడు కరోనా వల్ల షూటింగ్స్ ఆగిపోయాయి. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మాకు వేరే ఆదాయ మార్గం కూడా లేదు. ఒక సినిమా షూటింగ్ జరగాలంటే ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, లైట్‌మెన్స్.. ఇలా కనీసం రెండొందలమందైనా సెట్లో ఉండాలి. కరోనా వైరస్ కారణంగా గుంపులుగా ఉండి పని చేయకూడదని చెప్పారు. చేతిలో పని లేదు. ఊరికి వెళదామన్నా డబ్బులు లేవు. నిర్మాతలు మాత్రం ఏం చేస్తారు. షూటింగ్స్ అకస్మాత్తుగా ఆగిపోవడం వల్ల నిర్మాతలు కూడా డబ్బులు సర్దుబాటు చేయలేని పరిస్థితి. సినిమా షూటింగ్స్ ఈ నెల 31వరకు ఆగిపోయాయి. నాకు తెలిసి మా యూనియన్‌లో దాదాపు 75శాతం మంది అద్దెలు కట్టుకునేవారే. ఒకటో తారీఖు అద్దె, పాల బిల్లు.. ఇలా కట్టాల్సినవి చాలా ఉంటాయి. చాలామంది ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. – ఎ. శ్రీనివాస్ లైట్‌మెన్ యూనియన్ అధ్యక్షుడు -
విధిగా సదుపాయం
మహిళా కార్మికుల ఆరోగ్యం, సంక్షేమం కోసం అసోంలోని అన్ని పరిశ్రమలు, కర్మాగారాలలో ఇకనుంచి తప్పనిసరిగా శానిటరీ న్యాప్కిన్స్ని అందుబాటులో ఉంచాలని మంగళవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
జీతాలు బ్రేక్.. వేధింపుల షాక్!
సాక్షి, సచివాలయం (తుళ్లూరు రూరల్) : సభాపతి, రాష్ట్ర మంత్రులు, పెద్ద సంఖ్యలో ఐఏఎస్ అధికారులు ఉండే సచివాలయంలో మహిళా కార్మికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ‘మాకు అన్యాయం జరుగుతోందని ప్రశ్నిస్తే ఇబ్బందులకు గురిచేస్తున్నా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం’ అంటూ తాత్కాలిక సచివాలయం ‘సాక్షి’గా మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని రెండు రోజుల క్రితం నిరసన వ్యక్తం చేసిన సచివాలయంలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసే 170 మంది మహిళా కార్మికులను శుక్రవారం ‘సాక్షి’ పలుకరించింది. వారు తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు. గతంలో ఎన్నో సార్లు వేతనాల విషయంలో ఆలస్యం చేస్తుంటే, ఇదేంటని ప్రశ్నించిన వారిని సచివాలయం బయట రహదారులు, పార్కింగ్ ప్రాంతాల్లో పనిచేయాలని, లేదా పురుషుల మరుగుదొడ్లను శుభ్రపరచడం లాంటి పనులు కేటాయించడం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు బెదిరింపు కాల్స్ కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదని యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన కార్మికులకు ఫోన్లు చేసి మరీ కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు బెదిరింపులకు పాల్పడ్డట్లు బాధిత మహిళా కార్మికులు వాపోయారు. మూడేళ్లుగా పనిచేస్తున్నా రోజురోజుకు ఇబ్బందులు ఎక్కువవుతున్నాయని తెలిపారు. సమస్యలను కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్దామంటే అందుబాటులో ఉండటం లేదని, అందుబాటులో ఉన్న ఇద్దరు సంస్థ ఉన్నత స్థాయి ప్రతినిధులు కుమ్మక్కై ఈ విధంగా వ్యవహరిస్తున్నారని కార్మికులు ఆరోపించారు. కనీస వేతనాలు ఇవ్వని పరిస్థితి కార్మికులకు కనీస వేతనాలు చెల్లించని పరిస్థితి సచివాలయంలో నెలకొంది. మూడేళ్లుగా సచివాలయంలో 170 మంది కార్మికులు పనిచేస్తున్నా వారికి నెలకు రూ.6,470 వేతనం చెల్లిస్తున్నారు. నాలుగు నెలలుగా వేతనం పెంచామని చెప్పి ఒక నెల రూ.6,670 ఇవ్వగా, మూడు నెలలుగా వేతనాలు అసలు ఇవ్వడంలేదని కార్మికులు చెబుతున్నారు. చట్టం ప్రకారం ప్రతి కార్మికునికి రూ.12,500 వేతనం చెల్లించాల్సి ఉందని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. సీఆర్డీఏ చోద్యం చూస్తోందా? కార్మికులు, అందులోనూ మహిళలకు సచివాలయం సాక్షిగా ఇంత అన్యాయం జరుగుతుంటే సీఆర్డీఏ అధికారులు ఏమిచేస్తున్నారు. మూడు నెలలుగా వేతనాలు చెల్లించకపోగా, అడిగిన వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మహిళా కార్మికులకు ఫోన్ చేసి బెదిరించిన కాంట్రాక్టు సంస్థ ప్రతినిధిపై పోలీసు కేసు నమోదు చేయాలి. తక్షణమే కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ కార్డులను అందజేయాలి. లేకుంటే కార్మికులతో సచివాలయం