Babu Jagjivan Ram
-
బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి.. వైఎస్ జగన్ ట్వీట్
-
బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్సార్సీపీ నాయకులు
-
బాబు జగ్జీవన్ రామ్ కి సీఎం జగన్ నివాళి
-
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జగ్జీవన్‌రామ్ వర్థంతి
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బాబూ జగ్జీవన్‌రామ్ వర్థంతి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. జగ్జీవన్‌రామ్ చిత్ర పటానికి పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కైలే అనిల్ కుమార్, మల్లాది విష్ణు, సుధాకర్‌బాబు, అగ్రిమిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి పాల్గొన్నారు. మహనీయుల స్ఫూర్తితో.. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, జగ్జీవన్‌రామ్, అంబేడ్కర్ వంటి మహనీయుల స్ఫూర్తితో.. సమ సమాజం దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. మహనీయుల స్ఫూర్తితో ఎప్పటికప్పుడు ముందుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. మొక్కుబడి మాటలు కాకుండా ఆచరణాత్మకంగా సీఎం చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. అన్ని వర్గాల వారికీ మేలు జరిగేలా సీఎం అడుగులు వేస్తున్నారన్నారు. అన్ని వర్గాలకూ పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌దేనని సజ్జల అన్నారు. -
అది ఆ మహనుభావుల భిక్షే: సుచరిత
సాక్షి, కృష్ణా జిల్లా: ప్రపంచ దేశాల్లో బానిసత్వం ఉంటే.. మన దేశంలో అంటరానితనం చూశామని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. అంటరానితనాన్ని నిర్మూలించేందుకు బిఆర్ అంబేద్కర్ ఎంతో శ్రమించారని, దళితుల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల భవితకు అంబేద్కర్, జగ్జీవన్రామ్లు ఆనాడే పునాదులు వేశారని తెలిపారు. ‘‘నేడు మా లాంటి వారు పదవులు అనుభవిస్తున్నారంటే, దానికి ఆ మహనుభావుల భిక్షే కారణం. అంబేద్కర్ ఆశయాల గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటారు.. కానీ చేతల్లో చూపించే వారుండరు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తున్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. (చదవండి: హక్కులను పోరాడి సాధించుకోవాలి: సుచరిత) పథకాల ద్వారా లబ్ధిపొందే వారికి నేరుగా వారి ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నాం. సీఎం చేపట్టిన పథకాల వలన ఎస్సీ, ఎస్టీల ఆర్థిక స్థితిగతులు మారుతున్నాయి. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ అనే మహత్తర కార్యక్రమాన్ని సీఎం తలపెట్టారు. పేదల సొంతింటి కలను సీఎం జగన్ నెరవేరుస్తున్నారు. డిసెంబర్ 25న దాదాపు 30 లక్షలకు పైగా అర్హులకు ఇళ్ల స్థలాలు పంపిణీ జరుగుతోంది. రాష్ట్రంలో ప్రజలందరి బాగు కోరుకుంటున్న ఏకైక సీఎం వైఎస్ జగన్’’ అని పేర్కొన్నారు. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల ఏర్పాటుకు సహకరించిన స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు మంత్రి సుచరిత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: చంద్రబాబుకు బాధ్యత లేదు: శ్రీరంగనాథరాజు) -
