Jayanthi celebrations
-
డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ అమెరికా ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలు
న్యూ జెర్సీ: డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ అమెరికా ఆధ్వర్యంలో వైయస్ఆర్ 75వ జయంతి వేడుకలు న్యూ జెర్సీ, మన్రో లోని థాంప్సన్ పార్కులో ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించారు. మహానేత వైఎస్సార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించారు. 300 మందికి పైగా వైఎస్సార్ అభిమానులు పాల్గొని నివాళులర్పించారు.డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యం లో వైస్సార్ ను స్మరించుకుంటూ చేస్తున్న సేవలను ప్రెసిడెంట్ ఆళ్ళ రామి రెడ్డి వివరించారు. గ్రాండ్ స్పాన్సర్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి సహాయంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో 130 కి పైగా ఆర్ఓ వాటర్ ప్లాంట్లు, కోవిడ్ సమయం లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, స్కూల్ బిల్డింగ్స్, బస్ షెల్టర్స్, వీధి దీపాలు, స్కూల్ బాగ్స్, కంప్యూటర్ లాబ్స్, మెడికల్ కిట్స్ , ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ లాంటి పధకాలు.. దేశమంతటా అమలు చేయడం రాష్ట్రానికే గర్వకారణం అని డాక్టర్ రాఘవ రెడ్డి గోసల పేర్కొన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్ ఉపయోగించుకొని ఎంతోమంది ఈ రోజు అమెరికా లో వున్నారు అంటే.. రాజశేఖర రెడ్డి ముందుచూపే కారణం అని రాజేశ్వర్ రెడ్డి గంగసాని తెలిపారు. నదులను అనుసంధానం చేయడానికి కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు కృషి చేయాలని శ్రీకాంత్ కోరారు.భానోజీ రెడ్డి, రాజా బొమ్మారెడ్డి, శ్రీకాంత్ గుడిపాటి, రమణా రెడ్డి తో పాటు పలువురు వక్తలు వైఎస్సార్ ప్రవేశ పెట్టిన పథకాలను కొనియాడారు. అందరూ కలసి ఇలా ఒకేచోట చేరి.. వనభోజనాలతో వైఎస్సార్ జయంతి నిర్వహించటం.. ఆయన ప్రజల గుండెల్లో వున్నాడు అనటానికి చిహ్నం అని తెలియజేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన శివ మేక, లక్ష్మీనారాయణ రెడ్డి గోపిరెడ్డి, నాగి రెడ్డి , రామమోహన్ రెడ్డి, భానోజీ రెడ్డి, విజయ్ గోలి, రమేష్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి , తదితరులకు పలువురు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి కార్యకర్తకు డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ .. పేరు పేరున కృతజ్ఞతలు తెలిపింది. -
డల్లాస్‌లో ఘనంగా మహానేత వైఎస్సార్ 75వ జయంతి వేడుకలు
దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్. రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు అమెరికాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూఎస్ఏ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. డల్లాస్ లోని బసేరా ఇండియన్ క్యూసిన్లో జరిగిన వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలకు ఎన్ఆర్ఐలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. కొవ్వొత్తులు వెలిగించి, వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన ఆంద్రప్రదేశ్ ప్రజలకు స్వర్ణయుగంలాంటిదని వారు అభిప్రాయపడ్డారు. తెలుగు ప్రజలకు వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సేవలు, పేదల పట్ల ఆయన కనబరిచిన ప్రత్యేక శ్రద్ధను ప్రస్తావించారు. తండ్రికి తగ్గ తనయుడిగా వైఎస్ జగన్ అనేక సంక్షేమ పథకాలను చేపట్టారని ఈ సందర్భంగా కొనియాడారు. -
ప్రజల పక్షాన పోరాటానికి ఎప్పుడూ సిద్ధమే: సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: ప్రజల పక్షాన పోరాటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టంచేశారు. సమకాలీన చరిత్రను మనం ప్రత్యక్షంగా చూశామని, ఆ సంక్షోభం, ప్రజల కష్టాల్లో నుంచి పుట్టిందే వైఎస్సార్సీపీ అని గుర్తుచేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సోమవారం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. వైఎస్సార్ రక్తం పంచుకున్న బిడ్డగానే కాకుండా ఆయన ఆశయాలకు వారసుడిగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాటాల మధ్యనే ఈ పార్టీని ప్రారంభించారని గుర్తుచేశారు. ఆ రోజు నుంచి కోట్ల మందికి జగన్ ఆశాదీపం అయ్యారన్నారు. వైఎస్సార్‌కి మించి అడుగులు ముందుకు వేసే బిడ్డగా జగన్ ఈ రాష్ట్రానికి 30 ఏళ్లలో జరగాల్సిన అభివృద్ధిని తన ఐదేళ్ల పాలనా కాలంలో అందరూ గర్వపడేలా చేసి చూపించారన్నారు. వైఎస్సార్ ఆశయ సాధన కోసం జగన్ ఎంతో కృషిచేస్తున్నారన్నారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే...విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు..రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేశాం. ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. అసాధ్యమైన హామీలతో ప్రత్యర్థులు అందలమెక్కారు. హామీలిచ్చి మోసం చేయటం, ప్రజలను భ్రమల్లో ఉంచటం వైఎస్ జగన్‌కి చేతకాదు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలతో పనిలేకుండా ఆయన పాలించారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఇళ్ల ముంగిటకే ఆయన పరిపాలన అందించారు. ప్రజల్లో మమేకమైన పార్టీగా మన ప్రయాణం అనంతం. అది ఆగిపోదు. ఎన్నికల ఫలితాలపై అనుమానాలున్నా లోతుకుపోవటం సరైంది కాదు. మరోసారి మోసానికి బాబు శ్రీకారం..ఇక అధికారంలోకి వచ్చి నెల దాటిందో లేదో ఇచ్చిన హామీలు ఇప్పట్లో నెరవేర్చటం కష్టమని అప్పుడే చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా ప్రజల్ని మోసం చేసి ఎన్నికల్లో గెలిచేందుకు ఆయన అలవిగాని హామీలిచ్చారు. ఆసాధ్యమైన హామీలిచ్చి 2014లో ప్రజలను ఎలా మోసం చేశారో ఇప్పుడు ఆదే రీతిలో మరోసారి మోసానికి బాబు శ్రీకారం చుట్టారు. ఖజానా ఇంత ఖాళీ అయి ఉంటుంది అనుకోలేదని అప్పుడే చంద్రబాబు అంటున్నారు. ఖజానా బాగాలేదు కాబట్టి హామీలు నెరవేర్చటం కష్టమని ఆయన చెప్పకనే చెబుతున్నారు. ఇది అత్యంత మోసం, దగా.రాష్ట్రం రావణకాష్టం..అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి రాష్ట్రంలో ఎలా ఆరాచకం సృష్టిస్తున్నారో చూస్తున్నాం. రాష్ట్రాన్ని ఎలా రావణకాష్టం చేస్తున్నారో, ఎలా దాడులు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. సామాన్యులు తిరగలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఐదేళ్లలో రూపుదిద్దుకున్న ఆరోగ్య, విద్యా వ్యవస్థలకు గండికొట్టడం ప్రారంభమైంది. వైద్యంలో స్పెషలిస్టు సేవలను నిర్వీర్యం చేస్తున్నారు. రాష్ట్రాన్ని మళ్లీ పదేళ్లు వెనక్కి తీసుకెళ్లేలా చంద్రబాబు చేస్తున్నారు. మన లోటుపాట్లు సరిదిద్దుకుని ముందుకెళ్దాం. మళ్లీ రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకొద్దాం. బాబు తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లకుండా, ప్రజల దృష్టి మళ్లించేందుకు జగన్‌పైన, వైఎస్సార్సీపీపైన కూటమి నేతలు దాడిచేస్తున్నారు.తాను అమలుచేయాల్సిన హామీల నుంచి తప్పించుకోవాలని బాబు చూస్తున్నారు. అది జరగకుండా.. మనం ఎక్కడా డీలాపడకుండా కలిసికట్టుగా అడుగులు వేయాలి. ప్రజల పక్షాన నిలబడే పార్టీగా మనమంతా పునరంకితం అవుదామని శపథం చేద్దాం. ఇందుకు ఇంతకంటే మంచి రోజు, వైఎస్సార్ జయంతిని మించిన రోజులేదు. అనంతరం.. మాజీమంత్రి అంబటి రాంబాబు కూడా మాట్లాడారు.ఈ కార్యక్రమంలో.. మాజీమంత్రి జోగి రమేష్, నాయకులు పుత్తా ప్రతాప్‌రెడ్డి, అంబటి మురళీ, మలసాని మనోహర్‌రెడ్డి, చిల్లపల్లి మోహనరావు, బత్తుల బ్రహ్మానందరెడ్డి, చల్లా మధు, కొమ్మూరి కనకారావు, ఎ.నారాయణమూర్తి, బందెల కిరణ్‌రాజ్, న్యాయవాది కొమ్మసాని శ్రీనివాస్‌రెడ్డి, మహిళా నేతలు నారమల్లి పద్మ, రజనీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘అపర భగీరథుడు వైఎస్సార్’ పుస్తకాన్ని సజ్జల ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయంలో సేవా కార్యక్రమాలు..ఇదిలా ఉంటే.. వైఎస్ జయంతి సందర్భంగా పుత్తా ప్రతాప్‌రెడ్డి ఏర్పాటుచేసిన భారీ కేక్‌ను సజ్జల రామకృష్ణారెడ్డి కట్ చేశారు. పేదలకు వస్త్ర, అన్నదానం నిర్వహించారు. వికలాంగులకు, వృద్ధులకు చేతి కర్రలను పంపిణీ చేశారు. తొలుత.. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి అందరూ ఘనంగా నివాళులర్పించారు. -
సంక్షేమాభివృద్ధి సారథి వైఎస్సార్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమానంగా ముందుకు తీసుకెళ్తూ పరిపాలనలో సమానత్వాన్ని చాటుకుంటూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని పాలకుడంటే ఎలా ఉండాలో చాటిచెప్పిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని ప్రజలు, అభిమానులు, వైఎస్సార్సీపీ శ్రేణులు కొనియాడారు. దివంగత వైఎస్ 75వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఘనంగా నివాళులర్పించారు. ‘జోహార్ వైఎస్సార్.. వైఎస్సార్ అమర్ రహే’ అంటూ వాడవాడలా నినదించారు.ఈ సందర్భంగా మహానేత అందించిన పథకాలను ప్రజలు గుర్తుచేసుకున్నారు. గ్రామ గ్రామాన, వాడవాడలా కేక్‌లు కట్‌చేసి, పేదలకు వస్త్ర, అన్నదానం చేసి మహానేతపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. రాష్ట్రంలో 26 జిల్లాలు, 175 నియోజకవర్గాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పండుగలా నిర్వహించారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాల్లో మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తదితరులు కేక్ కట్‌చేసి వైఎస్సార్ చిత్రపటానికి నివాళులర్పించారు.ఇడుపులపాయలో..ఇక ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్ తన తండ్రికి ఘన నివాళులర్పించారు. ఆయనతోపాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మహానేతకు నివాళులర్పించారు. అలాగే, పామర్రు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కైలే అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహాలకు భారీ పూలమాలలు వేసి నివాళులర్పించారు.విదేశాల్లోనూ ఘనంగా..వివిధ దేశాల్లోనూ ప్రవాసాంధ్రులు వైఎస్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, యూకే, జర్మనీ, దక్షిణాఫ్రికా, సింగపూర్, మలేసియా, ఒమన్, యూఏఈ, సౌదీ అరేబియా తదితర దేశాల్లో ప్రవాసాంధ్రులు, భారతీయులు వైఎస్సార్ సేవలను గుర్తుచేసుకున్నారు. మెల్బోర్న్లో వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో కేక్‌ను కట్ చేశారు. తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్సార్: డాక్టర్ ప్రదీప్ చింతా తెలుగుజాతి ఉన్నంత వరకు తెలుగు ప్రజల హృదయాల్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పదిలంగా ఉంటారని వైఎస్సార్సీపీ యూకే కన్వీనర్ డాక్టర్ ప్రదీప్ చింతా తెలిపారు. పేదల దేవుడు వైఎస్సార్ అని, మనసున్న మారాజు వైఎస్సార్‌కు నీరాజనం పలుకుతున్నామన్నారు. ఇక యూకే టీం ఆధ్వర్యంలో నంద్యాలలోని పరివర్తన్ లైఫ్ సెంటర్లోనూ వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిల్లలకు మందులు, దుస్తులు, ఫ్రిజ్, మంచాలు, బెడ్స్ పంపిణీ చేసి అన్నదానం చేశారు. అలాగే, ఆయన కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో వైఎస్సార్ జిల్లా ముద్దనూరులోని సాంఘిక సంక్షేమ హాస్టల్లో కేక్ కట్‌చేసి దుప్పట్లు పంపిణీ చేశారు. -
సిడ్నీలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు
-
మహేష్, రాజమౌళి మూవీ అప్డేట్ అప్పుడేనా ?