ముట్టడిస్తాం. – ఉండవల్లి. శ్రీదేవి, వైఎస్సార్సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలి గతంలో కాంట్రాక్టు సంస్థను ప్రశ్నించినందుకు పనిలో నుంచి తొలగించిన కార్మికులను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. వారికి గతంలో వేతనంలో నుంచి తీసుకున్న పీఎఫ్‌ను అందించాలి. ప్రతి కార్మికునికి చట్ట ప్రకారం వేతనం చెల్లించాలి. వారాంతపు సెలవులను కేటాయించాలి. – మెరుగుమళ్ల రవి, రాజధాని డివిజన్ కార్మిక సంఘం కార్యదర్శి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి రాజధానిలో కార్మికులు అంతా దళితులు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. అలాంటి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సచివాలయంలో పని చేస్తున్న కార్మికులకు నెలకు ఒక్క రోజు మాత్రమే సెలవు దినం. కానీ వేతనం మాత్రం సరిగా ఇవ్వరు. పేదల శ్రమ దోచుకునితింటున్నారు. ప్రతి ఒక్క కార్మికునికి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. లేకుంటే ఊరుకునేది లేదు. – శంగారపాటి సందీప్, అధ్యక్షుడు, ఎస్సీ సెల్ -
మృత్యు యంత్రం
శ్రీకాకుళం, రాజాం/సంతకవిటి: వరి నూర్పిడి చేస్తుండగా ప్రమాదవశాత్తు యంత్రంలో చిక్కుకుని మహిళా కూలీ దుర్మరణం చెందిన ఘటన సంతకవిటి మండలం పనసపేట వద్ద బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్తివలస గ్రామానికి చెందిన రాజాపు ఈశ్వరమ్మ(30) తోటి మహిళలతో కలిసి వ్యవసాయ నూర్పిడి పనుల నిమిత్తం పనసపేట వెళ్లింది. అక్కడ వరిపంటను నూర్పిడిచేస్తున్న సమయంలో ఇంజిన్ ఫ్యాన్‌లో చీర చిక్కుకోవడంతో ప్రమాదానికి గురైంది. బలమైన గాయాలయ్యాయి. వెంటనే తోటి కూలీలు స్పందించి రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయింది. ఈమె మృతదేహాన్ని స్వగ్రామం మిర్తివలసకు తీసుకొ చ్చిన అనంతరం సంతకవిటి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న రాజాం రూరల్ సీఐ రుద్రశేఖర్, సంతకవిటి హెచ్‌సీ ప్రసాదరావులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. సాక్షరభారత్ ఎత్తివేయడంతో.. ఈశ్వరమ్మ గతంలో మిర్తివలస సాక్షరభారత్ విలేజ్ కోఆర్డినేటర్‌గా పనిచేసేవారు. భర్త రమణారావు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. ఏడాది కాలంగా సాక్షరాభారత్ పథకం నిలిపివేయడంతో గౌరవ వేతనాలు రాక కూలి పనులకు వెళ్లడం ప్రారంభించింది. ఇందులో భాగంగానే బుధవారం కూలి పనులకని పనసపేట వెళ్లి మృత్యుఒడిలోకి చేరిపోయింది. బోరున విలపించినచిన్నారులు.. ప్రమాదంలో మృతిచెందిన ఈశ్వరమ్మకు ఏడేళ్ల కుమారుడు సాయి(2వ తరగతి), ఐదేళ్ల కుమారుడు ప్రదీప్(1వ తరగతి) ఉన్నారు. ఉదయం పాఠశాలకు వెళ్లిన వీరు తిరిగి వచ్చేటప్పటికి ఇంటి వద్ద జనాలు ఉండడాన్ని చూసి బిత్తరపోయారు. జనం మధ్యలో తల్లి అచేతనంగా పడి ఉండడం, తండ్రి రమణారావు బోరున విలపించడాన్ని చూసి వీరు కూడా కన్నీరుమున్నీరుగా విలపించారు. అమ్మా లే..అంటూ తల్లి మృతదేహంపై పడి ఏడ్చిన తీరు గ్రామస్తులను కంట తడిపెట్టించింది. అందరికీ చేదోడువాడోదుగా ఉంటూ జీవనం సాగించిన ఈశ్వరమ్మ మృతిని గ్రామస్తులు, కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
పనిలో సమానత్వం వేతనంలో అసమానత్వం
కష్టం ఒకటే. పని గంటలూ అవే. కానీ చేతికి అందేది మాత్రం ఒకేలా ఉండదు. కింది నుంచి పై వరకు భారతదేశంలో మహిళా కార్మికులు, మహిళా ఉద్యోగుల పరిస్థితి ఇది. బ్రిటన్‌లోని ‘ఆక్స్‌ఫామ్’ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుషుల వేతనాల్లోని వ్యత్యాసాలపై అధ్యయనం చేసినప్పుడు ఈ ‘అసమానత్వం’ బయట పడింది. ఇదేమీ కొత్తగా బయటపడింది కాదు కానీ, ఓ కొత్త విషయాన్ని కూడా ఆక్స్‌ఫామ్ వెల్లడించింది. భారతదేశంలో ప్రభుత్వం ఏ రంగంలోనైనా ఖర్చు తగ్గించుకున్న ప్రతిసారీ వెంటనే ఆ దుష్ప్రభావం మహిళల జీవితాలపై పడుతోంది. ఉదా : విద్యపై పెట్టే ఖర్చును ప్రభుత్వం తగ్గించుకుంది. లేదా ఆరోగ్యంపై ఖర్చు తగ్గించుకుంది. ఆ వరుసలోనే ప్రజలకు అందవలసిన సేవలూ తగ్గుతాయి. ఆ తగ్గిన సేవలు, సదుపాయాల వినియోగంలో సహజంగానే బాలికలకు, మహిళలకు తొలి ప్రాధాన్యం తగ్గుతుంది. ఇద్దరు పిల్లల్ని చదివించలేనప్పుడు అబ్బాయిని మాత్రమే బడికి పంపడం, డాక్టరు