బాబు జగ్జీవన్‌కు సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి: బాబు జగ్జీవన్ రామ్ 113వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. ‘అట్టడుగు వర్గాల అభ్యున్నతి, అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన పోరాటం మర్చిపోలేనిది. స్వాతంత్య్ర సమరయోధుడిగా, ఉపప్రధానిగా దేశసేవకు అంకితమైన ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. నేడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళి’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. (వివక్షను జయించిన జగ్జీవన్) కాగా సీఎం జగన్ ఆదివారం ఉదయం తన నివాసంలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి విశ్వరూప్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున తదితరులు పాల్గొన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి, అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన పోరాటం మర్చిపోలేనిది. స్వాతంత్య్ర సమరయోధుడిగా, ఉపప్రధానిగా దేశసేవకు అంకితమైన ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. నేడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళి. — YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2020 -
జగ్జీవన్ రాంకు నివాళులు అర్పించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి : బాబు జగ్జీవన్ రాం వర్దంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్‌లో నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మిథున్ రెడ్డి, వైవి. సుబ్బారెడ్డి, చీఫ్ విప్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జగ్జీవన్ రాం ఆశయసాధనకు కృషి
రెబ్బెన: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం విశేష సేవలు అందించిన బాబు జగ్జీవన్‌రాం ఆశయాలను కొనసాగించేందుకు ప్రతీఒక్కరు కృషి చేయాలని సింగరేణి ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏరియా అధ్యక్షుడు బోడ భద్రు, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోషియేషన్ ఏరియా ఉపాధ్యక్షుడు గోపాలక్రిష్ణ సూచించారు. శుక్రవారం గోలేటి టౌన్షిప్ లోని తెలంగాణ విగ్రహం వద్ద బాబు జగ్జీవన్ రాం 32వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి హరిజన, గిరిజన, బహుజన సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలోని హరిజన, గిరిజనులతో పాటు బడుగు, బలహీన వర్గాలు ఒక్క తాటిపైకి వచ్చి అభివృద్ధి మార్గంలో ముందుండి నడవాలన్నారు. బడుగు, బలహీన వర్గాలు ఐక్యంగా ఉన్నప్పుడే హక్కులు సాధించుకోవచ్చన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ అభివృద్ధిబాటలో నిలవాలన్నారు. బలహీన వర్గాల కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా అత్యున్నత స్థాయికి చేరుకున్న వారిలో బాబు జగ్జీవన్‌రాం ముఖ్యుడన్నారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొని, దేశ స్వాతంత్య్రం కోసం పాటు పడ్డారన్నారు. ప్రజానాయకుడిగా పేరు పొందటంతో పాటు సుధీర్ఘకాలం పాటు పార్లమెంటు సభ్యులుగా పని చేసి ఎన్నో పదవులు అదిష్టించారన్నారు. పీడిత, తాడిత ప్రజల ఆశాజ్యోతిగా పేరుపొంది బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారన్నారు. అలాంటి మహోన్నతుడి ఆశయ సాధన కోసం ప్రతీఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏరియా ప్రధాన కార్యదర్శి జాదవ్ సంజేష్, నాయకులు అంజనేయులుగౌడ్, లింగంపల్లి ప్రభాకర్, మల్రాజు రాంబాబు, కోరాల రాజేందర్, పోషం, శంకర్ పాల్గొన్నారు. -
ఘనంగా బాబుజగ్జీవన్‌రాం వర్ధంతి
