పనిచేయనందుకు కూడా కూలీ ఇవ్వాలి!
పనిచేయనందుకు కూడా కూలీ ఇవ్వాలి!
Published Wed, Jul 9 2014 11:05 AM | Last Updated on Sat, Sep 2 2017 10:03 AM
పని చేస్తే కూలీ ఇవ్వడం మామూలే. కానీ పని చేయకుండా కేవలం ఇతరులను పనిచేయనిచ్చినందుకు కూడా కూలీ ఇవ్వాలట కేరళలో. దీనికి నో్క్కు కూలీ (చూసినందుకు కూలీ) అంటారట.
కేరళలో బరువులు మోసే కూలీలు వామపక్ష ట్రేడ్ యూనియన్ సంస్థ సీఐటీయూకి అనుబంధంగా ఉంటారు. ట్రేడ్ యూనియనిజం వెర్రి తలలు వేసి చివరికి ఈ స్థితికి వచ్చాయి. ఇప్పుడు ఈ నోక్కు కూలీ పెద్ద వివాదమై కూర్చుంది.
ఈ మధ్య ఓ ఐఏఎస్ అధికారి ఇల్లు మారారు. ఆమె తన సొంత పనివాళ్లతో సామాన్లు తరలించారు. అయితే బరువులు మోసే కూలీల యూనియన్ లీడర్ ఆమె ఇంటికి వెళ్లి కూలీ డబ్బులు అడిగాడట. అదేమిటంటే మా యూనియన్ కి చెందని వాళ్లు పనిచేసినా చూస్తూ ఊరుకున్నందుకు కూలీ ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
దీంతో ఒళ్లు మండిన ఆ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆ యూనియన్ నేతజైల్లో కూచుని ఊచలు లెక్కపెట్టుకుంటున్నాడు. అసలీ నోక్కు కూలీ ని రద్దు చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి 2003 నుంచీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ నోక్కు కూలీని రద్దు చేయాలని ప్రయత్నిస్తున్నా వామపక్షాలు అధికారంలోకి రాగానే ఈ కూలీ మళ్లీ వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో అసలీ కూలీ ఎందుకన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Advertisement