దగ్గరికి వెళ్లవలసిన పరిస్థితిని ఇంట్లో ఆడవాళ్ల విషయంలో నిర్లక్ష్యం చేయడం.. ఇలా ఉంటాయి పర్యవసానాలు. స్త్రీలు, బాలికల కోసం అంటూ ప్రత్యేకంగా కేటాయించిన ప్రణాళికలు, పథకాలు వారికి చేరేలోపు దారి మారుతున్న వివక్షాపూరిత వాతావరణంలో ఇలాంటి ప్రభుత్వ తగ్గింపులు మహిళల్ని మరింత దైన్యంలోకి నెట్టడంలో ఆశ్చర్యం ఏముంది? ఆక్స్‌ఫామ్ లెక్కల ప్రకారం ఇండియాలో ఏటా 2 కోట్ల 30 లక్షల మందికి పైగా బాలికలు బడి మానేస్తున్నారు. బడిలో మరుగుదొడ్లు లేకపోవడం, రుతుస్రావ శుభ్రత వసతులు లేకపోవడం ఇందుకు తొలి కారణాలు కాగా, పనికి వెళుతున్న తల్లికి ఆమె శ్రమకు తగ్గ ఫలితం అందకపోవడం ఇంకో కారణం. స్త్రీకి ఆర్థిక స్వావలంబన ఉంటే, మెరుగైన పాఠశాలలో చేర్పించే అవకాశం ఉంటుంది కదా. ఇవన్నీ అలా ఉంచండి. కష్టానికి తగిన ప్రతిఫలం పొందలేని కారణంగా పోషించే శక్తి తగ్గి తన ఇంట్లో తనే స్త్రీ వివక్షకు, వివక్ష నుంచి హింసకు గురయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నట్లు ఆక్స్‌ఫామ్ గమనించింది. ఇంట్లో మగాళ్ల మాటను తు.చ.తప్పకుండా పాటించకపోవడం, వారికి చెప్పకుండా రూపాయి ఖర్చు పెట్టడం, పిల్లల సంరక్షణకు సమయాన్ని కేటాయించలేకపోవడం, ఇంట్లో పెద్దవాళ్లకు సేవలు చేయలేకపోవడం, వేళకు వండి వడ్డించకపోవడం, నీళ్ల బిందెలు ఖాళీగా ఉండడం, వంట చెరకును తీసుకు రాలేకపోవడం, చెప్పకుండా బయటికి వెళ్లడం.. ఇవన్నీ కూడా ఇంట్లో ఆర్థికబలం లేని మహిళలను వేధించడానికో, వారిపై చెయ్యి చేసుకోవడానికో నెపాలు అవుతున్నాయని ఆక్స్‌ఫామ్ తెలిపింది. -
కూర్చునే హక్కు
చక్కటి చీర కట్టు. పెదవులపై చెరగని చిరునవ్వు. ప్రాంగణ ద్వారంలోనే ఎదురై.. రారమ్మని ఆహ్వానించే ఆత్మీయమైన పలకరింపులు! షాపింగ్ మాల్స్‌లో సేల్స్ గర్ల్స్ ఇచ్చే నమస్కారాన్ని అందు కున్నాక కొనాలనుకున్న వస్తువు కొనకుండా మానం. ఒకవేళ వద్దనుకున్నా మనతో కొనిపించే వారి వేడికోలు.. ఏ కొంచెం మొహమాటం ఉన్నవారినైనా ఇబ్బంది పెట్టేస్తుంది. కానీ వారి మర్యాదల వెనుక దయనీయమైన వేదన ఒకటుందని కేరళ మహిళలను చూశాక కానీ అర్థం కాదు. ఆ వేదనే కేరళ టెక్స్టైల్ ఇండస్ట్రీలో పనిచేసే మహిళా కార్మికులను ‘కూర్చునే హక్కు’ కోసం ఉద్యమించేలా చేసింది. ఆ ఉద్యమం పేరే మలయాళంలో ఇరుప్పు సమరం.’ పన్నెండు గంటల పాటు ఏకధాటిగా నిలబడి ఉండాలి. అదీ పెదవులపై చిర్నవ్వు చెదరకుండా. 12 గంటల్లో రెండే రెండు సార్లు వాష్‌రూమ్‌కు వెళ్లొచ్చు. అది కూడా ఐదు నిమిషాలకు మించకూడదు! లంచ్‌కి 30 నిమిషాలు టైం ఇస్తారు. అంతకన్నా మించితే జీతంలో కోత. అంతే కాదు. పొరపాటున ఎవరూ చూడట్లేదని నేలమీద కూర్చున్నారో కెమెరా కన్నెర్రజేస్తుంది. ఎవరితోనైనా మాట్లాడినా సూపర్వైజర్ కంఠం ఖంగుమంటుంది. కాళ్లు పీక్కుపోయి ఒక్క క్షణం గోడకి ఒరిగి ఒంటికాలుపై నుంచున్నా కూడా ఫైనే. ఇక కనీస వేతనం కూడా కాని జీతంలో ఇంటికి తీసుకెళ్లేది కోతలే తప్ప జీతం రాళ్లు కాదు. ఇది ఎక్కడో బానిస దేశంలో కాదు.. మహిళల హక్కుల విషయంలో అగ్రభాగాన ఉన్న కేరళ రాష్ట్రంలో. ఈ పరిస్థితి చివరికి టెక్స్టైల్ ఇండస్ట్రీలోనూ, బట్టల షాపుల్లోనూ మహిళా కార్మికులు ‘కూర్చునే హక్కు’ కోసం ఉద్యమించేలా చేసింది. ఎనిమిదేళ్ల సుదీర్ఘ పోరాటం కేరళ రాష్ట్రంలో చాలా చోట్ల మహిళా ఉద్యోగుల ‘కూర్చునే హక్కు’ ఉల్లంఘనకు గురి కాగా ఇప్పుడిక 8 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తరువాత టెక్స్టైల్ ఇండస్ట్రీలో పనిచేసే మహిళా కార్మికులు కూర్చునే హక్కుని సాధించుకున్నారు. ‘రైట్ టు సిట్’ ఉద్యమానికి అనుకూలంగా కేరళ ప్రభుత్వం స్పందించింది. టెక్స్టైల్ ఇండస్ట్రీలో పనిచేస్తోన్న కార్మికులకు కూర్చునేందుకు స్టూల్ తదితరాలను ఏర్పాటు చేయాలనీ, ఎనిమిది గంటల పనిదినాన్ని తప్పనిసరిగా పాటించాలని, అంతకు మించి పని చేయించుకోకూడదనీ అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు చట్టంలో మార్పులు చేస్తామని ప్రకటించింది. అలాగే మధ్యాహ్నం టీ బ్రేక్, లంచ్ బ్రేక్‌లను తప్పనిసరి చేసింది. ఉద్యమ సార«థి విజి పెన్‌కూట్ అయితే ఇది కేవలం కేరళకు సంబంధించిన విషయం కాదు. అనేక ప్రైవేటు పాఠశాలల్లో టీచర్లు కూర్చోవడం నేరం. కూర్చుంటే ఫైన్.. లాంటివి సర్వసాధారణంగా అమలైపోతున్నాయి. అయితే అసంఘటిత రంగంలో.. ప్రధానంగా భారీ మాల్స్‌లోనూ, బట్టల దుకాణాల్లోనూ మహిళల పట్ల యాజమాన్యాలు అనుసరిస్తోన్న అమానవీయ చర్యలను మొదటిసారిగా కేరళ మహిళలు ధిక్కరించారు. కేరళకు చెందిన విజి పెన్‌కూట్ ఈ ఉద్యమానికి సారథ్యం వహించారు. ‘ఆ ఇదేం పెద్ద సమస్యా?’ అంటూ పెదవి విరిచేసిన పురుష యూనియన్లకు దీటుగా విజి పెన్‌కూట్ అసంఘటిత రంగ కార్మికులకు ప్రత్యేకంగా 2010లో మహిళా సంఘాన్ని (ఏఎంటీయూ) ఏర్పాటు చేసి ‘కూర్చునే హక్కు’ కోసం ఉద్యమించారు. అలా కేరళ మహిళలు తమ కూర్చునే హక్కు కోసం ఎనిమిదేళ్ల పాటు నిలబడ్డారు. చీరల షాపులో తొలి తిరుగుబాటు షాప్ యాజమాన్యాల కాఠిన్యంతో అనేక గంటలపాటు అలాగే నించొని ఉండాల్సి రావడంతో ఈ రంగంలో పనిచేస్తోన్న అనేక మంది మహిళలకు నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు, కాళ్లు వాయడం లాంటి అనారోగ్య సమస్యలెదురయ్యాయి. కేవలం రెండేసార్లు టాయ్‌లెట్‌కి వెళ్లే అవకాశం ఉండటంతో మిగిలిన సమయమంతా (యూరినల్స్‌కి వెళ్లాల్సి వస్తుందని) నీళ్లు తాగకుండా ఉండడంతో చివరకు ప్రాణాంతకమైన కిడ్నీ సమస్యలకు దారితీసేది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్కి కూడా ఇది కారణమయ్యేది. దీంతో మొదట 2014లో కేరళ, త్రిస్సూర్‌లోని కల్యాణ్ చీరల షాప్‌లో మహిళలు తమ ‘కూర్చునే హక్కు’కోసం స్ట్రైక్ చేశారు. కల్యాణ్ చీరల దుకాణంలో స్ట్రైక్‌తో ఉద్యమం ఊపందుకుంది. దిగివచ్చిన మర్చంట్స్ ‘‘మీరు కూర్చోదల్చుకుంటే, లేదా తరచూ టాయ్‌లెట్‌కి వెళ్లాలనుకుంటే, అలాంటి వాళ్లు ఇంట్లో కూర్చోవాలి తప్ప ఉద్యోగాలు చేయకూడదు’’ అని కేరళ మర్చంట్స్ అసోసియేషన్‌తో పాటు వస్త్ర దుకాణాల యాజమాన్యాలు వ్యాఖ్యానించడం ‘కూర్చునే హక్కు’ (ఇరుప్పు సమరం) కోసం పోరాటానికి ఉసిగొల్పిందంటారు ఈ ఉద్యమానికి సారథ్యం వహించిన విజి. అయితే ఈ ఉద్యమంపై ప్రభుత్వం దృష్టి సారించేందుకు చాలా కాలం పట్టింది. ఈ జూలై 4న కేరళ క్యాబినెట్.. ప్రస్తుతం ఉన్న చట్టంలో ఈ మార్పులు చేయాలని నిర్ణయించడంతో కేరళ మహిళల ‘రైట్ టు సిట్’ ఉద్యమం విజయవంతమైంది. గతంలో ఉన్న కార్మిక చట్టంలో.. ప్రత్యేకించి మహిళల కూర్చునే హక్కు ప్రస్తావన లేదనీ, దీన్ని సవరించడం వల్ల మహిళా కార్మికులందరికీ మేలు జరుగుతుందని కేరళ లేబర్ కమిషనర్ తోజిల్ భావన్ వ్యాఖ్యానించారు. అజిత అనే మాజీ వామపక్ష కార్యకర్త ద్వారా స్ఫూర్తిపొందిన విజి టీనేజ్లోనే ఫెమినిస్ట్ ఉద్యమంలో చేరారు. కోళికోడ్‌లోని అసంఘటిత రంగ కార్మికులతో కలిసి పనిచేస్తోన్న విజీ అంటే అక్కడి మహిళలకు అంతులేని గౌరవం. అదే గౌరవాన్ని ఇప్పుడు కేరళ ప్రభుత్వమూ ఆమెపై కనబరిచిందనడానికి సాక్ష్యం.. త్వరలోనే చట్టంలో జరగబోతున్న సవరణే. -
అమానుషం.. ఖాకీల తీరు
చిల్లకూరు: తీర ప్రాంతంలోని చింతవరం సమీపంలో ఉన్న మాస్ అపెరల్ పార్కులో ఉన్న అక్షయ వస్త్ర పరిశ్రమలో పని చేసే కార్మికులు తమ డిమాండ్లను యాజమాన్యం పరిష్కరించడంలేదని గురువారం విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేసారు. ఈ సమయంలో వచ్చిన పోలీసులు కార్మికులతో చర్చలు జరిపే సమయంలో ఒక్క సారిగా గూడూరు రూరల్ సీఐ అక్కేశ్వరరావు మహిళా కార్మికులపై దురుసుగా వ్యవహరించడమే కాకుండా కొంత మంది మహిళలను పక్కకు లాగి వేయడంతో మనస్తాపం చెందిన కార్మికులు పరిశ్రమ నుంచి రెండు కీమీ దూరం నడిచి వచ్చి చింతవరం కూడలి ప్రాంతంలో రాస్తారోకో నిర్వహించారు. దీంతో సుమారు 8 గంటల పాటు తీర ప్రాంతంలోని 18 గ్రామాలకు వాహనాల రాక పోకలు నిలిచి పోయాయి. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ వారం రోజుల క్రితం జీతాలు పెంచాలని డిమాండ్ చేయడంతో పరిశ్రమ ప్రతినిధులు చర్చలు జరిపి ఐదు డి మాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చారన్నారు. దీంతోనే బుధవారం విధులకు హాజరు కాగా గురువారం ఉదయం పరిశ్రమ జీఎం చమిందా వచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చడం సాధ్యం కాదని తెల్చారు. దీంతో కార్మికులు విధులను బహిష్కరించి డిమాండ్ల సాధనకు శాంతియుతంగా నిరసన చేస్తున్నామని తెలిపారు. ఈ లోగా యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు వచ్చిన సీఐ అక్కేశ్వరరావు మహిళా కార్మికులను దూషించడంతో పాటు ఎవరికి చెప్పుకుంటారో చెప్పకోండని పరిశ్రమ జీఎంకు భద్రత కల్పిస్తూ అడ్డు వచ్చిన మహిళలను పక్కకు లాగి వేయడమే కాకుండా తమపై దారుణంగా వ్యవహరించారని ఆరోపించారు. సీఐ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ పోలీసుల డౌన్ డౌన్ అంటూ ని నాదాలు చేసారు. అదే సమయంలో అటుగా వస్తున్న చిల్లకూరు పీఏ సీఎస్ అధ్యక్షుడు వేమారెడ్డి కుమారస్వామిరెడ్డికి తా ము పడుతున్న బాధలు చూడాలని విన్నవించారు. దీంతో ఆయన ఎమ్మెల్యేతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని అన్నారు. రాస్తారోకో చేస్తున్న సమయంలో చిల్లకూరు, గూడూరు రూరల్, మనుబోలు ఎసైలు, శ్రీనివాసరావు, బాబీ, శ్రీనివాసరెడ్డిలతో పాటు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. సీఐపై ఫిర్యాదు మహిళా కార్మికులపై అనుచితంగా వ్యవహరిం చిన సీఐ అక్కేశ్వరరావుపై కేసు నమోదు చేయాలని కా ర్మికులు ఎస్సై శ్రీనివాసరావుకు రాత పూ ర్వక ఫిర్యాదును అందించారు. జీఎం చమిందాను పరిశ్రమ నుంచి బయటకు తీసుకెళ్లేటప్పుడు మహిళా కార్మికులను పక్కకు తొలగించే సమయంలో మహిళా కానిస్టేబుళ్లను వినియోగించకుండా తనే చేతలతో నెట్టి వేయడం ఏమిటని అలాగే అరుణ అనే మహిళా కార్మికురాలిపై లాఠీని ఝుళి ³ంచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
నోట్ల రద్దుతో మహిళా కార్మికుల కష్టాలు
-
28 నుంచి శ్రామిక మహిళా జాతీయ మహాసభలు
గుంటూరు వెస్ట్: శ్రామిక మహిళా 11వ అఖిల భారత మహాసభలు ఈనెల 28 నుంచి 30 వరకు గుంటూరులోని రెవెన్యూ కళ్యాణ మండపంలో జరుగుతాయని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.బాలకాశి తెలిపారు. బ్రాడీపేటలోని యూనియన్ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 28న మధ్నాహ్నం 2 గంటలకు ‘శ్రామిక మహిళలు, జీవన భద్రత’ అనే అంశంపై సదస్సు జరుగుతుందని చెప్పారు. సదస్సుకు శ్రామిక మహిళా జాతీయ కన్వీనర్ డాక్టర్ కే.హేమలత, శ్రామిక మహిళా అఖిల భారత నాయకురాలు ఎస్.వరలక్ష్మి ముఖ్యఅతిధులుగా హాజరై ప్రసంగించనున్నారని తెలిపారు. 29, 30 తేదీలలో ప్రతినిధుల సభ జరుగుతాయని చెప్పారు. 29న సాయంత్రం 5 గంటలకు బ్రాడీపేటలోని యూటీఎఫ్ హాలులో ‘ప్రస్తుత పరిస్థితులు, ఉద్యోగ కార్మికవర్గం ముందున్న సవాళ్లు’ అనే అంశంపై సదస్సు జరుగుతుందని చెప్పారు. సీఐటీయు జాతీయ అధ్యక్షుడు ఏ.కె.పద్మనాభన్ సదస్సుకు హాజరై ప్రసంగించారని తెలిపారు. ఈసందర్భంగా మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ పోస్టర్‌ను ఆవిష్కరించారు. -
మున్సిపల్ ‘రణరంగం’
ఔట్సోర్సింగ్ కార్మికులపై విరుచుకుపడ్డ పోలీసులు పది మందికి గాయాలు విజయవాడ సెంట్రల్ : శ్రమజీవుల రక్తం చిందింది. శాంతియుతంగా సాగుతున్న ర్యాలీపై పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. మహి ళా కార్మికులను మెడలు పట్టి రోడ్డున ఈడ్చారు. దొరికినవారిని దొరికినట్టు ప్రత్యేక వాహనాల్లో కుక్కి పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీసులు వర్సెస్ కార్మికుల మధ్య తోపులాటలు, వాగ్యుద్ధాలు, హాహాకారాలతో లీలామహల్ సెంటర్ రణరంగాన్ని తలపించింది. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం 13 జిల్లాల నుంచి సుమారు 9 వేల మంది ఔట్సోర్సింగ్ కార్మికులు నగరానికి చేరుకున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిచేందుకు తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచిఉదయం 10.30 గంటలకు ర్యాలీగా బయలుదేరారు. లీలామహల్ సెంటర్లోని మనోరమ హోటల్ వద్దకు చేరుకొనేసరికి బారికేడ్లతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్మికులు వాదనకు దిగారు. తమ బాధలు తీరాలంటే పోరాటాలే శరణ్యమన్నారు. పోలీసులు ససేమిరా అనడంతో ఇరువర్గాల మధ్య తోపులాటలు జరిగాయి. మహిళా కార్మికులపై పోలీసులు విచక్షణా రహితంగా దాడులకు పాల్పడ్డారు. ఓవైపు రక్తమోడున్నప్పటికీ కార్మికులు పోరాటాన్ని కొనసాగించారు. ఈ ఘటనలో పది మందికి పైగా కార్మికులకు గాయాలయ్యాయి. బాసటగా నిల్చిన యూని యన్, వామపక్ష నాయకులను బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనా ల్లో