కరీంనగర్: మాజీ ఉపప్రధాని బాబుజగ్జీవన్‌రాం 32వ వర్ధంతిని శుక్రవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం, టీపీసీసీ ఎస్సీసెల్ అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్ హాజరై నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ వ్యవసాయశాఖమంత్రిగా దేశాన్ని అభివృద్ధిలో నడిపించారని కొనియాడారు. టీపీసీసీ ఎస్సీసెల్ అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్ మాట్లాడుతూ జగ్జీవన్ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న మహనీయుడని కొనియాడారు. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఉప్పరి రవి ఆధ్వర్యంలో బాబుజగ్జీవన్‌రాం విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆరెపల్లి మోహన్, ఆకుల ప్రకాశ్, కర్ర రాజశేఖర్, దిండిగాల మధు, వెన్న రాజమల్లయ్య, గందె మాధవిమహేశ్, బాకారపు శివయ్య, మాదాసు శ్రీనివాస్, చింతల కిషన్, టేల భూమయ్య, సదానందంనాయక్, లక్ష్మీనారాయణ, దాసరి సత్యనారాయణ, ఎర్రోళ్ల శ్రీనివాస్, పెద్దెల్లి ఆంజనేయులు పాల్గొన్నారు. జగ్జీవన్‌రామ్‌కు నివాళి కరీంనగర్: బాబుజగ్జీవన్‌రాం వర్ధంతిని శుక్రవారం కరీంనగర్లో నిర్వహించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి నివాళి అర్పించారు. దళిత సంఘాల నాయకులు కల్లెపల్లి శంకర్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు గోష్కి శంకర్, కామారపు శ్యామ్, మనోహర్, గడ్డం కొమురమ్మ, దుబ్బ నీరజ, ఎమ్మార్పీఎస్ నగర అధ్యక్షుడు గోష్కి అజయ్, అంబేద్కర్ యువజన సంఘం నగర అధ్యక్షుడు రమేశ్, కోహెడ వినోద్, ఇల్లందు మొండయ్య, గాలిపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
జగ్జీవన్‌రామ్‌కు వైఎస్సార్ సీపీ నివాళి
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ్లాల్లో బాబు జగ్జీవన్‌రామ్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలు జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కొలుసు పార్థసారధి, గౌతమ్ రెడ్డి, వసంత కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే రక్షణనిధి, అడపా శేషు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నివాళులు అర్పించారు. -
దళితులపై అనుచిత వ్యాఖ్యలు
మునగపాక (యలమంచిలి) : భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ చిత్రపటాన్ని ధ్వంసం చేయటమే కాకుండా దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత మద్దాల కృష్ణను అరెస్టు చేయాలని కోరుతూ శుక్రవారం మండలంలోని నాగులాపల్లిలో పూడిమడక రోడ్డుపై దళితులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న అనకాపల్లి రూరల్ సీఐ రామచంద్రరావు జోక్యం చేసుకుని ఆందోళనకారులను శాంతపరిచారు. వివరాలను ఫిర్యాదుదారు డు డొక్కా దేముడు విలేకరులకు తెలియ జేశారు. జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకల్లో భాగంగా మండలంలోని నాగులాపల్లి పాలసంఘ ఆవరణలో దళితుల ఆధ్వర్యంలో చిత్రపటం ఏర్పాటు చేసి నివాళు లర్పించామన్నారు. సాయంత్రం ఇదే గ్రామానికి చెందిన టీడీపీ నేత మద్దాల కృష్ణ జగ్జీవన్‌రామ్ చిత్రపటం ధ్వంసం చేయడంతో పాటు దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దళితులపై చేసిన వ్యాఖ్యలకు నిర సనగా శుక్రవారం దళితులు పూడిమడకరోడ్డుపై నాగులాపల్లి వద్ద ఆందోళనకు దిగారు. దళితులపై దూషణలు చేసిన కృష్ణను తక్షణమే అరెస్టు చేయాలని లేకుం టే ఆందోళన తీవ్రతరం చేస్తామంటూ హెచ్చరించారు. ఆందోళన నేపథ్యంలో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. అనకాపల్లి సీఐ రామచంద్రరావు సంఘటన స్థలానికి చేరుకొని అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆందోళనలో దళిత నేత దేముడు, కోనపల్లి నాగేశ్వరరావు, గోసాల గోపాలరావు, కశింకోట నరేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏఎస్ఐ మణికుమారికి దళితులను కించపరిచిన కృష్ణను అరెస్టు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా తాను నాగులా పల్లి వెళ్లలేదని కృష్ణ ఫోన్లో తెలిపారు. -
