ఎమ్మార్వో వనజాక్షికి చంద్రబాబు ఫోన్
విజయవాడ : ఎమ్మార్వో వనజాక్షిపై దాడి కేసును నీరుగార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒత్తిడి చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన వ్యాఖ్యానించారు. ఆమె శుక్రవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ చింతమనేని ప్రభాకర్ను కాపాడేందుకు ప్రభుత్వం వనజాక్షిపై తప్పుడు కేసులు పెట్టేందుకు సిద్ధమైందన్నారు. ప్రభుత్వం బ్లాక్మెయిల్ చర్యలకు ఉద్యోగ సంఘాలు భయపడాల్సిన అవసరం లేదని ఉప్పులేటి కల్పన అన్నారు. మరోవైపు వనజాక్షిపై దాడికి నిరసనగా ధర్నాకు దిగిన రెవెన్యూ ఉద్యోగులకు వైఎస్ఆర్ సీపీ, సీపీఐ, సీపీఐ పార్టీలు మద్దతు ప్రకటించాయి.
మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ...ఎమ్మార్వో వనజాక్షితో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా దాడి ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. కాగా ఈ వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యతను మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చంద్రబాబు అప్పగించారు.