పడేశారు. వన్‌టౌన్, భవానీపురం, ఇబ్రహీంపట్నం, త్రీటౌన్, సూర్యారావుపేట, సింగ్‌నగర్ పోలీస్స్టేషన్లకు తరలించారు. సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. మా ఉసురు తగులుతుంది టీడీపీ సర్కార్‌కు తమ ఉసురు తగులుతోం దం టూ కార్మికులు శాపనార్ధాలు పెట్టారు. అరెస్ట్‌ల అనంతరం మునిసిపల్ జేఏసీ నాయకులతో హోటల్ గేట్‌వేలో ముఖ్యమంత్రి జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఔట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనంగా రూ.15,432 చెల్లించాలని, ఇం జినీరింగ్ విభాగంలో పని చేసే స్కిల్డ్, సెమీస్కిల్డ్ ప్రకారం వేతనాలు చెల్లించాలని, కార్మికులను రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్లపై సీఎంతో చర్చించారు. ఏ ఒక్కదానికి సీఎం అంగీకరించలేదు. మీకు(కార్మికులకు) ఇచ్చేందుకు మా(ప్రభుత్వం) వద్ద డబ్బులు ఉండాలిగా అన్నారు. మీరు అంగీకరిస్తే జీతాలు చెల్లించే బాధ్యత స్థాని క సంస్థలు చూసుకుంటాయని యూనియన్ నేతలు బదులిచ్చారు. ఆ స్థానిక సంస్థల వద్దే డబ్బుల్లేవు. వాళ్లకే మేం ఇస్తున్నాం అంటూ బుకాయించారు. ఔట్ సోర్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది తానేనని సీఎం పేర్కొన్నారు. చర్చలు విఫలమయ్యాయని తెలుసుకున్న కార్మికులు చంద్రబాబు తీరుపై దుమ్మెత్తిపోశారు. ఎత్తుకుపై ఎత్తు.. సీఎం క్యాంప్ కార్యాలయ ముట్టడికి భారీగా కార్మికులను తరలించడంలో యూనియన్ నా యకులు సఫలమయ్యారు. అయితే పోలీసులు గురువారం నుంచే రైల్వేస్టేషన్లు, బస్‌స్టాండ్‌ల్లో అరెస్ట్‌లకు శ్రీకారం చుట్టారు. అయినప్పటికీ వివిధ మార్గాల ద్వారా అనూహ్యంగా 9 వేల మంది కార్మికులు విజయవాడ చేరుకున్నారు. -
ఈ కూలితో ఏం తినాలి?
గొలుగొండ : ‘ఉపాధి కూలికెళ్తే గిట్టుబాటు కాదు. ఉదయం నుంచి పని చేసినా కూలి అందలేదు. అలాంటప్పు డు పనికెళ్లి ఏం తినాలి?, ఎలా బతకాలి’.. అంటూ చోద్యం గ్రామానికి చెందిన వందలాది మంది కూలీలు శుక్రవారం రోడ్డెకాకరు. పనులకు వెళ్లకుండా ఆందోళన చేసి రోడ్డుపై బైఠాయించారు. చోద్యం గ్రామంలో 430 మంది కూలీలు ఉపాధి పనులకు రోజూ వెళ్తున్నారు. రెండు వారాలుగా పనికెళ్తున్నా కూలి సొమ్ము అందలేదు. డబ్బులు అందకపోవడంతో రెండ్రోజులుగా కూలీలు ఇబ్బంది పడ్డారు. అధికారులను నిలదీస్తే డబ్బులొచ్చాయి.. తీసుకోండన్నారు. తీరా వెళ్తే ఒక్కొక్కరికి రోజు కూలి రూ.40 నుంచి రూ.60కి మించలేదు. ఎంత పనిచేసినా కూలి డబ్బులు రాకపోవడంతో కూలీంతా ఆవేదన చెందారు. అధికారులు కొలతలు తప్పుగా గుర్తించడం వల్లే కూలి డబ్బులు తక్కువగా వచ్చాయని, మళ్లీ కొలతలు తీయాలని డిమాండ్ చేశారు. పూర్తి స్థాయిలో చెల్లిస్తే తప్ప పనులకు వెళ్లమన్నారు. ఈ పంచాయతీలో ఏడాదిగా పనులు పూర్తిస్థాయిలో చేస్తున్నా సక్రమంగా కూలి ఇవ్వడం లేదన్నారు. సమస్యను పరిష్కరించకపోతే మండల కేంద్రం ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రైతు కూలీ సంఘం నేత సుర్ల బాబ్జి ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. పంచాయతీ కార్యాలయంలో బైఠాయింపు అనకాపల్లి: తమకు కేటాయించిన ఉపాధి పనులను అర్ధాంతరంగా నిలిపి వేసినందుకు నిరసనగా సత్యనారాయణ పురం పంచాయతీ కార్యాలయంలో ఉపాధి హామీ కూలీలు శుక్రవారం బైఠాయించారు. తమ పనులను ఎవరు నిలిపివేశారని సర్పంచ్‌ను నిలదీశారు. సుమారు 400 మంది కూలీలు ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో ఇద్దరు గ్రామస్తులు, ఉపాధి హామీ మహిళా కూలీల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా మహిళా కూలీలను గాయపరిచారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు బయల్దేరి వెళ్లారు. -
కదం తొక్కిన మహిళా కార్మికులు
ఏలూరు (బిర్లాభవన్ సెంటర్) : కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కదంతొక్కి గర్జించారు. గురువారం కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి అంగన్వాడీలు, ఐకేపీ యానిమేటర్లు, ఆశ వర్కర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్థానిక సీఐటీయూ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చి అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభివృద్ధి పేరుతో కార్పొరేట్ సంస్థల జపం చేస్తూ చిరుద్యోగుల కడుపుకొడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 20 నెలల నుంచి యానిమేటర్లకు, ఆశ వర్కర్లకు గౌరవ వేతనాలు ఇవ్వకుండా టీడీపీ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకాయల బాబూరావు మాట్లాడుతూ ఎన్నికల ముందు జాబు కావాలంటే బాబు రావాలంటూ ప్రచారం చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారన్నారు. ఎన్నికలకు ముందు మారిన మనిషినంటూ ప్రచారంతో ప్రజలను నమ్మించి అధికారం చేపట్టాక అసలు రూపాన్ని బయటపెడుతున్నారని ఎద్దేవా చేశారు. కార్మికులకు కనీస వేతనాలు రూ.15 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రతను కల్పించాలని, చిరుద్యోగులపై వేధింపులు ఆపాలని, పెండింగ్‌లో ఉన్న బకాయి వేతనాలు చెల్లించాలని, అంగన్వాడీలకు రూ.800 వేతనం పెంచాలని కార్మికులు చేసిన నినాదాలతో కలెక్టరేట్ దద్దరిల్లింది. ఈ ధర్నాలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు డీఎన్‌వీడీ ప్రసాద్, సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మంతెన సీతారాం, ఆర్.లింగరాజు, బి.సోమయ్య, జీవీఎల్ నర్సింహరావు, వివిధ సంఘాల నాయకులు ఎ.శ్యామలారాణి, కె.విజయలక్ష్మి పాల్గొన్నారు. -
ఆడవారు..ఐతే..!
గోదావరిఖని (కరీంనగర్) : సింగరేణి సంస్థ తొలినాళ్లలో పురుషులతో సమానంగా మహిళా కార్మికుల నియామకాలుండేవి. కాలక్రమంలో మహిళా కార్మికులు బొగ్గు ఉత్పత్తి పనులు చేయలేరని భావించిన యాజమాన్యం కొన్నేళ్ల క్రితమే వారి నియామకాలను నిలిపివేసింది. కేవలం పురుషులకు మాత్రమే వివిధ రకాల పరీక్షలు నిర్వహించి నియామకాలు చేసేవారు. అరతే కార్మికులు అనుకోని విధంగా ప్రమాదాలకు గురైతే వారి కుటుం బాలు రోడ్డున పడకుండా నెలకు కొంత డబ్బు ఇవ్వడం, లేక ఉద్యోగావకాశం కల్పించడం చేశారు. ఇలా తమ పిల్లలను పోషించుకునేందుకు మహిళలు సింగరేణిలో ఉద్యోగాల్లో చేరారు. మొదట వారిని కార్యాలయాల్లో ఫ్యూన్లుగా తీసుకోగా ఆ తర్వాత ఎస్అండ్పీసీ విభాగం కిందకు మరికొంత మందిని తీసుకుని గనులు, డిపార్ట్మెంట్ల వద్ద రక్షణ బాధ్యతలు అప్పగించారు. మరికొంత మందిని గుట్కాల (గనుల్లో వాడే మట్టివద్దలు) తయారీ కోసం వినియోగిస్తున్నారు. ఇలా సాగుతున్న క్రమంలో కొందరు మహిళలను సీఎస్పీలలో బెల్ ్టపైనుంచి పడిన బొగ్గును ఏరివేసే పని అప్పగించారు. మొదట్లో ఈ పని సులువని భావించిన చాలా మంది మహిళలు సీఎస్పీలలో విధులు నిర్వహించారు. కానీ రానురాను ఈ పని వల్ల మహిళా కార్మికుల ప్రాణాలకే ముప్పు ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. కోల్ స్క్రీనింగ్ లేదా కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లలో బొగ్గుతో కూడిన బెల్ట్ నడుస్తున్న క్రమంలో ఏర్పడే దుమ్ము వారి ఊపిరితిత్తులలోకి వెళ్లి అనారోగ్యానికి గురిచేస్తున్నది. ఇదంతా ఒక ఎత్తయితే బెల్ట్ కింద పడిన బొగ్గును చెమ్మాస్ ద్వారా పైకి ఎత్తి బెల్ట్‌పై పోయాలని అధికారులు ఆదేశించడంతో వారు ఆ పనిచేయలేక సతమతమవుతున్నారు. సత్తువను కూడగట్టుకుని మగవారిలాగే మహిళా కార్మికులు బొగ్గు దుమ్ములో పనిచేయూల్సిన పరిస్థితి ఏర్పడింది. దుమ్ము నుంచి రక్షించుకోవడానికి కనీసం వారికి మాస్కులు కూడా యాజమాన్యం ఇవ్వడం లేదు. ఇదిలా ఉండగా దుమ్ములో పనిచేసే కార్మికురాళ్ళకు ప్లేడే కూడా యాజమాన్యం కల్పించకుండా వారి పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నది. ఐఈడీ నిబంధనల ప్రకారం సీఎస్పీలలో కార్మికుల సంఖ్య పెంచాలని ఉన్నప్పటికీ యాజమాన్యం ఆ మేరకు కార్మికులను భర్తీ చేయడం లేదు. ఈ కారణం వల్లనే మహిళా కార్మికులతో పురుషులు చేసే పనులు చేరస్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికైనా మహిళా కార్మికురాళ్ళను మానవతా దృక్పథంతో ఆలోచించి వారిని కార్యాలయాల్లో లేక ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తించేలా చూడాలని పలువురు కోరుతున్నారు. లేదంటే కోల్ఇండియాలో అమలు చేస్తున్నట్లుగా వీఆర్ఎస్ ఇచ్చి తమ వారసులకు ఉద్యోగావకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని మహిళా కార్మికులు కోరుతున్నారు. -
పింఛన్ వస్తదో.. రాదో..!?