బాబూ జగ్జీవన్‌రామ్‌కు వైఎస్ జగన్ ఘన నివాళి
సాక్షి, గుంటూరు: భారతదేశ మాజీ ఉప ప్రధాని, సమతావాది బాబూ జగ్జీవన్ రామ్ 111వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. గుంటూరు జిల్లాలోని ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గురువారం వేజేండ్ల శివారులో ఏర్పాటు చేసిన జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను వైఎస్ జగన్ కొనియాడారు. కేంద్ర కార్యాలయంలో.. హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా పార్టీ నేతలు బత్తుల బ్రహ్యానంద రెడ్డి, పద్మజ, సంజీవరావు తదితరులు పాల్గొని జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర కార్యాలయంలో.. విజయవాడలోని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నాయకులు మేరుగ నాగార్జున, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, బొప్పన భవకుమార్ తదితరులు జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. -
జగమెరిగిన జననేత
ఒక వైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే, మరోవైపు సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని సమ రం సాగించిన రాజకీయ సవ్యసాచి, సామాజిక విప్లవ యోధుడు బాబూ జగ్జీవన్ రామ్. జాతి జనులను విద్యావంతులుగా, ఆత్మాభిమానం కలవారిగా చేయాలన్నదే తన లక్ష్యం. జగ్జీవన్ బీహార్‌లోని షాబాద్ జిల్లా చాంద్వా గ్రామంలో 1908 ఏప్రిల్ 5న సంతోషోభిరామ్, బసంతి దేవిలకు జన్మించారు. ఆయన చదువుకున్న పాఠశాలలోనే మొదటిసారిగా అంటరానితనాన్ని అనుభవించాడు. అదే పాఠశాలలో విద్యార్థుల కోసం మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తూ రెండు కడవలపై ‘హిందూ పానీ’, ‘ముస్లిం పానీ’ అని రాసి ఉంచేవారు. అయితే జగ్జీవన్ రామ్ హిందూ పానీలో మంచినీరు తాగారని హిందూ విద్యార్థులు ఆ కుండలోని నీరు త్రాగేవారు కాదు. ఈ ఉదంతంతో ఆగ్రహించిన బాబు ఒక రాయి విసిరి ఆ కుండను ముక్కముక్కలు చేశాడు. అప్పుడు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ‘హరి జన పానీ’ అనే మరో కుండను ఏర్పాటుచేశాడు. జగ్జీవన్ రామ్ ఆ కుండని కూడా పగులకొట్టాడు. ఇక చేసేదేమీలేక ఆ పాఠశాల వారు ఒకే కుండను ఏర్పాటుచేశారు. ఈ సంఘటనలో జగ్జీవన్ రామ్ గెలిచినా ఆయన గుండె ఆవేదనతోనూ, కోపంతోనూ నిండిపోయింది. ఆ అనుభవాలే ఆయన దళిత జనుల జాగృ తివైపు ముందుకు సాగడానికి ప్రేరణనిచ్చాయి. లాహోర్‌లో 1929 డిసెంబర్ 1న జరిగిన కాంగ్రెస్ మహాసభలో పాల్గొంటూనే జగ్జీవన్ మరోవైపు దళిత జాతీయ సమావేశాన్ని నిర్వహించారు. మన దేశంలో జగ్జీవన్ను వరించినంతగా మంత్రి పదవులు మరెవరినీ వరించలేదు. ఆయన రాజకీయ జీవితంలో విశిష్టమైన ఘటనలు కొన్ని. 1967–70లో ఆహార, వ్యవసాయ శాఖా మంత్రిగా హరిత మండలాలను అభివృద్ధి చేసి మొదటిసారి భారతదేశం ఆహార స్వయం ప్రతిపత్తి సాధించే విధంగా చేసి, దేశాన్ని కరువు బారినుండి కాపాడారు. 1970–74లో రక్షణశాఖా మంత్రిగా పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్‌ను విముక్తి చేసి, పాకిస్తాన్ సేనలు బేషరతుగా లొంగిపోయేలా చేశారు. జగ్జీ్జవన్ రామ్ విజయవాడ వచ్చినప్పుడల్లా తన ప్రియ మిత్రుడు, ప్రముఖ కాంగ్రెస్ నాయకులు, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రాజ్యసభ సభ్యులు అయిన మా తండ్రిగారు అప్పికట్ల జోసెఫ్ గారి ఇంటిలోనే ఆతిథ్యం స్వీకరించేవారు. దళితుల హక్కులను రాజ్యాంగంలో అంబేడ్కర్ పొందుపరిస్తే వాటిని చట్ట రూపంలో అమలుచేయడానికి జగ్జీవన్ రామ్ చేసిన కృషి మరపురానిది. దళిత ప్రజలందరూ ఐకమత్యంతో కలిసి విద్యనూ ఆయుధంగా మలచుకొని అర్థిక స్వావలంబన సాధిం చడం, ఆత్మగౌరవంతో బతకటానికి కృషిచేయడమే ఆయనకు జాతి సమర్పించే నిజమైన నివాళి. (రేపు బాబూ జగ్జీవన్ రామ్ జయంతి) అప్పికట్ల వి. పటేల్, చైర్మన్, మాదిగ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ‘ 99494 18222 -
