
'చంద్రబాబు వనజాక్షిని తప్పుపట్టడం దారుణం'
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఖజానా లూటీ కాకుండా అడ్డుకున్న ముసునూరు తహశీల్దార్ వనజాక్షిని ఏపీ సీఎం చంద్రబాబు తప్పుపట్టడం దారుణమని కాంగ్రెస్ ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చోరీని అడ్డుకోవడమే వనజాక్షి చేసిన నేరమా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు తీరు ఉద్యోగుల్లో అభద్రత భావాన్ని పెంచుతుందని వీహెచ్ అన్నారు. ఈ నెలలో ఏపీ పర్యటించనున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని టీడీపీ అడ్డుకోజూస్తే ప్రతిగా చంద్రబాబును అడ్డుకుంటామని హెచ్చరించారు.