భువనగిరి :జిల్లాలోని భువనగిరి డివిజన్లో వేలాది మంది మహిళలు బీడీ పరిశ్రమల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. బీడీ కార్మికులకు రూ.వెయ్యి పింఛన్ ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో వారంతా గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే ప్రభుత్వం ఇవ్వనున్న పింఛన్ లిమిటెడ్ కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులకేనా..? లోకల్ కంపెనీల్లో పనిచేసే వారికి వర్తిస్తుందా.. లేదా.. అన్న అనుమానం వారిని వేధిస్తోంది. లిమిటెడ్ కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికుల వివరాలను ఆయా కంపెనీ యాజమాన్యాలు వేగంగా సేకరిస్తుం డడం, అన్ లిమిటెడ్ కంపెనీలు ఆ పని చేయకపోవడంతో అనుమానం మరింత పెరుగుతోంది. దీర్ఘకాలంగా పొగాకుతో పనిచేయడం వల్ల శ్యాసకోస, క్షయ, టీబీ, కంటి జబ్బులు, రక్తహీనత వంటి వ్యాధులతో అవస్థలు పడుతున్నారు. అయినా కంపెనీ యాజమాన్యాలు, కార్మిక శాఖ అధికారులు చాలా మందికి గుర్తింపుకార్డులు అందించలేదు. గుర్తిం పుకార్డులు లేని వారికి పింఛన్ రాదంటే తమకు తీరని నష్టం వాటిల్లినట్లేనని లోకల్ బీడీ పరిశ్రమల కార్మికులు వాపోతున్నారు. డివిజన్లో 20 పరిశ్రమలు భువనగిరి డివిజన్లో సుమారు 20 వరకు చిన్న, పెద్ద బీడీ పరిశ్రమలు ఉండగా వీటిలో నాలుగు మూతపడ్డాయి. ప్రస్తుతం ఉన్న 16 కంపెనీల్లో సుమారు 3వేల మంది పనిచేస్తున్నారు. భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, రాజాపేట, తుర్కపల్లి, బొమ్మలరామారం తదితర మండలాల్లో బీడీ కార్మికుల సంఖ్య అధికంగా ఉంది. అయితే ఈ డివిజన్లో ఉన్నవన్నీ అన్ లిమిటెడ్ కంపెనీలు కావడంతో కార్మికులు ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో అందడం లేదు. గుర్తింపు కార్డులుంటేనే.. బీడీ పరిశ్రమల్లో పనిచేస్తున్న పలు కార్మిక కుటుంబాలు ఇప్పటికే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందుతున్నాయి. పీఎఫ్, పెన్షన్, వైద్య సౌకర్యం, గృహ నిర్మాణంతోపాటు విద్యార్థులకు ఉపకార వేతనాలు అందుతున్నాయి. అయితే ఇవన్నీ కార్మికులకు పరిశ్రమల యాజమాన్యాలు ఇచ్చే గుర్తింపుకార్డులు, చెల్లించే పీఎఫ్‌పైనే ఆధారపడి ఉంటాయి. గుర్తింపు కార్డులు ఉన్నవారు ఒక్కో కంపెనీలో 10 మందికి మించి లేరని తెలుస్తోంది. -
ఇండస్ ఎక్విప్మెంట్స్ కంపెనీలో పేలుడు
భువనగిరి, న్యూస్‌లైన్ : భువనగిరి పారి శ్రామిక వాడలోని ఇండస్ ఎక్విప్మెంట్స్ కంపెనీలో మంగళవారం ఉదయం పేలుడు సంభవించింది. మహిళా కార్మికులు చెత్తను డస్ట్‌బిన్‌తో పారబోసే సమయం లో లిక్విడ్‌కు రాపిడి కలిగి భారీ శబ్ధంతో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో భువనగిరి మండలం వడపర్తికి చెందిన శైలజ, మన్నెవారిపంపుకు చెందిన ఉడుత అని తలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో శైలజ పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. వెంటనే వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. గత అక్టోబర్‌లో ఇదే ప్రాంతంలోని త్రిస్లా కంపెనీలో బాయిలర్ పేలిన సంఘటనలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. తాజా సంఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉన్న కార్మికులు ఏం జరుగుతుందోనన్న భయంతో కంపెనీల్లోంచి బయటకు వచ్చారు. సుమారు 200 మీటర్ల పరిధిలో గల కంపెనీల కిటికీల అద్దాలు పగిలిపోయాయి. మంగళవారం కావడంతో పక్కనే గల ఎల్లమ్మగుడికి వచ్చిన భక్తులు సైతం పేలుడు శబ్ధంతో ఏం జరుగుతుందో తెలియక భయంతో వణికిపోయారు. పేలుడు సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందించడంతో ఫైరింజన్‌తోపాటు పట్టణ పోలీ సులు సంఘటనాస్థలాన్ని సందర్శించి ప్రమాదాన్ని నివారించారు. కాగా కంపెనీలో బాయిలర్స్, టబ్స్ వంటి పరికరాలను తయారుచేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. ఇందులో సుమారు 15 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కంపెనీలో పనిచేసే కార్మికులకు హెల్మెట్స్, గ్లౌవ్స్, షూ, కంటి అద్దాలు వంటి రక్షణ పరికరాలను ఇవ్వకుండానే నిబంధనలకు విరుద్ధంగా ప్రమాదకరంగా పనిచేయిస్తున్నారని వెల్లడైంది. అయితే గత మూడు నెలలుగా కంపెనీ కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదని తెలుస్తోంది. కాగా సంఘటనాస్థలాన్ని భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్ మధుసూదన్‌రెడ్డి సందర్శించి విచారణ జరుపుతున్నారు.