హక్కుల రక్షణకు నిరంతరం పోరాడుతాం
బోధన్: కార్మికులు, ఉద్యోగుల హక్కుల రక్షణ, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్‌బాబు అన్నారు. పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో యూనియన్ డివిజన్ ప్రతినిధులతో కలిసి ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని విస్మరించాయని విమర్శించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు, కార్మికులు, ఆశ వర్కర్‌లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కార్మిక చట్టాల సవరణ పేరుతో కార్మికుల ఉపాధిని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నాయన్నారు. కార్మిక రంగ సమస్యల పరిష్కారంలో తమ యూనియన్ కీలకపాత్ర పోషిస్తుందన్నారు.
30, 31 తేదీల్లో జిల్లా మహాసభలు
ఈనెల 30, 31 తేదీల్లో ఆర్మూర్ పట్టణంలో యూనియన్ తొమ్మిదో జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. మూడేళ్లలో చేపట్టిన ఉద్యమాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామన్నారు. కార్మికుల అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో యూనియన్ డివిజన్ ప్రతినిధులు జే శంకర్‌గౌడ్, రమాదేవి, షేక్ మీరాలు పాల్గొన్నారు.