జగ్జీవన్ రామ్‌కు వైఎస్ఆర్సీపీ ఘన నివాళి
-
జగ్జీవన్ రామ్ కు వైఎస్ఆర్ సీపీ ఘన నివాళి
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 31 వర్ధంతి సందర్భంగా ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా నివాళులు అర్పించింది. వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన జగ్జీవన్ రామ్ చిత్రపటానికి ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే ఆదిమూలపు రవికుమార్,పార్టీ అధికార ప్రతినిధి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మోసం చేసిన వారిని కూడా చెప్పుతో కొట్టాలి: వీహెచ్
హైదరాబాద్: మాజీ ఉపప్రధాని, దళిత నేత, స్వతంత్ర సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్ 110వ జయంతి ఉత్సవాలు బుధవారం గాంధీభవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు జగ్జీవన్‌రామ్ సేవలను కొనియాడారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మాట్లాడుతూ.. ‘‘ బాబు జగ్జీవన్ రామ్ మహా వ్యక్తి.. దళితుల అభ్యున్నతికి తోడ్పడ్డారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో పరిణామాలు విచిత్రంగా ఉన్నాయి. లంచం అడిగితే చెప్పుతో కొట్టమన్న కేటీఆర్.. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు ఎమైనాయి.. అబద్ధాలు చెప్పి, మోసం చేసిన వారిని కూడా చెప్పుతో కొట్టాలి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడే అన్ని కేసీఆర్ మాటలు ఎటుపోయాయి.. అవినీతి కన్న పెద్ద మోసం మాట తప్పడం కాదా’’ అని వి. హనుమంతరావు ప్రశ్నించారు. -
జగజ్జీవన్రామ్కు వైఎస్ జగన్ ఘన నివాళి
హైదరాబాద్: భారత మాజీ ఉప ప్రధాని, దళిత నేత బాబూ జగజ్జీవన్రామ్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఆదివారం హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జగజ్జీవన్‌రామ్ చిత్ర పటానికి వైఎస్ జగన్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైఎస్ జగన్ ...దేశానికి బాబూ జగజ్జీవన్‌రామ్ చేసిన సేవలను కొనియాడారు. వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో జరిగిన జగజ్జీవన్‌రామ్ జయంతి వేడుకలకు ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులతో పాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
'ప్రజాస్వామ్య విలువల కోసం పరితపించిన జగజ్జీవన్‌రాం'
న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్య విలువ కోసం పరితపించిన వ్యక్తి బాబూ జగజ్జీవన్‌రాం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ఎదిరించి ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వ్యక్తి జగజ్జీవన్‌రాం అని ఆయన గుర్తు చేశారు. ఆదివారం న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో బాబూ జగజ్జీవన్‌రాం జయంతి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
నేడు జగజ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు
హైదరాబాద్ : బాబూ జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ఉత్సవాలను నగరంలో ఆదివారం నిర్వహించనున్నారు. నగరంలోని బషీర్‌బాగ్ లో జరిగే జయంతి ఉత్సవాలలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు. -
అంబేద్కర్, జగ్జీవన్ జయంతులకు... జిల్లాకు లక్ష
