V. Hanumantharao
-
మోసం చేసిన వారిని కూడా చెప్పుతో కొట్టాలి: వీహెచ్
హైదరాబాద్: మాజీ ఉపప్రధాని, దళిత నేత, స్వతంత్ర సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్ 110వ జయంతి ఉత్సవాలు బుధవారం గాంధీభవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు జగ్జీవన్‌రామ్ సేవలను కొనియాడారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మాట్లాడుతూ.. ‘‘ బాబు జగ్జీవన్ రామ్ మహా వ్యక్తి.. దళితుల అభ్యున్నతికి తోడ్పడ్డారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో పరిణామాలు విచిత్రంగా ఉన్నాయి. లంచం అడిగితే చెప్పుతో కొట్టమన్న కేటీఆర్.. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు ఎమైనాయి.. అబద్ధాలు చెప్పి, మోసం చేసిన వారిని కూడా చెప్పుతో కొట్టాలి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడే అన్ని కేసీఆర్ మాటలు ఎటుపోయాయి.. అవినీతి కన్న పెద్ద మోసం మాట తప్పడం కాదా’’ అని వి. హనుమంతరావు ప్రశ్నించారు. -
‘కేసీఆర్ పాలన డిక్టేటర్‌ను తలపిస్తోంది’
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పాలన డిక్టేటర్ పాలనను తలపిస్తోందని, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..‘‘ తెలంగాణ రాష్ట్ర సాధనకి ధర్నాచౌక్ వద్ద జరిపిన ధర్నాలు ఎంతో దోహదం చేశాయి. ఇప్పుడు అదే ధర్నాలను చూసి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు భయపడుతున్నారు. ప్రశ్నించే గొంతులను సీఎం అణిచివేస్తున్నారు. ధర్నా చౌక్ మూసివేత పై అన్నిపార్టీలు స్పందించాలి. ఉద్యమాలతో పుట్టిన తెలంగాణ రాష్ట్రంలో ధర్నా చౌక్‌ని మూసివేయడం సరికాదు. బీసీ సబ్ ప్లాన్ బడ్జెట్‌కి బీసీ నాయకుల సలహాలు తీసుకోకపోవడం దుర్మార్గమని, సీఎం కేసీఆర్ ఓటుబ్యాంక్ రాజకీయాలు మానుకోవాలని’’ వి.హనుమంతరావు సూచించారు. -
అమెరికాలో పెరిగిన గన్ సంస్కృతి
ట్రంప్ వ్యాఖ్యల కారణంగానే భారతీయులపై దాడులు అమెరికాలోని తెలుగువారికి రక్షణ కల్పించాలి పట్టించుకోని మోదీ సర్కార్ భారత ప్రతినిధిని పంపించాలని కాంగ్రెస్ నేత వీహెచ్ డిమాండ్ సిద్దిపేట అర్బన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనాలోచిత నిర్ణయాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యల మూలంగానే అక్కడి భారతీయులపై దాడులు జరగుతున్నాయని మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు అన్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికాలో గన్ సంస్కృతిని పెరిగి పోయిందన్నారు. ఆదివారం సిద్దిపేట మండలం పొన్నాల దాబాల వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముంబయి ఎన్నికల్లో ఏదో సాధించినట్లు గంతులేస్తున్న వెంకయ్య నాయుడికి అమెరికాలోని తెలుగువారు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నోట్ల రద్దు గొప్పలు చెప్పుకునే ప్రధాని మోదీ∙ఎందుకు పట్టించుకోడన్నారు. ఇంట్లోనే ఉండాలి.. తెలుగు మాట్లాడకూడని పరిస్థితుల్లో తెలుగువారు యూఎస్‌లో ఉన్నారంటే వారు ఎంత భయాందోళనలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. అమెరికాలోని భారత విద్యార్థులు, ఉద్యోగాలు చేసుకుంటున్న వారి తల్లిదండ్రులు ఇక్కడ ఎంతో ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయులపై దాడుల నేపథ్యంలో భారత ప్రతినిధులను అమెరికాకు పంపించి అక్కడి భారతీయులకు రక్షణ కల్పించాలన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయంలో చొరవ తీసుకుని ప్రధాని మోదీని కలిసి యూఎస్‌లోని తెలుగువారికి రక్షణ కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. అమెరికాలోని విదేశీయులు ప్రశాతంగా జీవించేందుకు అన్ని దేశాల ప్రతినిధులు సహకరించాలని కోరారు. కేసీఆర్ సంస్కృతి నేర్చుకో.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతుండడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. ఇంకా దొరలెక్క మాట్లాడితే ఎలా సంస్కృతి నేర్చుకోవాలని సీఎం కేసీఆర్‌కు సూచించారు. ఇందిరా పార్కు ధర్నా చౌక్‌ను మార్చే ఆలోచనను విరమించుకోవాలన్నారు. ఒక్క నిరుద్యోగ ర్యాలీకే పరేషాన్ అవుతున్న కేసీఆర్‌కు ముందు ముందు అనేక సమస్యలు ఎదురవుతాయని చెప్పారు. హామీలను మరిచిన కేసీఆర్‌వి మాటలు ఎక్కువ చేతలు తక్కువ అనేది ప్రజలకు అర్థమయిందని, 2019 ఎన్నికల్లో ఎవరేమిటనేది ప్రజలే నిర్ణయిస్తారన్నారు. సమావేశంలో పీసీసీ కార్యవర్గ సభ్యులు గంప మహేందర్‌రావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు లక్కరసు ప్రభాకరవర్మ, మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షులు అక్బర్, నాయకులు వహీద్‌ఖాన్, దాస అంజయ్య, కలీం, షాబొద్దిన్, అత్తు తదితరులు పాల్గొన్నారు. -
'చంద్రబాబు వనజాక్షిని తప్పుపట్టడం దారుణం'
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఖజానా లూటీ కాకుండా అడ్డుకున్న ముసునూరు తహశీల్దార్ వనజాక్షిని ఏపీ సీఎం చంద్రబాబు తప్పుపట్టడం దారుణమని కాంగ్రెస్ ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చోరీని అడ్డుకోవడమే వనజాక్షి చేసిన నేరమా? అని ప్రశ్నించారు. చంద్రబాబు తీరు ఉద్యోగుల్లో అభద్రత భావాన్ని పెంచుతుందని వీహెచ్ అన్నారు. ఈ నెలలో ఏపీ పర్యటించనున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని టీడీపీ అడ్డుకోజూస్తే ప్రతిగా చంద్రబాబును అడ్డుకుంటామని హెచ్చరించారు. -
'హైదరాబాద్ చుట్టూ వందలాది ఎకరాలున్నాయి'
కరీంనగర్: పేదల ఇళ్ల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం భూములను తీసుకోవడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. భవిష్యత్ విద్యా అవసరాల కోసం అవి అవసరమన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల వందలాది ఎకరాల భూములు ఉన్నాయని... వాటిని తీసుకోవాలని సర్కారుకు సూచించారు. కావాలంటే ఆ భూములను తాము చూపిస్తామన్నారు. వీహెచ్ బుధవారం కరీంనగర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించి తెలంగాణ అభివృద్ధికి పాటు పడాలని సీఎం కేసీఆర్‌కు సూచించారు. తెలంగాణ అభివృద్ధికి తమ సహకారం ఉంటుందన్నారు. ఇటీవల తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభించదన్నారు. ఇదే విధంగా ప్రజల మద్దతుతో సర్కారు వ్యతిరేక విధానాలను ఎండగడతామని చెప్పారు. -
పేరు మార్చితే భారీ ఆందోళన
కాంగ్రెస్ నేతల హెచ్చరిక పహాడీషరీఫ్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెడితే భారీ ఆందోళన చేపడతామని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు, మాజీ మంత్రి దానం నాగేందర్ హెచ్చరించారు. 35 మంది పార్టీ నాయకులను శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌కు తరలిం చారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అనంతరం టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్ శాసనసభ పక్షనేత కె.జానారెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, మల్లు భట్ట్టివిక్రమార్క స్టేషన్‌కు చేరుకొని హనుమంతరావుకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వి.