-
"మిస్ యూ నాన్న.."
-
కడపలో శ్రీకృష్ణ దేవరాయలు 533వ జయంతి కార్యక్రమం
-
సుమన్‌కి నటకేసరి
శతాధిక చిత్ర దర్శకులు దివంగత కోడి రామకృష్ణ జయంతి వేడుకలు వాసవి ఫిల్మ్ అవార్డ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని సామాజిక సేవాతత్పరులు, ప్రతిభావంతులకు ఈ పురస్కారాలు అందించారు. నటుడు సుమన్‌కి ‘నట కేసరి’ బిరుదు ప్రదానం చేశారు. ‘‘కోడి రామకృష్ణగారి పేరు చిరస్థాయిగా నిలిచేలా చేయడమే ఈ పురస్కారాల ముఖ్యోద్దేశం’’ అన్నారు నిర్వాహకులు టి. రామ సత్యనారాయణ, వీబీజీ రాజు, కొత్త వెంకటేశ్వరరావు. దర్శకులు కార్తీక్ వర్మ దండు, రామ్ అబ్బరాజు, వెంకట్ పెదిరెడ్ల, రచయిత భాను తదితరులు పురస్కారాలు అందుకున్నారు. కోడి రామకృష్ణ కుమార్తె, నిర్మాత కోడి దివ్య పాల్గొన్నారు. -
నార్త్ వెస్ట్ అమెరికాలో మహానేత డా.వైఎస్సార్ 74వ జయంతి వేడుకలు
-
సింగపూర్ లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
-
లండన్‌లో ఘనంగా వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు
-
తెలంగాణ ఠీవీ.. మన పీవీ: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: నేడు(బుధవారం) మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 102వ జయంతి. ఇక, పీవీ జయంతి వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ క్రమంలో దేశానికి పీవీ అందించిన సేవలను కేసీఆర్ సర్మించుకున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు. నాడు పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలే నేడు దేశ ప్రజల అనుభవంలోకి వచ్చాయని చెప్పారు. పలు సంస్కరణలతో భారతదేశ ఔన్నత్యాన్ని పీవీ కాపాడారు. పీవీ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని వెల్లడించారు. తెలంగాణ ఠీవీ.. మన పీవీ అని చెప్పారు. పీవీ స్ఫూర్తితో దేశాభివృద్ధి దిశగా ముందుకు సాగుతామని వెల్లడించారు. మరోవైపు.. పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణిదేవి కూడా జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వాణిదేవి మాట్లాడుతూ.. పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల అభివృద్ధి ఫలాలు మనం అనుభవిస్తున్నాం. పీవీ జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నది అని తెలిపారు. ఇది కూడా చదవండి: తెలంగాణ బీజేపీ.. మరీ ఇంత గందరగోళమా? -
అల్లూరి జయంతి వేడుకలకు రాష్ట్రపతి ముర్ము
సాక్షి, హైదరాబాద్: జూలై 4న హైదరాబాద్‌లో జరిగే అల్లూరి సీతారామరాజు 125 జయంతి ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హాజరుకానున్నారు. ఈ మేరకు క్షత్రియ సేవా సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పేరిచర్ల నాగరాజు, నడింపల్లి నాని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇది కూడా చదవండి: నయా ‘అసెంబ్లీ’పై నజర్ -
వాళ్లే ఎన్టీఆర్‌కు నిజమైన వారసులు: లక్ష్మీపార్వతి
సాక్షి, విజయవాడ: నగరంలోని ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు నందమూరి లక్ష్మీపార్వతి, డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ, కొడాలి నాని, పేర్నినాని హాజరయ్యారు. ఈ సందర్బంగా లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. విజయవాడ నడిబొడ్డున ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరగడం చాలా ఆనందంగా ఉంది. ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయంపై పోరాడి పోరాడి అలసిపోయాను. నా ఆవేదనను ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ఎన్టీఆర్ వారసులమంటూ ఎవరెవరో డబ్బాలు కొట్టుకుంటున్నారు. కుడుపున పుడితే వారసులు కాదు. ఎన్టీఆర్‌కు చివరి వరకూ అండగా నిలబడిన వారే నిజమైన వారసులు. ఎన్టీఆర్‌కు చివరి క్షణాల్లో అండగా ఉంది దేవినేని నెహ్రూ మాత్రమే. దేవినేని నెహ్రూ మాత్రమే ఎన్టీఆర్‌కు అసలైన వారసుడు. మాట్లాడటం కూడా రాని లోకేష్ కూడా నేనే వారసుడినంటున్నాడు. ఎన్టీఆర్‌ను మోసం చేసిన ఈ దుర్మార్గులు ఎలా వారసులు అవుతారు. చంద్రబాబు అంత నీచుడు మరొకడు లేడు. చంద్రబాబు వెన్నుపోటుపై ఎన్టీఆర్ ఎంతో బాధపడ్డారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు ఎన్నోసార్లు అవమానించాడు. ఎన్టీఆర్ పేరు కానీ.. ఫొటో కానీ.. పెట్టుకునే అర్హత చంద్రబాబుకు లేదు. ఎన్టీఆర్ ఆశయాలను సమాధి చేసిన వ్యక్తి చంద్రబాబు. ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. నా వ్యక్తిత్వాన్ని నిలబెట్టిన సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాను. క్లిష్టసమయంలో డైరెక్టర్ రాం గోపాల్‌వర్మ నాకు ధైర్యానిచ్చారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో నా పాత్ర గురించి అందరికీ చెప్పారు. నా క్యారెక్టర్‌ను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినపుడు నాకు పోసాని కృష్ణమురళీ ఓ సోదరుడిగా అండగా నిలిచారు అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: చంద్రబాబు లాంటి నీచుడు ఎక్కడా ఉండడు: లక్ష్మీపార్వతి -
టీడీపీ, ఎల్లో మీడియాకు నిద్రపట్టడం లేదు: దేవినేని అవినాష్
సాక్షి, విజయవాడ: దివంగత ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు విజయవాడలో నిర్వహిస్తాం. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి పాల్గొంటారని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. కాగా, దేవినేని అవినాష్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు రేపు ఘనంగా నిర్వహిస్తున్నాం. మేమూ ఎన్టీఆర్ అభిమానులమే. ఎన్టీఆర్‌కు బ్యానర్లు కట్టే హక్కు మాకుంది. ఎన్టీఆర్ సర్కిల్ టీడీపీకి ఎవరూ రాసివ్వలేదు. టీడీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ పేరు కూడా ప్రస్తావన రాకుండా చేసేవారు. ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టిన మనసున్న నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఎన్టీఆర్ పేరును చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయేలా చేశారు సీఎం జగన్. కనీవినీ ఎరుగని రీతిలో నిన్న అమరావతిలో జరిగిన ఇళ్ల పట్టాల పండుగకు లబ్ధిదారులు తరలివచ్చారు. చంద్రబాబు సభలకు జనం రావాలంటే డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వాలి. కానీ, సీఎం జగన్ మీటింగ్‌కు సంతోషంతో లబ్ధిదారులు తరలివచ్చారు. టీడీపీ నేతలు మూడేళ్లు పేదలకు ఇళ్లు రాకుండా వ్యవస్థల ద్వారా అడ్డుకున్నారు. అమరావతిలో తన పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ వ్యక్తులు మాత్రమే ఉండాలని చంద్రబాబు అనుకున్నాడు. దమ్మున్న నాయకుడిగా సీఎం జగన్ పేదల తరపున పోరాడారు. ఇళ్ల పట్టాల పండుగను చూసి టీడీపీ నేతలకు, ఎల్లో మీడియాకు నిద్రపట్టడం లేదు. పేదల సొంతింటి కల నెరవేరుతుంటే చూసిఓర్వలేకపోతున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఇళ్ల పట్టాలను రద్దుచేస్తామంటున్న టీడీపీ నేతలకు సిగ్గుందా?. సెంటు స్థలంపై విమర్శలు చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు తలలెక్కడ పెట్టుకుంటారు. సీఎం జగన్ సభను చూసిన తర్వాత టీడీపీ నేతలకు దిమ్మతిరిగింది. ఇది కూడా చదవండి: వివేకా కేసు: చంద్రబాబు దుర్మార్గం ఏ స్థాయికి చేరిందంటే.. -
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ దూరం
-
తప్పిదాలను సరిచేసుకుంటున్నాం
