న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్య విలువ కోసం పరితపించిన వ్యక్తి బాబూ జగజ్జీవన్రాం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ఎదిరించి ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వ్యక్తి జగజ్జీవన్రాం అని ఆయన గుర్తు చేశారు. ఆదివారం న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో బాబూ జగజ్జీవన్రాం జయంతి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.