హనుమంత రావు మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఉన్న ఆంధ్ర సెటిలర్ల ఓట్లు రాల్చుకునేందుకు చంద్రబాబునాయుడు కుట్రతో దేశీయటెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెడుతున్నారన్నారని ఆరోపించారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు తన పద్ధతి మార్చుకోకపోతే చెప్పులతో స్వాగతం పలకాల్సి ఉంటుందన్నారు. కేంద్రం తనవైఖరిని మార్చుకోకపోతే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని దానం నాగేందర్ హెచ్చరించారు. టెర్మినల్ ఎన్టీఆర్ విమానాశ్రయం పేరుతో కేంద్రం జీవో జారీ చేయడం అభ్యంతరకరమని టీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య,టీ కాంగ్రెస్ శాసనసభ పక్షనేత కె.జానారెడ్డి అన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ అలీ, మాజీ ఎమ్మెల్యే అనిల్, పీసీసీ అధికార ప్రతినిధి జి.నిరంజన్, డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్ ఉన్నారు. -
శాప్స్ నాయకుల అరెస్టు
తిరుపతి క్రైం, న్యూస్‌లైన్: కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంతరావును అలిపిరి వద్ద అడ్డుకున్నందుకు శాప్స్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అలి పిరి వద్ద పుష్పాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ రాజ్యసభసభ్యుడు వీ.హనుమంతరావు కారును అడ్డుకున్న శాప్స్ నాయకులు ఎన్.రాజారెడ్డి, డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం, ఎస్వీయూ జేఏసీ నాయకుడు హరికృష్ణయాదవ్ను అలిపిరి పోలీసులు ఆదివారం తెల్లవారుజామున అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా ఈ నెల 30 వరకు రిమాండ్ విధిస్తూ 4వ అదనపు జూనియర్ జడ్జి శోభారాణి తీర్పు చెప్పారు. దీంతో వారిని సబ్‌జైలుకు తరలించారు. అలిపిరి స్టేషన్ వద్ద ఆందోళన శాప్స్ నాయకులను స్టేషన్‌కు తీసుకెళ్లారనే విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ సీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చిత్తూరు ఎంపీ డాక్టర్ ఎన్ శివప్రసాద్, జేఏసీ కన్వీనర్ డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, శ్రీవెంకటేశ్వర చిల్డ్రన్స్ హైస్కూల్ అధినేత కె.ఎస్.వాసు, ఇతర నాయకులు ఆదివారం ఉదయం 7గంటలకు స్టేషన్ కు వెళ్లి నాయకులను పరామర్శించారు. అరెస్ట్ చేసిన ఉద్యమకారులను పోలీసులు వెంటనే విడుదలచేయాలని నాయకులు ఆందోళన చేశారు. స్టేషన్ ఎదుట ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న డీఎస్పీలు నరసింహారెడ్డి, శంకర్, సీఐలు రాజశేఖర్, నాగభూషణం, గిరిధర్‌రావు, ఎస్ఐలు అబ్బన్న, సురేష్‌కుమార్, హరిప్రసాద్ స్పెషల్ పార్టీ పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు నోటి దురుసుతనంతో మాట్లాడటం తగదన్నారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ, వీహెచ్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్న ఒక మానసిక రోగిగా అభివర్ణించారు. తెలంగాణకు చెందిన లక్షలాది మంది శ్రీవారి దర్శనానికి వచ్చి వెళుతున్నారని, ఇటివలే తెలంగాణకు చెందిన మంత్రులు సునీతాలక్ష్మారెడ్డి, బసవరాజు సారయ్య కూడా వచ్చినప్పటికీ రెచ్చగొట్టే వాఖ్యలు చేయడంలేదని పేర్కొన్నారు. డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ, ఉద్యమకారులను అర్ధరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. వాళ్లు ఏమైనా దొంగలా అని పేర్కొన్నారు. తాము 16 రోజులుగా శాంతియుతంగా ఉద్యమాలు చేస్తున్నామని చెప్పారు. అక్రమ అరెస్టులను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. దళిత నాయకుడు మునిసుబ్రమణ్యం మాట్లాడుతూ, తిరుపతి ఎంపీ చింతామోహన్ సమైక్యాంధ్రకు మద్దతు ఇవ్వకపోవడం దారుణమని, ఆయనకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ టీఅర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మీద ప్రైవేటు కేసు వేస్తామని, ఆయన రెచ్చగొట్టే వాఖ్యలు చేయడం వల్లే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు.