దేశంలో ఎక్కువ మంది మహిళలకు ఉద్యోగాలు కల్పించిన ప్రైవేటు సంస్థగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రికార్డు సృష్టించింది. బర్గండి ప్రైవేట్ హురున్ ఇండియా లిస్ట్ 2021లో ప్రకటించిన టాప్ 500 కంపెనీల జాబితాలో మహిళా ఉద్యోగుల విషయంలో టాటా కన్సల్టెన్సీ ప్రథమ స్థానంలో నిలిచింది.
టాటాయే నంబర్ వన్
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కి ప్రపంచ వ్యాప్తంగా 5,06,908 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో మహిళా ఉద్యోగుల సంఖ్య రికార్డు స్థాయిలో 1,78,357గా నమోదు అయ్యింది. దాదాపుగా 35 శాతానికి పైగా టీసీఎస్‌లో మహిళా ఉద్యోగులు పని చేస్తున్నారు. సరిగ్గా పదేళ్ల కిందట టీసీఎస్‌లో మహిళా ఉద్యోగుల సంఖ్య 30 శాతంగా ఉండేది. కంపెనీలో ఉద్యోగుల సంఖ్య పెరుగుతున్నా.. ఎక్కడా మహిళల శాతం తగ్గకుండా రిక్రూట్‌మెంట్‌లో జాగ్రత్తలు తీసుకుంటోంది టాటా గ్రూపు.
ఇన్ఫోసిస్‌ది అదే బాట
టాటాల తర్వాత స్థానంలో మహిళలకు ఉద్యోగాలు కల్పిస్తున్న సంస్థగా ఇన్ఫోసిస్ నిలిచింది. ఇన్ఫోసిస్‌లో మొత్తం 2,59,619 మంది ఉద్యోగులు ఉండగా ఇందులో 1,00,321 మంది ఫిమేల్ ఎంప్లాయిస్ ఉన్నారు. మొత్తం ఉద్యోగులు మహిళల శాతాన్ని పరిగణలోకి తీసుకుంటే 38 శాతం ఫిమేల్ వర్క్‌ఫోర్స్తో ఇన్ఫోసిస్ సంస్థ టాటా కంటే ముందు ఉంది. ఇన్ఫోసిస్ తర్వాత స్థానంలో 72,000ల మంది మహిళ ఉద్యోగులతో విప్రో, 61,330 మందితో క్వెస్ కార్పోరేషన్ సంస్థలు మూడు నాలుగు స్థానాల్లో నిలిచాయి.
ఐటీ విప్లవంతో
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో మహిళలు దూసుకుపోతున్నారనడానికి ఈ గణాంకాలు ఉదాహారణగా నిలుస్తున్నాయి. ఐటీ తర్వాత బ్యాంకింగ్ సెక్టార్లో కూడా విమెన్ వర్క్‌ఫోర్స్ పెరుగుతోంది. ఐసీఐసీఐ బ్యాంకు 31,059 మంది మహిళా ఉద్యోగులతో అగ్రస్థానంలో నిలవగా ఆ తర్వాత 21,746 ఎంప్లాయిస్‌తో హెచ్‌డీఎఫ్‌సీ రెండో స్థానంలో నిలిచింది. ఇక దేశంలోనే అతి పెద్ద ప్రైవేటు కంపెనీల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో 2,36,334 మంది ఉద్యోగులు ఉండగా ఇందులో మహిళల సంఖ్య 19,561కే పరిమితమైంది.
జెండర్ ఈక్వాలిటీలో టాటా
దేశంలో అనేక వ్యాపార గ్రూపులు ఉన్నప్పటికీ టాటాది ప్రత్యేక స్థానం. విలువలు, సామాజిక బాధ్యత విషయంలో టాటాలు ఎప్పుడు ఇతర కంపెనీలకు ఆదర్శంగా నిలుస్తూ వచ్చారు. కాగా రతన్ టాటా హాయం నుంచి జెండర్ ఈక్వాలిటీ మీద టాటా గ్రూపు దృష్టి సారించింది. దానికి తగ్గ ఫలితాలు ఇప్పుడు టాటా గ్రూపులో కనిపిస్తున్నాయి. టాటా గ్రూపులో కింది స్థాయిలోనే కాకుండా ఎగ్జిక్యూటివ్ లెవల్‌లో కూడా చాలా మంది మహిళలు పని చేస్తున్నారు.
చదవండి: ‘ఇది మీ ఆకాశం’.. బిగ్‌బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా కొత్త మంత్రం
Comments
Please login to add a commentAdd a comment