న్యూఢిల్లీ: ‘‘గుర్తింపుకు నోచుకోని యోధులను, అమర వీరులను భారత్ ఇప్పుడు స్మరించుకుంటోంది. తద్వారా పాత తప్పిదాలను సరి చేసుకుంటోంది. తన ఘన వారసత్వాన్ని పండుగలా జరుపుకుంటోంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వలస పాలనలో రచించిన కుట్రపూరిత చరిత్ర వల్ల మన యోధులకు గుర్తింపు లేకుండా పోయిందన్నారు. 1670ల్లో మొఘల్ సైన్యంపై పోరాడిన అహోం (అస్సాం) సైనికాధికారి లచిత్ బర్ఫూకన్ 400వ జయంతి వేడుకలు శుక్రవారం ఢిల్లీలో జరిగాయి. వాటిలో మోదీ ప్రసంగించారు. ‘‘దేశ చరిత్రంటే కేవలం బానిసత్వం గురించే కాదు. వీర సైనికుల పోరాటాలు, త్యాగాలు కూడా. చరిత్రంటే కొన్ని దశాబ్దాలు, శతాబ్దాల పరిణామాలు మాత్రమే కాదు. నిరంకుశత్వం, దౌర్జన్యాలపై అసమాన ధైర్య సాహసాలతో జరిపిన పోరాటమే మన చరిత్ర’’ అన్నారు. దేశం కంటే ఏ బంధమూ గొప్ప కాదు స్వాతంత్య్రానంతరం కూడా వలసవాద భావజాలం కొనసాగిందని, చరిత్రను కుట్రపూరితంగా లిఖించడం దురదృష్టకరమని మోదీ అన్నారు. ‘‘రక్త సంబంధం కంటే జాతి ప్రయోజనాలే ముఖ్యమని లచిత్ భావించారు. తప్పు చేస్తే దగ్గరి బంధువులనూ శిక్షించారు. కుటుంబాన్ని, కుటుంబ వారసత్వాన్ని పక్కనపెట్టి దేశం కోసం నిస్వార్థంగా పని చేయాలని గొప్ప సందేశమిచ్చారు. దేశ ప్రయోజనాల కంటే ఏ బంధమూ గొప్ప కాదని ఆయన జీవితం బోధిస్తోంది’’ అన్నారు. చిన్నారులతో ప్రచారం మోదీపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ చిన్న పిల్లలను వాడుకుంటున్నారంటూ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్నట్లున్న ఓ చిన్నారి వీడియోను ప్రధానితోపాటు, కేంద్ర మంత్రులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంపై పార్టీ ప్రతినిధి బృందం ఈసీని కలిసింది. ‘‘ఇది పిల్లల హక్కులకు భంగం కలిగించడమే. తీవ్రమైన అంశమైనందున బాధ్యులపై చర్యలు తీసుకోండి’’ అ ని కోరింది. -
అల్లూరి సీతారామరాజు వేషధారణలో చిన్నారులు (ఫొటోలు)
-
బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి
గన్‌ఫౌండ్రీ: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని రాష్ట్రమంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో జైగౌడ్ ఉద్యమ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మహారాజ్ 372వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్ మా ట్లాడుతూ గత ప్రభుత్వాలు కల్లు, నీరాలపై తప్పు డు ప్రచారం చేసి అమ్మకాలను నిషేధించగా, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్ గీతవృత్తికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఈ నెల 22న రూ.5 కోట్ల ఇ గౌడ ఆత్మగౌరవ భవనం నిర్మాణం ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. మంచి రాజుగా గుర్తింపు పొందిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను లండన్‌లోని కేంబ్రిడ్జి వర్సిటీ గుర్తించినా ఇక్కడి పాలకులు ఇంకా గుర్తించకపోవడం బాధాకరమన్నారు. ఏపీ మంత్రి జోగి రమేశ్ మాట్లాడుతూ విద్యతోనే బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి సాధ్యమవుతుందన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ బహుజనుల అభివృద్ధికి చాలా కృషి చేస్తున్నారని తెలిపారు. -
కాలిఫోర్నియా, బే ఏరియాలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
కాలిఫోర్నియా: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డా.వైఎస్‌రాజశేఖరరెడ్డి 74వ జయంతి సందర్భంగా అమెరికాలో కాలిఫోర్నియా, బే ఏరియాలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం జులై 10వ తేదీ ఉదయం,ఆహా ఇండియన్ హోటల్లో జయంతి వేడుకలను నిర్వహించారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటి ఫలాలను ప్రతి పేదవాడికి అందించిన గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి. బడుగు, బలహీన వర్గాల ఆరాధ్య దైవం,. ఎందరికో అసాధ్యమైన అనేక అభ్యుదయ పథకాలను సుసాధ్యం చేసి దేశంలోనే గుర్తింపు తెచ్చుకున్న మహానేత అని వైఎస్సార్సీపీ అమెరికా గవర్నింగ్ కౌన్సిల్ మెంబెర్ కేవీరెడ్డి గుర్తు తెచ్చుకున్నారు. మాట తప్పని..మడమ తిప్పని రాజకీయ నేత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. విద్యార్థుల సంక్షేమం కోసం ఫీజు రీ ఎంబర్సుమెంట్, రైతులకు రుణమాఫీ, పావలా వడ్డీ, పశుక్రాంతి, జలయజ్ఞం, ఉచిత విద్యుత్ వంటి ఎన్నో మహత్తర కార్యక్రమాలు ప్రవేశపెట్టి రాష్ట్రంలోని ప్రజలంతా బాగుండాలి. ప్రజల బాగోగులు చూసుకోవాలి అని నిరంతరం తపించిన వ్యక్తి ఆయన అన్నారు . వైఎస్సార్ స్పూర్తి, ఆశయాలతోవారి కుమారుడు , ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదర్స పరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. వైఎస్సార్సీపీ అమెరికా కమిటీ ముఖ్య సభ్యులు సురేంద్ర అబ్బవరం, కిరణ్ కూచిభట్ల , సహదేవ్ బోడె , తిరుపతిరెడ్డి , వెంకట్ , అంకిరెడ్డి , ఆనంద్ బందార్ల, అశోక్, ప్రశాంతి, అమర్ బడే తదితరులు వైఎస్సార్ సేవలను, సంక్షేమ పాలనను వారితో గల అనుబంధాన్ని గుర్తు తెచ్చుకున్నారు. వారి తనయుడు ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజన్న రాజ్యాన్ని అందిస్తున్నారని ప్రశంసించారు. ఇంకా ఈ కార్యక్రమలో బే ఏరియా వైస్సార్ అభిమానులు హరి, కొండారెడ్డి , త్రోలోక్ , సుబ్బారెడ్డి , రామిరెడ్డి , నరేంద్ర కొత్తకోట, వినయ్, ఇతర వైఎస్సార్సీపీ స్టూడెంట్ విభాగం నాయకులూ పాల్గొన్నారు. -
వైఎస్సార్ జయంతి.. ఆహార పదార్థాల వితరణ
న్యూజెర్సీ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ప్రవాస భారతీయులు 800 డాలర్ల విలువైన ఆహార పదార్థాలను డెలావేర్ ఫుడ్ బ్యాంక్‌కి డోనేట్ చేశారు. నాటా బోర్డ్ డైరెక్టర్, వైఎస్సార్సీపీ కమిటీ సభ్యులు సంగంరెడ్డి అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ ఫౌండేషన్ సభ్యులు చంద్ర దొంతరాజు, అమరవాది శ్రీనివాస్, జనార్దన్, శ్రీనివాసరెడ్డి కేసవరపు, రమణ కొట్ట, నిరంజన్, హరి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
పీవీపై కేసీఆర్ సంచలన నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముద్దుబిడ్డ, దేశ మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించారు. అలాగే నెక్లెస్‌రోడ్డుకు పీవీ జ్ఞాన్ మార్గ్‌గా పేరు పెట్టాలని, హైదరాబాద్‌లో పీవీ మెమోరియల్ ఏర్పాటుకు కేసీఆర్ సంకల్పించారు. ఈ మేరకు ప్రగతిభవన్‌లో పీవీ శతజయంతి వేడుకల నిర్వహణపై శుక్రవారం సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు. హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీకి పీవీ నరసింహారావు పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరుతూ.. అసెంబ్లీలో తీర్మానం చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పీవీ సాహసోపేతమైన భూ సంస్కరణలు అమలు చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. (సంస్కరణల ఆద్యుడు పీవీ) ఆయన సంస్కరణల ఫలితంగానే తెలంగాణలో 93 శాతం మంది చిన్న, సన్నకారు రైతులకు భూమి వచ్చిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగు పర్చడంతో పాటు..అనేక రంగాల్లో సంస్కరణలు తెచ్చిన పీవీ ఆదర్శప్రాయుడని కేసీఆర్ కొనియాడారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పీవీకి మరింత గౌరవం తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లక్నేపల్లి, వంగర గ్రామాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సీఎం నిర్ణయించారు. పీవీ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. దేశ,విదేశాల్లో కూడా పీవీ శత జయంతి వేడుకలు నిర్వహించాలన్నారు. పార్లమెంట్లో మాజీ ప్రధాని విగ్రహం ప్రతిష్టించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. (ధీశాలి.. సంస్కరణశీలి) -
ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరం: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సూదిని జైపాల్ రెడ్డి 78వ జయంతి వేడుకలు గురువారం నిర్వహించారు. నెక్లెస్ రోడ్డులోని జైపాల్ రెడ్డి మెమోరియల్ వద్ద కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జైపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులు, వీ హెచ్ హనుమంతులు, రేవంత్ రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మల్లు రవి,తదితరులు హాజరయ్యారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. నేటి రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచిన జైపాల్‌రెడ్డి తమ మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ప్రభుత్వం జైపాల్ రెడ్డి పేరును పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే నెక్లెస్ రోడ్లో మెమోరియల్ హాల్‌ను నిర్మించాలన్నారు. అదేవిధంగా సీపీఐ అధ్యక్షుడు చాడ వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ నేత జైపాల్‌రెడ్డికి నివాళులు అర్పించారు. కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉండాలని కోరుకునే వ్యక్తి జైపాల్‌రెడ్డి అని, హైదరాబాద్‌కు మెట్రో వచ్చిందంటే అది జైపాల్ చొరవేనని ఆయన పేర్కొన్నారు. -
గాంధీజీ ప్రమాదంలో చనిపోయారట!