హైదరాబాద్, రంగారెడ్డిలకు కలిపి రూ.20లక్షలు సాక్షి, హైదరాబాద్: బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రాం జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం నిధులు పెంచుతూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఈ నిధులను విడుదల చేసినట్టు సీపీఆర్ఓ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 5న జగ్జీవన్‌రాం జయంతి, 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉత్సవాలు నిర్వహించేందుకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు రూ.10 లక్షల చొప్పున, 8 జిల్లాలకు లక్ష చొప్పున విడుదల చేసినట్టు ప్రకటనలో పేర్కొంది. ఈ జయంతులను రాష్ర్టస్థాయి ఉత్సవాలుగా హైదరాబాద్‌లో జరిపేందుకు ఒక్కో ఉత్సవానికి రూ.10లక్షల చొప్పున మంజూరుచేసింది. ఆది వారం జరగనున్న జగ్జీవన్‌రాం జయంతి ఉత్సవాల్లో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ అతిథులుగా పాల్గొంటారు. -
జగ్జీవన్‌రామ్ సేవలు మరువలేనివి
ఇందూరు, న్యూస్‌లైన్ : భారత రాజ్యాంగం దేశానికి వెన్నెముకలాంటిది. అలాంటి రాజ్యాంగానికి రూపకల్పన చేసిన వారిలో బాబూ జగ్జీవన్‌రామ్ ఒకరని జిల్లా కలెక్టర్ పీ.ఎస్. ప్రద్యుమ్న అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం బాబూ జగ్జీవన్‌రామ్ 107వ జయంతి సభలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశం లో రాజకీయ స్వాతంత్య్రం ఉంటే సరిపోదని, ప్రజలకు ఆర్థిక, సామాజిక, సమన్యాయ స్వాతంత్య్రం కావాలని జగ్జీవన్‌రామ్ పోరాడి సాధించారని అన్నారు. ఆయన పోరాట ఫలి తంగానే రాజ్యాంగంలో పలు అంశాలను చేర్చడంతో నేడు మనమందరం స్వేచ్ఛగా జీవిస్తున్నామన్నారు. బీహార్‌లో జన్మించిన జగ్జీవన్ రామ్ కేంద్రానికి మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారని అన్నారు. తరువాత వ్యవసాయ మంత్రిగా ప్రజల మేలు కోరి దేశ చరిత్రలో గొప్ప వ్యక్తిగా నిలి చారని కొనియాడారు. అయితే ప్రస్తుత తరం దేశ కోసం పోరాడిన మహనీయులను మరిచి పోతోందన్నారు. విద్యార్థులకు మహనీయుల పేర్లు కూడా తెలియని పరిస్థితి నెలకొనడం చాలా విచారకరమన్నారు. జిల్లా ఎస్పీ తరుణ్ జోషి మాట్లాడుతూ బాబూ జగ్జీవన్ రామ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. జేసీ వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ అంటరాని తనాన్ని రూపు మాపేందుకు పోరాటం చేసిన బాబూ జగ్జీవన్ రామ్ అడుగు జాడల్లో నడవాలన్నారు. అంటరానితనం అక్కడక్కడా ఇంకా ఉందని,దానిని పూర్తి స్థాయిలో నిర్మూలించేదుకు జిల్లా యంత్రాగం చర్యలు చేపడుతుందన్నారు. స్థానిక రైల్వే కమాన్ వద్ద పాత అంబేద్కర్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డెరైక్టర్ ఖాలేబ్, ఐకేపీ పీడీ వెంకటేశం, ఇన్చార్జి డీఎస్‌డబ్ల్యూఓ అల్ఫోన్స్, ఏఎస్‌డబ్ల్యూ జగదీశ్వర రెడ్డి,కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు కలెక్టర్ రైల్వే కమాన్ చౌరస్తాలో జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూల మాలలు వేశారు. అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన చిత్ర పటానికి పూల మాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. మాజీ ఎంపీ మధుయాష్కీ నివాళి.. రైల్వే కమాన్ చౌరస్తాలోని బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహానికి మాజీ ఎంపీ మధుగౌడ్ యాష్కీ పూల మాలలు వేసి వివాళులు అర్పించారు. అనంతరం అంబేడ్కర్ భవన్‌లోని చిత్ర పటానికి పూల మాలలు వేశారు. సాంఘిక సంక్షేమాధికారులు భోజనాలు ఏర్పాటు చేయగా, విద్యార్థులు, ఉద్యోగులతో పాటు కలిసి భోజనం చేశారు. కాగా అక్కడున్న ఓ వృద్ధురాలిలో కలిసి ముచ్చటిస్తూ భోజనం చేసి అందరిని ఆకట్టుకున్నారు. -
అటు కోట.. ఇటు పురం...
