కలెక్టరేట్ ఎదుట ఆశ వర్కర్ల ధర్నా
ఆదిలాబాద్ అర్బన్ : సమ్మెకాలంలో ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశావర్కర్లకు కనీసం వేతనం రూ.18 వేలు ఇవ్వాలని, అర్హత కలిగిన వారిని రెండో ఏఎన్‌ఎంగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం హామీనిచ్చి ఏడాది గడుస్తున్నా అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు. యూనిఫాం అలవెన్స్‌లు ఇవ్వాలని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తున్నామని, కానీ ఇంత వరకు తమ సమస్యలు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆశ వర్కర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మమత, ఆశావర్కర్లు రాధ, లక్ష్మి, కాంత, శోభ, పద్మ, లలిత, స్వప్న, కవిత, పుష్పలత, వెంకటమ్మ, తులసీ, సునిత, పుష్ప, భారతీ, తదితరులు పాల్గొన్నారు