భువనేశ్వర్: జాతిపిత మహాత్మా గాంధీ ప్రమాదం కారణంగా చనిపోయారంటూ ఒడిశా విద్యా శాఖ ప్రచురించిన బుక్లెట్ తీవ్ర వివాదాస్పమైంది. దీనిపై రాజకీయ నేతలు, ఉద్యమకారుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ క్షమాపణ చెప్పాలని, తప్పును వెంటనే సరిచేయాలని డిమాండ్ చేశారు. గాంధీజీ హత్యను ప్రమాదంగా ప్రచురించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. దీంతో ఈ వ్యవహారంపై ఒడిశా ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. గాంధీజీ 150వ జయంత్యుత్సవాల నేపథ్యంలో ఆమా బాపూజీ: ఏక్ ఝలకా (మన బాపూజీ: ఒక సంగ్రహ అవలోకనం) పేరిట ప్రచురించిన ఈ రెండు పేజీల బుక్‌లెట్‌లో గాంధీకి సంబంధించిన విషయాలు వివరించారు. ఈ క్రమంలో 1948 జనవరి 30న ఢిల్లీలోని బిర్లా హౌస్‌లో గాంధీ ప్రమాదం కారణంగా చనిపోయినట్లు పేర్కొన్నారు. విద్యా శాఖ మంత్రి సమీర్ రంజన్ దాస్ మాట్లాడుతూ ఈ వివాదంపై విచారణకు ఆదేశించామని, ఆ బుక్లెట్లను ఉపసంహరించుకున్నామని తెలిపారు. -
బోయ రత్నాకరుడే.. మహర్షి వాల్మీకి
త్రేతాయుగంలో గంగా తీరంలోని నైమిషారణ్యంలో అనేక మంది మునులు ఆశ్రమాలు నిర్మించుకుని నిష్టతో తపస్సు చేస్తుండేవాళ్లు. వీరిలో ప్రచస్థాముడు అనే ముని కుమారుడు రత్నాకరుడు. ఒకరోజు అడవిలో ఆడుకుంటూ దారితప్పి ఎటుపోవాలో తెలియక భయంతో ఏడుస్తున్న రత్నాకరుడిని అటుగా వెళ్తున్న ప్రయాణిస్తున్న ఓ వేటగాడు గమనించాడు. ఆ ముని కుమారుడిని ఓదార్చి తనతో పాటు తీసుకెళ్లిన బోయవాడు తన కుమారునిగా పెంచుకుంటాడు. తన కుమారుడు అడవిలో ఏ క్రూర మృగాల బారినో పడి మరణించి ఉంటాడని ప్రచస్థాముడు భావిస్తాడు. బోయవారి ఇంట పెరిగిన రత్నాకరుడు విలువిద్యలో ప్రావీణ్యం సంపాదిస్తాడు. యుక్త వయస్సుకు వచ్చిన రత్నాకరుడికి ఓ యువతితో వివాహమవుతుంది. వీరికి ముగ్గురు సంతానం. వీరితోపాటు తల్లిదండ్రులను పోషించడానికి సంపాదన చాలక దారి దోపిడీలు, దొంగతనాలను వృత్తిగా చేసుకుని కొన్ని సందర్భాల్లో బాటసారులను చంపడానికి వెనుకాడని పరిస్థితికి చేరుకుంటాడు రత్నాకరుడు. అడవిలో బాటసారుల కోసం ఎదురుచూస్తున్న సమయంలో నారద మహర్షి ఓ సాధారణ మనిషి రూపంలో ఆ దారి వెంట వస్తాడు. ఆయనను దోచుకోడానికి రత్నాకరుడు ప్రయత్నంచగా.. తన వద్ద వీణ, రుద్రాక్షలు, కాషాయ వస్త్రాలు తప్ప ఏమీ లేవన్నా వినిపించుకోకుండా చంపుతానంటూ భయపెడుతాడు. నీవు ఇన్ని పాపకార్యాలు ఎవరికోసం చేస్తున్నావని నారదుడు ప్రశ్నించగా తన కుటుంబం కోసమని రత్నాకరుడు బదులిస్తాడు. పోషణ కోసం తెలిసిన విద్య ఇది ఒక్కటే. పాప పుణ్యాలు నాకు తెలియవని అంటాడు. రత్నాకరుడికి జ్ఞానోదయం కలిగించేందుకు నారదుడు ఓ ఉపాయం పన్నుతాడు. ఓ బోయవాడా.. నీవు చేసే ఈ పాపాల్లో నీ కుటుంబ సభ్యులు ఎవరైనా భాగం పంచుకుంటారేమో అడిగి తెలుసుకోమని తనతో పాటు ఇంటికి వెళ్తాడు. తన పాపాల్లో మీరూ కూడా భాగస్వాములే కదా అని తల్లిదండ్రులు, భార్యా బిడ్డలను ప్రశ్నించగా, అందుకు వారు సమ్మతించరు. పైగా కుటుంబ పోషణ ఇంటి యజమాని బాధ్యత.. పాప, పుణ్యాలు ఒకరి నుంచి ఇంకొరికి ఇవ్వలేం, తీసుకోలేమని బదులిస్తారు. వారి మాటలతో పశ్చాత్తాపం చెందిన రత్నాకరుడు పాపవిముక్తి కలిగించాలని నారదుని వేడుకుంటాడు. అప్పుడు నారదుడు తన నిజస్వరూపాన్ని చూపి భక్తి మార్గానికి ‘రామ.. రామ‘ అనే రెండక్షరాల మంత్రాన్ని ఉపదేశిస్తాడు. అప్పటి నుంచి నైమిషారణ్యంలో రామ మంత్రాన్ని జపిస్తూ కొన్నేళ్లు తపస్సు చేస్తాడు. తపస్సులో కూర్చున్న రత్నాకరుడి చుట్టూ పుట్టలు వెలుస్తాయి. అలా కొనేళ్లు గడిచిన తర్వాత పుట్టలో బక్క చిక్కి బయట ప్రపంచంతో సంబంధం లేని రత్నాకరుని చెవిలో రామ.. రామ.. రామ.. అని నారదుడు మూడుసార్లు పలుకుతాడు. ఆ తారక మంత్రాన్ని విన్నంతనే రత్నాకరుడు తపస్సు నుంచి బయటకు వస్తాడు. ‘‘రత్నాకరా.. నీవు గొప్ప తపశ్సాలివి అయ్యావు. దేవుడు నిన్ను కరుణిచాడు. నీవు మళ్లీ జన్మించావు. ఈ పుట్ట నుంచి పుట్టావు కాబట్టి నీవు వాల్మీకి నామంతో లోక కల్యాణం కోసం ఓ గొప్ప కావ్యాన్ని రాస్తావు’’ అని దీవించి నారదుడు అదృశ్యమవుతాడు. ఆ తర్వాత వాల్మీకి మహర్షి సంస్కృతంలో రామాయణ సంకలనం చేస్తాడు. సంస్కృతంలో రాసిన మొదటి కావ్యం కావడంతో రామయాణాన్ని ఆదికావ్యం అంటారు. ఇకపోతే వాల్మీకి మొదటి శిష్యులు రాముడి కుమారులైన లవకుశలు. నేడు రాష్ట్రస్థాయి వాల్మీకి జయంతి వేడుకలు అనంతపురం: మహర్షి వాల్మీకి జయంతి రాష్ట్రస్థాయి వేడుకలు ఆదివారం అనంతపురంలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.ఇందుకోసం రూ.19లక్ష లు కేటాయించగా..ఇతరజిల్లాలకు రూ.55 వేలు చొప్పున మంజూరు చేశారు. మం త్రులు శంకరనారాయణ, గుమ్మనూరు జయరాం, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, రెడ్డెప్ప, డాక్టర్ సంజీవకుమార్, పి.బ్రహ్మానందరెడ్డితో పాటు పలు వురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల ఎగ్జిబిషన్ మైదానంలో ఉదయం 10 గంటలకు వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం బీసీ ఫెడరేషన్, కార్పొరేషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో వాల్మీకులు ఎక్కువగా ఉన్న జిల్లాను గుర్తిం చి రాష్ట్రస్థాయి వేడుకలు నిర్వహించడం పట్ల ఆ వర్గీయులు గర్వపడుతున్నారు. రామాయణంతోనే కుటుంబ వ్యవస్థ పటిష్టం భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉందంటే అది రామాయణంతోనే. పితృవాక్య పరిపాలన. ఒకే భార్య, ఒక బాణం, ఒకే మాట అనేది రామాయణం నుంచి వచ్చిం దే. అలాంటి ఆది కావ్యాన్ని రచించిన మహర్షి వాల్మీకి జయంతి రాష్ట్రస్థాయి వేడుకలకు అనంతపురం వేదిక కావడం సంతోషదాయకం. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు. బీసీల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలుస్తారు. – తలారి రంగయ్య, అనంతపురం ఎంపీ -
సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష
తెలుగు సినిమా రంగంలో రచనలో అగ్రగణ్యుడు సముద్రాల రాఘవాచారి. 1930లలో రచయితగా కెరీర్ ఆరంభించి 30 ఏళ్ల పాటు మాటలు, పాటల రచయితగా, ‘బబ్రువాహన, వినాయక చవితి’ వంటి చిత్రాలతో దర్శకునిగా, ‘దేవదాసు, శాంతి’ వంటి చిత్రాలతో నిర్మాతగా తెలుగు సినిమా రంగంలో సీనియర్ సముద్రాలది ఓ చరిత్ర. జూలై 18న ఆయన 117వ జయంతి వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ‘‘మా నాన్న ఎన్టీఆర్ సముద్రాలగారిని మాష్టారు అని పిలిచేవారు’’ అన్నారు నందమూరి మోహనకృష్ణ. రచయిత బుర్రా సాయిమాధవ్ మాట్లాడుతూ– ‘‘నేటి సినీ రచయితల వైభోగమంతా అప్పుడు వారు పెట్టిన భిక్ష. కె.వి రెడ్డి దర్శకత్వంలో నాగయ్యగారు నటించిన ‘యోగివేమన’ చిత్రంలోని మాటలు తూకం వేసినట్టుగా ఉంటాయి. అందులో ఆయన రచన ఈ రోజుకి రచయితలకు పెద్ద బాలశిక్ష. కొన్ని సందర్భాల్లో నా కలం ముందుకు సాగనప్పుడు ఆ సినిమా ఓ సారి చూస్తా’’ అన్నారు. ఈ జయంతి వేడుకలను నిర్వహించిన రైల్వే ఉన్నతాధికారి రవి పాడి మాట్లాడుతూ– ‘‘సముద్రాల గారు రాసిన పాటల్లోని ‘సీతారాముల కళ్యాణం చూతము రారండి...’, ‘దేవదేవ ధవళాచల మందిర...’, ‘జనని శివకామిని..’ పాటలు తెలుగు శ్రోతలకు, తెలుగువారి సాంస్కృతిక జీవితంలో భాగమయ్యాయి. ఇక నుంచి ప్రతి ఏటా సముద్రాల వారి జయంతి రోజున ఒక ఉత్తమ సినీ సంభాషణల రచయితకు, ఉత్తమ సినీ గీత రచయితకు నగదు పురస్కారంతో సత్కరించాలనుకుంటున్నాం’’ అన్నారు. సముద్రాల సీనియర్ మనవడు, సముద్రాల జూనియర్ ఆఖరి కుమారుడు విజయ రాఘవాచారితో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
నాడు అర లక్ష..నేడు పది లక్షలు
సాక్షి, విశాఖపట్నం : రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన ఊరు.. నడయాడిన ప్రాంతాలు.. మన్యం పితూరీ నిర్వహించిన గిరిసీమలు.. చివరికి దేశం కోసం ప్రాణాలర్పించిన పుణ్యభూమి.. అన్నీ మన విశాఖ జిల్లాలోనే ఉన్నాయి. పద్మనాభం మండలం పాండ్రంకిలో జన్మించిన అల్లూరి తెల్లదొరల పాలనకు సమాంతరంగా అఖండ భారతంలోనే తొలిసారి 1920లో పంచాయతీ పాలనను గొలుగొండ మండలం పాతూరు(కృష్ణదేవిపేట– కేడీపేట) నుంచే ప్రారంభించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆయన పార్థివ దేహానికి ఏఎల్‌పురంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అక్కడే ఆయన సమాధితో పాటు అనుచరుల సమాధులూ ఉన్నాయి. దేశ స్వాతంత్య్రం కోసం, గిరిజనుల విముక్తి కోసం బ్రిటీష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను ఈనెల 4న నిర్వహించేందుకు రూ.10లక్షలు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చింది. దీన్ని రాష్ట్ర వేడుకగా అల్లూరి జన్మస్థలమైన భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలం పాండ్రంకిలో, పంచాయతీ పాలనకు శ్రీకారం చుట్టిన నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం కృష్ణదేవిపేటల్లో నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇంతటి చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాల అభివృద్ధి మాటేమిటి..? గత టీడీపీ ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో అల్లూరి నడయాడిన ప్రాంతాల అభివృద్ధికి లెక్కలేనన్ని హామీలిచ్చి.. అన్నింటినీ విస్మరించింది. కానీ అల్లూరి నడయాడిన సీమలోనే తొలి అడుగు వేయడం ద్వారా జిల్లాలో చారిత్రక ప్రజాసంకల్పయాత్రకు శ్రీకారం చుట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. నేడు ప్రభుత్వాధినేతగా ఆ మహనీయుడి జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించాలని నిర్ణయించారు. పాలనాపరమైన అనుమతులిచ్చారు.ఇక్కడ ప్రస్తావించాల్సిన విశేషం ఏమిటంటే.. గత ఏడాది టీడీపీ ప్రభుత్వం ఇదే అల్లూరి జయంతికి విడుదల చేసిన సొమ్ము ఎంతో తెలుసా?.. కేవలం రూ.50 వేలు!.. ఇప్పటి ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం ఏకంగా రూ. 10 లక్షలు.. నాడు నివాళులే.. నిధుల్లేవు అల్లూరి సీతారామరాజు జయంతి, వర్ధంతుల సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఫొటోల కోసం, ప్రచారం కోసం ‘ఘనమైన’ నివాళులర్పించడం.. ఆ తర్వాత పట్టించుకోకపోవడం గత ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో తంతుగా నడిచింది. యాధృచ్ఛికమే కావొచ్చు గానీ.. చారిత్రక స్థలాలైన అల్లూరి పుట్టిన ఊరు, సమాధి ఉన్న ప్రాంతాలు గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా చెలామణీ అయిన గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు ప్రాతినిధ్యం వహించిన నియోజకకవర్గాల్లోనే ఉన్నాయి. అల్లూరి జన్మస్థలమైన పాండ్రంకి మంత్రిగా గంటా ప్రాతినిధ్యం వహించిన భీమిలిలో ఉంటే.. అల్లూరి నడయాడిన ప్రాంతాలు, పంచాయతీ పాలనకు శ్రీకారం చుట్టిన పాతూరు(కేడీపేట), ప్రాణాలొదిలిన ప్రాంతం, సమాధులు.. అన్నీ నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండలో ఉన్నాయి. వీటన్నింటినీ అభివృద్ధి చేస్తామని ఐదేళ్ల క్రితం అప్పటి టీడీపీ సర్కారు ఎన్నో హామీలిచ్చింది. కృష్ణదేవిపేట (పాతూరు) మొదలు కొంకసింగి, నాగాపురం, ఏఎల్‌పురం గ్రామాల రూపురేఖలు మార్చేస్తామని 2014లో ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడు హామీ ఇచ్చారు. అరకు, చింతపల్లి, లంబసింగితో పాటు టూరిజం ప్యాకేజీలో కేడీ పేటలోని అల్లూరి పార్కును చేర్చి అభివృద్ధి చేస్తామన్నారు. పార్కులో 24 గంటలూ విద్యుత్ సౌకర్యం, సోలార్ వెలుగులు ఏర్పాటు చేస్తామని, మ్యూజియం, గ్రంధాలయం, అల్లూరి 12 అడుగుల కాంస్య విగ్రహం, సమావేశ మందిరం, రూ.5 లక్షలతో సభా వేదిక ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు. ఇక మంత్రి హోదాలో దత్తత తీసుకున్న ఏఎల్‌పురం(అల్లూరి సమాధులున్న గ్రామం) పరిస్థితీ అంతే. ఇక్కడ అండర్ డ్రైనేజీ, ఎల్ఈడీ బల్బులు, ప్రతి ఇంటికి తాగునీరు, మరుగుదొడ్లు, సీసీ రోడ్లు, విద్య, వైద్యం, పశువైద్య కేంద్రం, ఆయుర్వేద ఆస్పత్రికి కొత్తభవనం ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు. కానీ ఏ ఒక్క హామీ నెరవేరలేదు. అంతెందుకు.. కనీసం అల్లూరి జయంతి కార్యక్రమానికి కూడా సరిగ్గా నిధులు విడుదల చేయని గత ప్రభుత్వ నిర్వాకంతో అధికారులు అల్లాడిపోయేవారు. గత ఏడాది కేవలం రూ.50వేలు విడుదల చేసి ఆర్భాటాలో హడావుడి చేయాలని అప్పటి పాలకులు ఆదేశించడంతో.. నానా పాట్లు పడి రెండులక్షలు ఖర్చు చేశామని ఓ అధికారి చెప్పుకొచ్చారు. రాష్ట్ర వేడుకగా అల్లూరి జయంతి :మంత్రి అవంతి తెలుగువాడి పౌరుషానికి ప్రతీక అయిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహిస్తాం. మహనీయుడి పోరాట స్ఫూర్తిని నలుదిశలా చాటేలా ఘనంగా నిర్వహిస్తాం. అల్లూరి నడయాడిన చారిత్రక ప్రాంతాలను పర్యాటక స్థలాలుగా తీర్చిదిద్దుతాం. ఇందుకోసం ఎంతైనా ఖర్చుకైనా వెనుకాడం. ఇందుకోసం పర్యాటక శాఖామంత్రిగా మరింత చొరవ తీసుకుంటాను. ఇక అల్లూరి జయంతి రోజైన ఈనెల 4వ తేదీ గురువారం పాండ్రంకిలో అల్లూరి ఉత్సవ ర్యాలీలు, గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలిచ్చాం. ఆ ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నా: ఎమ్మెల్యే గణేష్ నర్సీపట్నం: జిల్లాలో అల్లూరి సీతారామరాజు నడయాడిన ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను. టీడీపీ పాలకుల మాదిరిగా మాటలతో సరిపెట్టను. అల్లూరి జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేందుకు పది లక్షలు విడుదల చేయడంతోనే ఆ మహనీయుడికి తమ ప్రభుత్వం ఎంత గౌరవం ఇస్తుందో అర్ధం చేసుకోవచ్చు. కృష్ణదేవిపేటలో అల్లూరి స్మారక మందిరాన్ని మరింత అభివృద్ధి చేస్తా. దాంతో పాటు పార్కును అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా. పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సహకారంతో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా. ఈ నెల 4న అల్లూరి జయంతిని ఘనంగా నిర్వహించాలని ఆర్డీవో ఆర్.గోవిందరావుకు సూచిం చాం. అల్లూరి అనుచరుడు గంటందొర కుటుంబ సభ్యులను సత్కరించాలని, జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించాం. -
డబ్బంతా పోయినా నాన్నగారు భయపడలేదు
‘‘మా నాన్నగారి (ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు) గురించి ఆలోచించిన ప్రతిసారీ నా కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఆయన లేరనే ఆలోచనే చాలా కష్టంగా ఉంటుంది’’ అన్నారు నిర్మాత డి. సురేశ్‌బాబు. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎన్నో హిట్ సినిమాలు తీసి తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు డి. రామానాయుడు. ఇవాళ ఆయన జయంతి. అలాగే సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మాణరంగంలో 55ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ రెండు సందర్భాలను పురస్కరించుకుని రామానాయుడు తనయుడు, నిర్మాత డి. సురేశ్‌బాబు చెప్పిన సంగతులు. ► మా సురేశ్ ప్రొడక్షన్స్‌లో తొలి సినిమా (‘రాముడు–భీముడు’) విడుదలై 55ఏళ్లు పూర్తయ్యాయి. 56 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి (రామానాయుడు) మద్రాసు వెళ్లి అనుకున్న బిజినెస్ కుదరక, అక్కడే సినిమాలు తీస్తున్న కంపెనీలో భాగస్వామ్యం తీసుకుని, సైలెంట్ పార్ట్నర్గా ఉండి సినిమాలు తీశారు. అక్కడ పెట్టిన డబ్బంతా పోయింది. భయపడకుండా సినిమాలు చేయడం కంటిన్యూ చేశారు. ఈ క్రమంలో ఫిల్మ్‌మేకింగ్, ప్రొడక్షన్లో ఉన్న లోటుపాట్లను గమనించి, మెరుగుపరచాలనుకున్నారు. ► సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ బాగా ఎస్టాబ్లిష్ కావడానికి దాదాపు 15 ఏళ్లు పట్టింది. 1964 నుంచి 70 ఒక ఫేజ్. ‘రాముడు భీముడు’ బాగా ఆడింది. ఆ తర్వాత కొన్ని ఫెయిల్యూర్స్. ఇక చావో రేవో అనే టైమ్‌లో 1970లో ‘ప్రేమ్‌నగర్’ తీశారు. 1970–1980లో గుడ్ టైమ్. 81–82 బ్యాడ్ టైమ్. ఆ టైమ్‌లో సినిమాలు కాకుండా వాటికి సంబంధించిన వనరులను డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు నాన్నగారు. 82లో నేను వచ్చాను. స్టూడియో, ఎగ్జిబిషన్, డిస్ట్రిబ్యూషన్ వైపు వచ్చాం. వెంకీ (హీరో వెంకటేశ్), నేను ఉండటం వల్ల సంస్థ ముందుకు వెళ్లింది. నాన్నగారు చనిపోయాక ఈ రోజు మేం హ్యాపీగా ఉన్నది ఒక్క విషయంలోనే.. అదేంటంటే ఆయన ఉన్న రంగంలోనే ఫ్యామిలీలో అందరూ ఆల్మోస్ట్ వర్క్ చేస్తున్నాం. ► సినిమాల్లోకి రావొద్దు. బాగా చదువుకోమని నాన్న అనేవారు. కానీ నేను సినిమా కలెక్షన్స్, సినిమా రిపోర్ట్స్ రాస్తూ సినిమాలకే కనెక్ట్ అయ్యాను. మా నాన్నగారు నాతో ‘నిరంతర శత్రువులు ఉండకూడదు. క్షమించాలి, మరచిపోవాలి. బౌండ్స్క్రిప్ట్తో సినిమా మొదలుపెట్టాలి. కుటుంబానికి టైమ్ కేటాయించాలి. రోజూ నిద్రపోయే ముందు అప్పులు, లాభాలను బేరీజు వేసుకోవాలి’.. అంటూ ఇలా చాలా విషయాలను చెప్పారు. ► మా నాన్న మాటిస్తే ఆ మాట మీద ఉండేవారు. ఆ బలహీనతను తీసుకుని కొందరు డైరెక్టర్స్ ఆడని సినిమాలు తీశారు. అయినప్పటికీ ఆయన ఏమీ అనలేదు. మాట ఇవ్వడం మానలేదు. నాన్నగారు చనిపోవడానికి రెండు మూడు రోజుల ముందు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు వచ్చారు. ‘బాలూ.. కథ చూడు. మంచి సినిమా చేద్దాం’ అన్నారు. ఆయనకు తెలిసింది సినిమానే. ► అప్పట్లో మా నాన్నగారు ఫిల్మ్‌మేకింగ్‌లో చూసిన కొన్ని లోపాలు ఇప్పటికీ ఉన్నాయి. అందుకే మా ప్రొడక్షన్ కంపెనీ ఇప్పుడు కంటెంట్, టాలెంట్ మేనేజ్మెంట్, టెక్నాలజీ అంశాలపై కూడా దృష్టి సారించాలని నిర్ణయించుకున్నాం. ఇందుకోసం రానా, నేను కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఎకో సిస్టమ్‌ను డెవలప్ చేస్తున్నాం. ఈ కంటెంట్‌ను కేవలం సినిమాలకే కాదు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల్లోనూ వినియోగిస్తాం. పార్ట్నర్స్ను చూస్తున్నాం. ఎలా అయితే హాలీవుడ్ వారు మార్వెల్, స్టార్వార్స్కి సినిమాటిక్ యూనీవర్స్ క్రియేట్ చేశారో, మన మైథాలజీ తో ‘అమర చిత్ర కథలు’ను అలానే ప్లాన్ చేస్తున్నాం. ► ఫిల్మ్‌మేకింగ్‌లో కొందరు యంగ్‌స్టర్స్ ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌లో కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. మొహమాటంతో నేర్చుకోవడం వదిలేస్తున్నారు. ఇండస్ట్రీని తప్పు పట్టడం లేదు. కొత్త విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నాను. ► ఒకప్పుడు బాలీవుడ్లో ప్రొడక్షన్ పరంగా సరైన విధానాలు ఉండేవి కావు. ఇప్పుడు కార్పొరేట్ విధానాలతో మరింత ముందుకు వెళ్తున్నారు. ‘ఉరి’ లాంటి సినిమాను 45 రోజుల్లో తీశారు. మార్వెల్ అవెంజర్స్ సినిమాను వందరోజుల్లోపు తీశారు. మనం మాత్రం పెద్ద పెద్ద సినిమాలు తీయడానికి 200 రోజులు తీసుకుంటున్నాం. ఎక్కడో మిస్టేక్స్ ఉన్నాయి. అందుకే మేం ‘ప్రొడక్షన్ ప్రాసెస్ స్టాండర్డ్’ను క్రియేట్ చేస్తాం. జామ్ఎయిట్ ప్రాసెస్, థీమ్‌పార్క్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా ఎంటర్టైన్మెంట్ను 360 డిగ్రీస్ యాంగిల్లో కవర్ చేయాలనుకుంటున్నాం. ఈ ప్రొడక్షన్ ప్రాసెస్ స్టాండర్డ్‌లో కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎవరైనా రావొచ్చు. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రైనర్స్‌ను కూడా పెట్టాలనుకుంటున్నాం. ► ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రమ్మని ఫోర్స్ చేయలేం. వాళ్ల చాయిస్‌కి తగ్గట్టు సినిమాలు చూస్తారు. పెద్ద సినిమా బాగాలేకపోయినా వెళ్తారు. చిన్న సినిమాలకు అలా ఉండదు. ‘కంచరపాలెం’తో మేం అసోసియేట్ అవ్వడం వల్ల చిన్న సినిమా అయినా ఆ స్థాయికి వెళ్లగలిగింది. ► ‘వెంకీమామ’ చిత్రం షూటింగ్ జరుగుతోంది. తరుణ భాస్కర్, త్రినాథరావు దర్శకత్వాల్లో వెంకటేశ్ హీరోగా సినిమాలు ఉన్నాయి. ‘దేదే ప్యార్‌దే’ రీమేక్ రైట్స్ తీసుకున్నాం. రానా ‘విరాటపర్వం’ త్వరలో ప్రారంభం అవుతుంది. ఇవి సురేశ్ ప్రొడక్షన్స్ పార్ట్నర్షిప్లో కావొచ్చు లేదా సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మించవచ్చు. సురేశ్ ప్రొడక్షన్స్ ఫండ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయవచ్చు. లవ్‌రంజన్ (బాలీవుడ్ డైరెక్టర్)–సురేశ్ ప్రొడక్షన్స్ జాయింట్ వెంచర్ ఉంది. అతని హిందీ సినిమాలు రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాం. -
దాసరి నాకు తాత అవుతారు
‘‘ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ఎంతో మంది దర్శకుల శ్రమ ఫలితం వల్లే ఓ హీరో రూపుదిద్దుకుంటాడు. ఎంతో గొప్ప ప్రతిభా పాటవాలున్న దాసరిగారి జన్మదినం రోజుని ‘డైరెక్టర్స్ డే’గా ప్రకటించి, జరుపుకోవటం నిజంగా దర్శకుల అదృష్టం’’ అన్నారు నటుడు చిరంజీవి. మే 4 దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి. ఈ సందర్భంగా శనివారం తెలుగు దర్శకుల సంఘం ఆధ్వర్యంలో ‘డైరెక్టర్స్ డే’ వేడుక జరిగింది. ఇందులో దాదాపు 300 మంది దర్శకులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా చిరంజీవి పాల్గొన్నారు. 2018లో మంచి చిత్రాలను అందించిన నలుగురు దర్శకులను ఈ వేదికపై సన్మానించారు. చిరంజీవి చేతుల మీదుగా ‘నీది నాది ఒకే కథ’ దర్శకుడు వేణు ఉడుగుల, ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల, ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేశ్ మహా, ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి సన్మానాలు అందుకున్నారు. ఇవే కాకుండా ‘ఫోర్స్డ్ ఆర్ఫన్స్’ అనే ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్‌కి దర్శకత్వం వహించి అవార్డులు అందుకున్న వీఎన్ ఆదిత్యను, కళాతపస్వి కె.విశ్వనాథ్ గారిపై ‘విశ్వదర్శనం’ చిత్రానికి దర్శకత్వం వహించి, ఇటీవల దాదాసాహెబ్ స్పెషల్ జ్యూరీ అవార్డు పొందిన జనార్థన మహర్షిని కూడా సన్మానించారు. చిరంజీవి మాట్లాడుతూ– ‘‘1940ల కాలం నుండి ఎంతోమంది దర్శకులు ఉన్నారు. నేను నటునిగా మేకప్ వేసుకున్న దగ్గరనుండి ఈ రోజు వరకు ఎంతో మంది దర్శకులను చూశాను. కానీ దాసరిగారి శైలి చాలా ప్రత్యేకమైనది. నాకు ఆయనతో సినిమా పరిచయం అయింది ‘లంకేశ్వరుడు’ ద్వారా. ఆయన దర్శత్వంలో నేను చేసిన ఒకే ఒక్క సినిమా. అది ఆయనకు వందో చిత్రం. సినిమా ఇండస్ట్రీలో ఆయనకు, నాకూ ఒక్క సినిమా పరిచయమే అయినా మా ఇద్దరికీ దగ్గరి బంధుత్వం ఉంది. అది చాలా కొద్దిమందికే తెలుసు. ఆయన వరసకు నాకు తాత అవుతారు. నేను ఆయనకు మనవడిని అవుతాను. అందుకే నేనెప్పుడూ ఆయనతో ‘మీ మొదటి సినిమా తాతా మనవడు. మీరు, నేను తాతామనవలం’ అనేవాణ్ణి. నేను 9 సంవత్సరాల గ్యాప్ తర్వాత రాజకీయాల నుండి మళ్లీ సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు ఆయన ఎంతో ఉత్సాహాన్నిచ్చారు. ‘ఖైదీ నంబర్ 150’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు రోడ్ జర్నీ చేసుకుంటూ వచ్చి ఆ సభలో ప్రసంగించారు. 150 ఘనవిజయం సాధిస్తుందని సభా ముఖంగా అన్నారు.. దాసరిగారు అన్నట్లుగానే ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. అప్పటికే ఆయన ఆరోగ్య స్థితి విషమించి ఆస్పత్రిలో చేరారు. నేను, మా ఆవిడ ఆయన్ను చూడ్డానికి వెళితే అంత ఇబ్బందికర పరిస్థితిలోనూ ‘సినిమా ఎలా ఉంది?’ అని పేపర్ మీద రాస్తూ అడిగారు. తర్వాత ఆయనకు అల్లు రామలింగయ్య అవార్డును ప్రకటించి నేను, అల్లు అరవింద్ ఆయన ఇంటికి వెళ్లి స్వయంగా అవార్డును అందజేస్తే ఎంతో చిన్న పిల్లాడిలా ఆనందపడిపోయి, ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ విధంగా ఆయన ఆఖరి రోజుల్లో నేను చాలా దగ్గరగా ఉండటం ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘దాసరి పుట్టినరోజున నిర్వహించే ఈ సభలో బొకేలు, శాలువాల ఖర్చులు కూడా వద్దు. మన దగ్గర గతంలో పనిచేసిన దర్శకులకు ఏదైనా సాయం చేయాలనే ఉద్దేశంతో ఎంతో ఆలోచించి దర్శకులందరం ఓ నిర్ణయం తీసుకున్నాం. గతంలో దర్శకులుగా చేసి ఈ రోజున పిల్లలని చదివించుకోవటానికి కూడా లేకుండా ఇబ్బంది పడే అనేక మంది దర్శకులు ఉన్నారు. వారి సహాయార్థం ఓ నిధిని ఏర్పాటు చేయాలని ఓ నిర్ణయం తీసుకున్నాం. దాదాపు ఐదు కోట్ల నుంచి పది కోట్ల మధ్యలో వసూలు చేసి, నెలకు ఓ ఐదు వేల రూపాయల చొప్పున ఓ యాభై మంది నుండి వంద మంది వరకు సహాయం చేయాలనుకుంటున్నాం. ఈ విషయం తెలుసుకున్న రాజమౌళి ఎంతో మంచి మనసుతో యాభై లక్షల విరాళాన్ని తన వంతుగా అందించారు. నేను దర్శకునితో పాటు నిర్మాతని. బాహుబలి’ నిర్మాతల తరపున పదిహేను లక్షలు, నేను సొంతంగా పది లక్షలు ఇస్తున్నాం’’ అని చెప్పారు. మంచి మనసుతో చేస్తున్న ఈ కార్యక్రమానికి ఓ ఇరవై ఐదు లక్షలు తాను ఇస్తానని చిరంజీవి ప్రకటించారు. ఈ వేదికపై మొత్తంగా కోటి రూపాయల విరాళం అందడం ఆనందంగా ఉందని దర్శకుల సంఘం అధ్యక్షుడు యన్. శంకర్ అన్నారు. ఎ. కోదండ రామిరెడ్డి, రేలంగి నరసింహారావు, ఆర్. నారాయణమూర్తి, పరుచూరి బ్రదర్స్, తనికెళ్ల భరణి, కొరటాల శివ, వీర శంకర్, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి తదితరులు పాల్గొన్నారు. పలువురు దర్శకులు స్కిట్లు చేసి అలరించారు. దర్శకుల సంఘం వెబ్‌సైట్‌ని ఆవిష్కరించారు. -
బలమైన భారత్ కోసం...
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 122వ జయంతి సందర్భంగా కేంద్రం ఆయనకు అరుదైన గౌరవం కల్పించింది. ఢిల్లీలోని ఎర్రకోటలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరుతో ఓ మ్యూజియాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఆవిష్కరించారు. అలాగే జలియన్ వాలాబాగ్ ఊచకోత, మొదటి ప్రపంచయుద్ధంలో భారత సైనికుల స్మృత్యర్థం ‘యాదే జలియన్ మ్యూజియం’, భారత కళలకు సంబంధించి ‘దృశ్యకళ’ మ్యూజియం, 1857 తొలి స్వాతంత్య్ర సంగ్రామ ఘట్టాలను గుర్తుకుతెచ్చేలా మరో మ్యూజియాన్ని ప్రధాని ఎర్రకోటలో ప్రారంభించారు. ఈ నాలుగు మ్యూజియాలను కలిపి ‘క్రాంతి మందిర్’గా వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పందిస్తూ..‘ఘనమైన భారత చరిత్ర, సంస్కృతికి సంబంధించి నాలుగు మ్యూజియాలను ఆవిష్కరించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. శక్తిమంతమైన భారత్‌ను నిర్మించాలన్న బోస్ సంకల్పాన్ని నెరవేర్చేందుకు మేం కట్టుబడి ఉన్నాం. ఈ మ్యూజియాన్ని సందర్శించే యువత నేతాజీ జీవితం నుంచి మరింతగా స్ఫూర్తి పొందుతారని ఆశిస్తున్నా. ఎర్రకోటలోని ఈ గోడల్లో చరిత్ర ప్రతిధ్వనిస్తోంది. వలసపాలకులు ఇక్కడే కల్నల్ ప్రేమ్ సెహగల్, కల్నల్ గుర్బ„Š సింగ్ ధిల్లాన్, మేజర్ జనరల్ షానవాజ్ ఖాన్‌లను విచారించారు’ అని ట్విట్టర్లో తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా సుభాష్ చంద్రబోస్ వాడిన టోపీని ఆయన కుటుంబ సభ్యులు మోదీకి బహూకరించగా, ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆ టోపీని మ్యూజియంకు ఇచ్చేశారు. స్వాతంత్య్ర పోరాటం సందర్భంగా బోస్‌వాడిన కుర్చీ, యూనిఫాం, మెడల్స్‌తో పాటు ఆజాద్ హింద్ ఫౌజ్‌కు సంబంధించిన పలు వస్తువులను బోస్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. అలాగే సుభాష్ చంద్రబోస్ జీవితంపై తీసిన డాక్యుమెంటరీని ఇక్కడ ప్రదర్శిస్తారు. ఇక మొదటి ప్రపంచయుద్ధంలో అమరులైన 15 లక్షలమంది భారతీయ జవాన్ల వీరోచిత పోరాటం, త్యాగాన్ని యాదే జలియన్ మ్యూజియంలో ఫొటోల రూపంలో తీర్చిదిద్దారు. భారత సైని కుల త్యాగాన్ని ప్రశంసిస్తూ సరోజినీ నాయుడు రాసిన ‘గిఫ్ట్’ పద్యాన్నీ ప్రదర్శనకు ఉంచారు. -
ఘనంగా సినారె జయంతి ఉత్సవాలు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఆదివారం సిద్దిపేట పట్ట ణంలోని స్థానిక కేంద్ర గ్రంథాలయంలో సాహితీ దిగ్గజం జ్ఞానపీట్Š‡ అవార్డు గ్రహీత కీ.శే.డా.సింగిరెడ్డి నారాయణరెడ్డి జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సినారె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు, అనంతరం, సినారె స్మృతులను నేమరువేసుకున్నారు. ఈ సందర్భంగా కథాశిల్పి ఐతాచంద్రయ్య మాట్లాడుతూ.. లయబద్ధమైన గేయాలతో మదికియింపైన రచయితగా సినారెకు గొప్ప పేరు ఉందని అన్నారు. ప్రముఖ కవి అంజయ్య మాట్లాడుతూ.. కలం పట్టి రచనలు ప్రారంభించిన నాటి నుంచి మరణించే వరకు కలం ఆపని మహానీయుడు సినారె అని పొగిడారు. నేడు సినారె లేకున్నా ఆయన రచనలు ప్రజల్లో సాహితీలోకంలో అనునిత్యం పాఠిస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు. సినీజగత్తులో మరుపురాని పాటల తో మదిన నిలిచారని అన్నారు. కవి ఉండ్రాళ్ల రాజేశం మాట్లాడుతూ.. పల్లెటూరిలో పుట్టి మట్టి పరిమళత్వం పంచి పెట్టిన కవి సినారె అన్నారు. తన వద్దకు వచ్చిన కవులను ఆదరించి వారికి మెళకువలు నేర్పిన గొప్ప వ్యక్తి సినారె అని పేర్కొన్నారు. కార్యక్రమంలో దాసరి రాజు, ఎన్నవెళ్లి రాజమౌలి, పెందోట వెంకటేశ్వర్లు, కోణం పర్శరాములు, జస్వరాజ్‌కుమార్, శ్రీచరణ్ సాయిదాస్, మిట్టపల్లి పర్శరాములు, భరత్ పాల్గొన్నారు. -
వైఎస్సార్ స్ఫూర్తితోనే ముందుకు...
సాక్షి, హైదరాబాద్: ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేసి పేదల హృదయాల్లో చిరస్మరణీయ స్థానం సంపాదించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో ముందుకెళతామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 69వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నివాళులు అర్పించినవారిలో మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్‌రావు, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ తదితరులున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో భట్టి మాట్లాడుతూ పేదల కోసం వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారని, ఆయన హయాంలోనే అసలైన అభివృద్ధి, సంక్షేమం అమలయ్యాయని చెప్పారు. నాటి వైఎస్ సంక్షేమ కార్యక్రమాలను నేటి టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ఇందిరా భవన్‌లోనూ... ఏపీ కాంగ్రెస్ కార్యాలయం ఇందిరాభవన్‌లో వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిం చారు. వైఎస్ చిత్రపటానికి ఎంపీ కేవీపీ రాంచందర్‌రావు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు చరిత్రలో నిలిచిపోయాయి
-
రేపటి నుంచి ఎస్వీ రంగారావు శతాబ్ది ఉత్సవాలు
హైదరాబాద్ : హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ (హెచ్ఎఫ్సీ), శ్రీసారధి స్టూడియో సంయుక్తంగా ఈ నెల 3 నుంచి 8 వరకు విశ్వ నట చక్రవర్తి ఎస్వీ రంగారావు శతాబ్ది ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఫిల్మ్‌క్లబ్ సెక్రటరీ ఎస్ఎస్ ప్రకాష్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అమీర్‌పేట సారధి స్టూడియోస్ ప్రివ్యూ థియేటర్స్‌లో జరిగే ఈ వేడుకలు మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు తలసాని శ్రీనివాస్‌యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని వివరించారు. అలాగే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్మోహన్రావు, వెంగళరావునగర్ కార్పొరేటర్ పరుచూరి వెంకటేశ్వరరావు, సినీ రచయిత, నటుడు పరుచూరి వెంకటేశ్వరరావు, డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్‌కృష్ణ, నటి కవిత, ఫిల్మ్ మేకర్, హెచ్ఎఫ్సీ సలహాదారుడు అల్లాని శ్రీధర్‌లు హాజరవుతారన్నారు. ఆరు రోజులు..ఎనిమిది సినిమాలు... ఎస్వీ.రంగారావు శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఐదు రోజుల పాటు రోజుకొక చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభోత్సవం అనంతరం మాయాబజార్, ఈ నెల 4న సాయంత్రం 6 గంటలకు బాంధవ్యాలు, 5న సాయంత్రం 6 గంటలకు పాతాళభైరవి, 6న సాయంత్రం 6 గంటలకు సుఖదుఃఖాలు, 7న మధ్యాహ్నం 3 గంటలకు పాండవ వనవాసం, సాయంత్రం 6 గంటలకు భక్త ప్రహ్లాద, 8న 3 గంటలకు నర్తనశాల, 6 సాయంత్రం గంటలకు పండంటికాపురం చిత్ర ప్రదర్శనలు ఉంటాయని వివరించారు. -
ఘనంగా ‘మహలనోబిస్’ జయంతి
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రముఖ గణాంక శాస్త్రవేత్త ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ 125వ జయంతి వేడుకలను పురస్కరించుకుని గణాంక దినోత్సవాన్ని శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పి.సి. మహలనోబిస్ చిత్రపటానికి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ మాట్లాడుతూ మహలనోబిస్ గణాంకాలు కేంద్ర, రాష్ట్ర ఆదాయ వ్యయాలను లెక్కించడానికి, జాతీయ ఆదాయం లెక్కించడానికి, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికా రచనకు ఎంతో తోడ్పడతాయన్నారు. జిల్లా అభివృద్ధి కోసం జిల్లా స్థాయి అధికారులంతా తమ తమ శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలను ఖచ్చితమైన గణాంకాలతో సమర్పించాలన్నారు. అనంతరం సీపీవో కృష్ణయ్య మాట్లాడుతూ దేశ ప్రణాళికల రూపకల్పనకు నెహ్రూ ఎంత ప్రాముఖ్యాన్నిచ్చారో ఈ గణాంక శాఖకు అంతటి పేరు రావడానికి, భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు పి.సి. మహలనోబిస్ కూడా అంతే ప్రాముఖ పాత్రను వహించారన్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ గణాంక దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. ఈ గణాంకాల దినోత్సవాన్ని 2007 నుంచి జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విపత్తుల నిర్వాహణశాఖ వారి ‘ఆకాశంలో నల్లని మబ్బులు, మెరుపులను చూసారా, ఉరుములను విన్నారా, అయితే ‘పిడుగులు పడవచ్చు జాగ్రత్త’ అనే పోస్టర్లను విడుదల చేశారు. -
సరిలేరు నీకెవ్వరు
-
విశ్వవ్యాప్తంగా.. ఘనంగా!
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ 150వ జయంతి కార్యక్రమాల ప్రారంభోత్సవాలను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిలషించారు. ఐక్యరాజ్య సమితి సహా అన్ని ప్రపంచ వేదికలపై ఈ ఉత్సవాలు నిర్వహించాలన్నారు. మహాత్ముడి 150వ జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం ఏర్పాటైన జాతీయ కమిటీ ప్రథమ సమావేశంలో బుధవారం వారిరువురు ప్రసంగించారు. ఈ సంవత్సరం అక్టోబర్ 2 నుంచి మహాత్ముడి 150వ జయంతి వేడుకలు ప్రారంభమవనున్నాయి. ఉగ్రవాదం, ఇతర హింసాత్మక ఘటనలు పెచ్చరిల్లుతున్న నేటి సమాజానికీ గాంధీ ప్రవచించిన అహింస ఆచరణీయమని కోవింద్ పేర్కొన్నారు. గాంధీ కేవలం భారత్‌కే చెందడని, ఆయన ప్రపంచ మానవాళికి భారత్ అందించిన గొప్ప బహుమతి అని అభివర్ణించారు. భవిష్యత్ తరాలకు కూడా మహాత్ముడు స్ఫూర్తిదాయకంగా నిలిచేలా ఈ ఉత్సవాలను నిర్వహించాలని ప్రధాని మోదీ కోరారు. ‘కార్యాంజలి’ థీమ్ నేపథ్యంలో అన్ని కార్యక్రమాలను రూపొందించాలని, ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు గాంధీ చూపిన మార్గంలో పరిష్కారాలున్నాయన్నారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ ప్రధాని మన్మోహన్, బీజేపీ సీనియర్ నేత అడ్వాణీ, కేంద్ర మంత్రులు, 23 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, చైనా మేధావి క్వాన్యూ షాంగ్, అమెరికన్ గాంధీగా పేరుగాంచిన బెర్నీ మీయర్ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమాల రూపకల్పన కోసం ప్రధాని నేతృత్వంలో 125 సభ్యులతో ఒక కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేశారు. సీజేఐ, సోనియా, రాహుల్ గైర్హాజరు ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ హాజరు కాలేదు. అలాగే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు కూడా గైర్హాజరయ్యారు. -
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు
-
బాబూ జగ్జీవన్‌రామ్‌కు వైఎస్ జగన్ ఘన నివాళి
సాక్షి, గుంటూరు: భారతదేశ మాజీ ఉప ప్రధాని, సమతావాది బాబూ జగ్జీవన్ రామ్ 111వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. గుంటూరు జిల్లాలోని ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గురువారం వేజేండ్ల శివారులో ఏర్పాటు చేసిన జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను వైఎస్ జగన్ కొనియాడారు. కేంద్ర కార్యాలయంలో.. హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా పార్టీ నేతలు బత్తుల బ్రహ్యానంద రెడ్డి, పద్మజ, సంజీవరావు తదితరులు పాల్గొని జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర కార్యాలయంలో.. విజయవాడలోని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నాయకులు మేరుగ నాగార్జున, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, బొప్పన భవకుమార్ తదితరులు జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. -
ముగిసిన సత్యసాయి జయంతి వేడుకలు
పుట్టపర్తి టౌన్ : వారం రోజుల పాటు సాగిన సత్యసాయి 91వ జయంతి వేడుకలు బుధవారంతో ముగిశాయి. వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చివరి రోజు భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని నివాళులర్పించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది సత్యసాయి సేవాదల్ సైతం తరలివచ్చి వేడుకల్లో సేవలను అందించారు. వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో సందడిగా మారిన పుట్టపర్తి బోసిపోయింది. భక్తులు గురువారం స్వస్థలాలకు బయలుదేరడంతో పుట్టపర్తి ఆర్టీసీ బస్టాండ్, ప్రశాంతి రైల్వేస్టేషన్ కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఆటోలు, టాటాఏస్ వాహనాలు, కార్లకు గిరాకీ ఏర్పడింది. వివిధ క్యాంపస్‌లకు చెందిన సత్యసాయి విద్యార్థుల కోసం ఆర్టీసీ ముద్దనహళ్లి, అనంతపురం, బృందావన్‌కు ప్రత్యేక బస్సు సర్వీసులు కేటాయించారు. -
నేటి నుంచి సత్యసాయి జయంతి వేడుకలు