‘పేట’ అయినా.. ‘కోట’ అయినా జన నినాదం ఒక్కటే-‘జై జగన్’! ఆయన ఏ ‘పురం’ వెళ్లినా.. ఏ పల్లె నుంచి సాగినా.. అందరి కనుపాపలపై ప్రతిఫలించే నమ్మకం ఒక్కటే- ‘రాజన్న రాజ్యం’ మళ్లీ రావడం తథ్యం! గుండె లోతుల్లోని ప్రజల అభిమానమే గొంతులోకి వస్తోంది. తమ కష్టాలు తీర్చగల, కడగండ్లను కడతేర్చగల నాయకుడు జననేతేనన్న తిరుగులేని గురే వారిని ఆయన దరికి పరుగులు పెట్టిస్తోంది. సామర్లకోట పట్టణం సాధారణంగా.. అక్కడ కొలువుదీరిన కుమారారామ భీమేశ్వరుని సన్నిధికి మహాశివరాత్రి నాడు తరలివచ్చే భక్తులతో కిక్కిరిసిపోతుంది. జగన్ రోడ్ షోకు పోటెత్తిన జనాన్ని చూస్తే.. ‘మొన్న మొన్ననే జరిగిన మహాశివరాత్రి ఇంతలోనే తిరిగి వచ్చిందా?’ అనిపించింది. ఇక.. పెద్దాపురంలో జరిగిన జనభేరి సభకు వెల్లువెత్తిన జనాన్ని చూస్తే.. ఆ పట్టణంలో ఆషాఢమాసంలో జరిగే.. మరిడమ్మ జాతర ‘ముందే వచ్చిందా?’ అనిపించింది. సాక్షి, సామర్లకోట : ఆత్మీయబంధువు రాకతో జనకెరటం ఎగసిపడింది. అడుగడుగునా అపూర్వ స్వాగతం పలికింది. జననేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనతో సామర్లకోట, పెద్దాపురం పట్టణాల్లో నిజంగా ఎటు చూసినా పండగ వాతావరణం కనిపించింది. తమ గుండెల్లో దైవంలా కొలువుదీర్చి కొలుస్తున్న మహానేత తనయుడు తమ చెంతకు రావడంతో జనం ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా పోయింది. ఇళ్లనువదిలి రోడ్లపై చేరి, గంటల తరబడి నిరీక్షించారు. చిన్నారులు.. యువకులు.. మహిళలు.. వృద్ధులనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ అభిమాన నాయకుడిని చూడగానే ఆనందంతో కేరింతలు కొట్టారు. తన కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న వారందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ జననేత ముందుకు సాగారు. ‘జగన్‌బాబుకు తనను ప్రేమించే ప్రజలంటే ఎంత మక్కువో! వారి మధ్యకు రావడానికి ఎంత ఆరాటమో! వారికి భరోసాను కల్పించడానికి ఎంత ఆయాసప్రయాసలనైనా భరించే ఆయనది ఎంత ఓర్పో! జనాన్ని తన ఆత్మీయగణంగా పరిగణించే అలాంటి నేతకు ఒక్కసారి అవకాశమిస్తే ఇక మా జీవితాల్లో వెలుగులు విరజిమ్మడం.. ఉషోదయం తూర్పున అన్నంత నిశ్చయమే!’ అని జనం ఉప్పొంగి పోయారు. ‘వైఎస్సార్ జనభేరి’ పేరుతో చేపట్టిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో ఆరవ రోజైన శనివారం జననేత జగన్ సామర్లకోట పట్టణ వీధుల్లో నిర్వహించిన రోడ్ షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ద్వారపూడి రోడ్‌లోని నవభారత్ వెంచర్స్ గెస్ట్‌హౌస్ నుంచి పార్టీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ నాయకులు చలమలశెట్టి సునీల్, పెద్దాపురం కో ఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు, సామర్లకోట మున్సిపల్ చైర్మన్ అభ్యర్ధి గోలి వెంకట అప్పారావు చౌదరి(దొరబాబు)లతో కలిసి జగన్ రోడ్ షోకు శ్రీకారం చుట్టారు. తొలుత ఆయన షుగర్ ఫ్యాక్టరీ కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ‘ఎంత కూలి వస్తుంది? ఏ విధంగా ఉన్నారు?’ అంటూ ఆరా తీశారు. అక్కడి నుంచి రోడ్ షో రైల్వేస్టేషన్, పోలీస్ రింగ్ సెంటర్, దేవీచౌక్, గోలి వారి వీధి, నీలమ్మ ట్యాంకు, గొల్లగూడెం వీధి, బళ్ల మార్కెట్, సీతాఫలదొడ్డి, వెంకటేశ్వరస్వామి, చంద్రశేఖరస్వామి వారి ఆలయాల మీదుగా సాగింది. ప్రియతమ నాయకుడా! నీకై ఎదురుచూస్తోంది మా వాడ! తమ కలలకు కేంద్రంగా నిలిచిన నాయకుడిని తమ ప్రాంతానికి రప్పించుకోవాలన్న బలీయమైన ఆకాంక్షతో వేలాది మంది ప్రజలు రోడ్ షోకు అడ్డుపడ్డారు. తమ ప్రాంతాల్లో పర్యటించాలని జగన్‌ను ఒత్తిడి చేశారు. వారి అభిమానాన్ని కాదనలేని ఆయన వారి ప్రాంతాలకు పర్యటించారు. లారీ యూనియన్ అధ్యక్షుడు ముత్యం రాజుబాబు ఇంట్లో భోజన విరామం అనంతరం మధ్యాహ్నం వేణుగోపాలస్వామి గుడి, అడపా వారి వీధి, బోనాసువారి వీధి, పశువులమ్మ గుడిల మీదుగా బ్రౌన్‌పేట వైపు జగన్ రోడ్‌షో సాగాల్సి ఉంది. అయితే బోనాసువారి వీధికి చేర్చి ఉన్న కుమ్మరిపేట, అరుంధతీపేట వాసులు తమ ప్రాంతాల్లో పర్యటించాలని కాన్వాయ్‌కు అడ్డుపడి అభిమానంతో కట్టిపడేశారు. అరుంధతీపేట వాసులైతే తమ ప్రాంతంలో ఉన్న బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేయాలని పట్టుబట్టారు. వారి అభిమానానికి బందీ అయిన జననేత కాలిన డకనే ఆయా ప్రాంతాలకు వెళ్లారు. కుమ్మరి వీధిలో ప్రతి ఒక్కర్నీ పలకరించడమే కాక.. అరుంధతీపేటలో స్థానికుల కోరిక మేరకు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చిన్నారులను ముద్దాడి..మహిళలు..వృద్ధులను పలకరించడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అనంతరం పశువులమ్మగుడి మీదుగా బ్రౌన్పేటకొచ్చేసరికి వేలాది మంది జనం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయాల్సిందిగా పట్టుబట్టారు. జగన్ ఆ మహానీయునికి నివాళులర్పించి ముందుకు కదిలారు. అడుగడుగునా ఇదే రీతిలో ప్రజలు జననేతకు జనం నీరాజనాలు పలికారు. దీంతో ఉదయం 10.10 గంటలకు ప్రారంభమైన రోడ్ షో పట్టణ పరిధిలో పది కిలోమీటర్ల మేర సాగడానికి పది గంటలకు పైగా సమయం పట్టింది. ప్రతి ఒక్కర్నీ పేరుపేరునా పలకరిస్తూ వారి కష్టసుఖాల్లో మమేకమైన జగన్‌ను చూసి ఇలాంటి నాయకుడిని ముందెన్నడూ వృద్ధులు వ్యాఖ్యానించారు. ‘బిడ్డ పదికాలాలు చల్లగా ఉండాలి. ప్రజలను చల్లగా పాలించాలి’ అంటూ ఆశీర్వదించారు. జనఝరిగా జరిగిన ‘జనభేరి’ సామర్లకోట నుంచి జగన్ నేరుగా పెద్దాపురం వెళ్లి మెయిన్రోడ్లోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద జరిగిన వైఎస్సార్ జనభేరి సభలో పాల్గొన్నారు. మహానేత తనయుడిని చూ సేందుకు నియోజకవర్గమంతా తరలి వచ్చిందా అన్నట్టు పెద్దాపురం పట్టణ వీధులు జనప్రవాహాలయ్యాయి. జగన్ ప్రసంగంలో ప్రతి పలుకుకూ ప్రజలు హర్షాతిరేకాలతో స్పందించారు. పర్యటనలో సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ, అనుబంధ విభాగాల కన్వీనర్లు పంపన రామకృష్ణ, గుత్తుల రమణ, రావూరి వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు జ్యోతుల నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.