సాక్ష్యాలున్నా చింతమనేనిని అరెస్టు చేయరేం? | ysrcp leaders fire on chandra babu govt | Sakshi
Sakshi News home page

సాక్ష్యాలున్నా చింతమనేనిని అరెస్టు చేయరేం?

Published Sun, Jul 12 2015 2:22 AM | Last Updated on Thu, Apr 4 2019 1:20 PM

సాక్ష్యాలున్నా చింతమనేనిని అరెస్టు చేయరేం? - Sakshi

సాక్ష్యాలున్నా చింతమనేనిని అరెస్టు చేయరేం?

సీఎంపై వైఎస్సార్‌సీపీ నేతలు  పార్థసారథి, గురునాథరెడ్డి ఆగ్రహం

హైదరాబాద్: తహసీల్దార్ వనజాక్షిపై టీడీపీ విప్ చింతమనేని ప్రభాకర్ చేసిన దాడికి సాక్ష్యాలుంటే ఆయనపై చర్యలు తీసుకోకుండా సీఎం చంద్రబాబు సెటిల్‌మెంట్ చేయడం ఏమిటని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు.

ప్రభాకర్ చేసిన దాడికి సంబంధించిన ఫొటోలను చూపిన ఆయన.. సాక్ష్యాలను  పట్టించుకోకుండా కమిటీ వేస్తానని సీఎం చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు ముఠానాయకునిగా వ్యవహరిస్తున్నారని, టీడీపీ నేతలను కాపాడుకునే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వనజాక్షి బంధువులతో చంద్రబాబు మాట్లాడించి, ఆమెపై ఒత్తిడి తెచ్చి, రాజీకి వచ్చేలా చేసుకుంటున్నారని దుయ్యబట్టారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement