మోసం చేసిన వారిని కూడా చెప్పుతో కొట్టాలి: వీహెచ్
హైదరాబాద్: మాజీ ఉపప్రధాని, దళిత నేత, స్వతంత్ర సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్ 110వ జయంతి ఉత్సవాలు బుధవారం గాంధీభవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు జగ్జీవన్‌రామ్ సేవలను కొనియాడారు.
అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మాట్లాడుతూ.. ‘‘ బాబు జగ్జీవన్ రామ్ మహా వ్యక్తి.. దళితుల అభ్యున్నతికి తోడ్పడ్డారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో పరిణామాలు విచిత్రంగా ఉన్నాయి. లంచం అడిగితే చెప్పుతో కొట్టమన్న కేటీఆర్.. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు ఎమైనాయి.. అబద్ధాలు చెప్పి, మోసం చేసిన వారిని కూడా చెప్పుతో కొట్టాలి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడే అన్ని కేసీఆర్ మాటలు ఎటుపోయాయి.. అవినీతి కన్న పెద్ద మోసం మాట తప్పడం కాదా’’ అని వి. హనుమంతరావు ప్రశ్నించారు.