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు, భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక వైద్య శిబిరాలు, తాగునీటి కేంద్రాలు పుట్టపర్తి టౌన్ : సత్యసాయి బాబా 91వ జయంతి వేడుకలు శుక్రవారం నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్‌లు ఇప్పటికే భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేపట్టాయి. దేశ, విదేశాల నుంచి వేడుకల్లో పాల్గొనేందుకు భక్తులు తరలిరానుండడంతో ఎటువంటి అసౌకర్యం కలుగ కుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, ప్రత్యేక వైద్యశిబిరాలు, తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేపడుతున్నారు. ప్రత్యేక నిఘా.. జయంతి వేడుకల కోసం పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతోపాటు, పుట్టపర్తి పరిసర ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పుట్టపర్తి పట్టణ డీఎస్పీ ముక్కా శివరామిరెడ్డి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వేడుకల జరిగే రోజుల్లో నిరంతర పర్యవేక్షించేందుకు గోకులంలోని డీఎస్పీ గెస్ట్ హౌస్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి 400 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని భద్రతా ఏర్పాట్లకు కేటాయించారు. భద్రతా ఏర్పాట్ల కోసం విచ్చేసిన సిబ్బందికి గురువారం సాయంత్రం గోకులంలోని డ్వాక్రా బజార్ వద్ద డీఎస్సీ ముక్కాశివరామిరెడ్డి సమీక్ష నిర్వహించి, భద్రతా ఏర్పాట్లపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేడుకల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 25 మంది ఎస్ఐలు, 350 మంది సిబ్బందిని నియమించామన్నారు.ఇందులో రద్దీ నియంత్రణకు రోప్‌పార్టీలు, ట్రాఫిక్ కంట్రోల్ పార్టీలు, సెక్యురిటీ, పెట్రోలింగ్, డాగ్‌స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ స్వాడ్లు విధులు నిర్వహిస్తున్నారన్నారు. అలాగే సత్యసాయి సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి, కర్ణాటక నాగేపల్లి, పుట్టపర్తి బస్ డిపో వద్ద చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశాన్నారు. ప్రత్యేక వైద్య సౌకర్యాలు వైద్య ఆరోగ్య శాఖ అధ్వర్యంలో పలు ప్రాంతాల్లో భక్తుల కోసం ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాట్లు చేపట్టారు. ఈ ఏర్పాట్లు శుక్రవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం 17 మంది వైద్యులు, 63 మంది సిబ్బందిని నియమించారు.ఒక 104, రెండు 108 వాహనాలతోపాటు మొబైల్ టీంను సిద్దంగా ఉంచారు. పారిశుద్ధ్య చర్యలు భక్తుల సౌకర్యార్థం నగర పంచాయతీ అధికారులు, కమిషనర్ విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. ఎనుములపల్లి మార్కెట్ వద్ద సత్యసాయి మైదానం, కమ్మవారిపల్లి చింతతోపుల వద్ద, కర్ణాటక నాగేపల్లి వద్ద వాహనదారుల కోసం పార్కింగ్ స్థలాలను సిద్ధం చేస్తున్నారు.పట్టణంలోని హనుమాన్ సర్కిల్, విద్యాగిరి, గోకులం, చిత్రావతి రోడ్డు, సంగీత కళాశాల, చిత్రావతి ఘాట్, వెస్ట్గేట్, తహశీల్దార్ కార్యాలయం, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక బస్సులు.. భక్తుల కోసం ఆర్టీసీ వివిధ ప్రధాన నగరాల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసిందని పుట్టపర్తి డీఎం రమణయ్య తెలిపారు. ప్రధానంగా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, చెన్నై నగరాల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నామన్నారు.ధర్మవరం, పుట్టపర్తి రైల్వేష్టేషన్ల నుంచి ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామన్నారు. వేడుకల కోసం ప్రత్యేకకంగా 135 ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశాన్నారు. వేణుగోపాల్ స్వామి రథోత్సవంతో వేడుకలు ప్రారంభం సత్యసాయి 91వ జయంతి వేడుకలు శుక్రవారం వేణుగోపాల స్వామి రథోత్సవంతో ఘనంగా ప్రారంభం కానున్నాయి.వేడుకల కోసం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సత్యసాయి మహాసమాధిని, సాయికుల్వంత్ సభా మందిరాన్ని సర్వం సిద్దం చేశారు. ప్రశాంతి నిలయం ఉత్తర గోపురాన్ని ప్రత్యేకంగా అలకంరించారు. ఉదయం 8 గంటలకు ఉత్తర గోపురం వద్ద రథోత్సవాన్ని సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ప్రారంభించనున్నారు. తొలుత పెదవెంకమరాజు కల్యాణమండపం వద్ద ప్రత్యేకంగా అలంకరింపబడిన రథాన్ని ప్రశాంతి నిలయం ఉత్తర గోపురం వద్దకు తీసుకువచ్చి, సాయికుల్వంత్ సభా మందిరంలోని సత్యసాయి మహాసమాధి చెంత ఉత్సవమూర్తులైన వేణుగోపాల్ స్వామి, సీతారామలక్ష్మణుల విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చి రథోత్సవాన్ని ప్రారంభించనున్నారు. -
అల్లూరి జయంతికి ఏర్పాట్లు పూర్తి
గొలుగొండ: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం జరగనున్న వేడుకలకు కేడీపేటలో అల్లూరి పార్కు ముస్తాబైంది. శుక్రవారం సాయంత్రం నర్సీపట్నం ఆర్డీవో సూర్యారావు పార్కును సందర్శించారు. ఏర్పాట్లను పర్యవేక్షించారు. సమాధుల వద్ద గార్డెన్‌ను మెరుగుపరిచారు. అల్లూరి, గంటందొర సమాధులను పూలతో అలంకరిస్తున్నారు. జయంతి వేడుకలకు సుమారు రెండు వేలమంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరందరికీ అసౌకర్యం కలగకుండా సామియానాలు ఏర్పాటుచేస్తున్నారు. పార్కులో సుమారు వందకు పైగా ఆధునిక విద్యుత్దీపాలను ఏర్పాటుచేశారు. పర్యాటకులకు ఇబ్బంది లేకుండా తాగునీరు సమకూర్చారు. వీరికోసం కాటేజీలు ఏర్పాటుచేశారు. భవనాలను అందంగా తీర్చిదిద్దారు. వీటిలో ఒకదానిలో అల్లూరి జీవిత చరిత్రకు సంబంధించి పుస్తకాలు, చిత్రాలు అందుబాటులో ఉంచుతున్నారు. జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించిన ప్రభుత్వం పార్కు అభివృద్ధికి సుమారు రూ.20 లక్షల మేర నిధులు మంజూరుచేసింది. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ జయంతి వేడుకలకు సంబంధించి దాదాపుగా ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. ఎంపీపీ సుర్ల లక్ష్మీనారాయణ, జెడ్పీటీసీ చిటి కెల తారకవేణుగోపాల్, ఎంపీడీవో పద్మజకు సూచనలు చేశారు. వేడుకలకు విచ్చేసేవారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని వారిని కోరారు. -
జగజ్జీవన్రామ్కు వైఎస్ జగన్ ఘన నివాళి
హైదరాబాద్: భారత మాజీ ఉప ప్రధాని, దళిత నేత బాబూ జగజ్జీవన్రామ్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఆదివారం హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జగజ్జీవన్‌రామ్ చిత్ర పటానికి వైఎస్ జగన్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైఎస్ జగన్ ...దేశానికి బాబూ జగజ్జీవన్‌రామ్ చేసిన సేవలను కొనియాడారు. వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో జరిగిన జగజ్జీవన్‌రామ్ జయంతి వేడుకలకు ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులతో పాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
'ప్రజాస్వామ్య విలువల కోసం పరితపించిన జగజ్జీవన్‌రాం'
న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్య విలువ కోసం పరితపించిన వ్యక్తి బాబూ జగజ్జీవన్‌రాం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ఎదిరించి ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వ్యక్తి జగజ్జీవన్‌రాం అని ఆయన గుర్తు చేశారు. ఆదివారం న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో బాబూ జగజ్జీవన్‌రాం జయంతి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
నీవు లేకున్నా..నీ జ్ఞాపకాలు పదిలం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:రాజకీయంగా ఓటమి లేని నేతగా, పాలన, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి విశేషంగా కృషిచేశారు. జిల్లాపై ప్రత్యేక మమకారంతో విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో అధిక ప్రాధాన్యమిచ్చారు. నేడు ఆయన 65వ జయంతి సందర్భంగా ఆయన చేసిన అభివృద్ధి పనులను, ఆయన మనస్తత్వం, ఆయన పాలనను సిక్కోలు ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. అన్నదాతకు భరోసా... వై.ఎస్.రాజశేఖరరెడ్డి అన్నదాతకు భరోసాగా ఉండేవారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయ మోటార్లకు ఉచిత విద్యుత్ అందించే ఫైల్‌పై సంతకం చేసిన ఆయన, ప్రకృతి విపత్తులతో పంటలు కోల్పోరుున అన్నదాతను ఆదుకునేందుకు రుణాలు మాఫీ చేశారు. పంటలకు ప్రధాన ఆధారమైన సాగునీరు అందించేందుకు జలయజ్ఞం చేపట్టి జిల్లాలో ఎన్నో ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఎరువులు, విత్తనాలు, విద్యుత్ సరఫరాతో పాటు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించారు. ఆయన హయాంలోనే 80కిలోల ధాన్యం బస్తా రూ.1380 వరకూ పలికిందన్నది జగమెరిగిన సత్యం. జలయజ్ఞంలో భాగంగా సుమారు రెండులక్షల ఎకరాలకు నీరందించే వంశధార ప్రాజెక్టు రెండో దశ పనులు రూ.733కోట్లతో చేపట్టారు. ఆయన మరణానంతరం పనుల్లో జాప్యం నెలకొంది. తోటపల్లి రిజర్వాయర్ కాలువల విస్తరణ, ఆఫ్‌షోర్ ప్రాజెక్టు, వరద ముప్పు రాకుండా కరకట్టల నిర్మాణం, పరిశ్రమల స్థాపనకు మౌలిక సదుపాయాలు, ఉద్దానం కొబ్బరి, మంచినీటి ప్రాజెక్టులకు అధిక నిధుల కేటారుుంపు తదితర పనులన్నీ ఆయన హయూంలోనే. విద్యావైద్య రంగాలకు పెద్దపీట అత్యంత వెనుకబడిన జిల్లాకు వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చినది వైఎస్సారే. గ్రామీణ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీలుగా డా.బీఆర్ అంబేద్కర్ పీజీ సెంటర్‌ను యూనివర్సిటీగా స్థాయి పెంచారు. సౌకర్యాల కల్పనకు నిధులు కేటాయించారు. అలాగే, 108, 104 సేవలు, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు వడ్డీలేని రుణాలు, డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ రుణాలు తదితర ప్రజా సం క్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి అన్నివర్గాల ప్రజల గుండెల్లో చోటు సంపాదించారు. ఇచ్ఛాపురం కాదు ఇష్టాపురం జిల్లా శివారున ఉన్న ఇచ్ఛాపురం అంటే వైఎస్సార్‌కు ఎంతో ఇష్టం. ఏ కార్యక్రమాన్ని అయినా రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ప్రారంభించి ఇటు ఇచ్ఛాపురంలో ముగించేవారు. కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజల్ని అన్ని విధాల ఓదార్చేందుకు ఆయన చేపట్టిన మహాప్రస్థానం 2003లో ఇచ్ఛాపురంలోనే ముగిసింది. అందుకు గుర్తుగా అక్కడో స్థూపం కూడా వెలిసింది. -
నేడు మహానేత జయంతి
విజయనగరం మున్సిపాలిటీ: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు వైఎస్సార్సీపీ నాయకులు, అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. ఏడేళ్ల పాలనలో బడుగు, బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గా ల అభివృద్ధికి పెద్ద పీట వేసిన నాయకుడుగా వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో నిలిచారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ కార్పొరేట్ వైద్యం అందించడంతో పాటు జలయజ్ఞం ద్వా రా బీడు వారిన భూములను సస్యశ్యామలం చేసేందుకు కడదాకా కృషి చేశారు. ఏటా జూలై 8న నిర్వహించే ఈ వేడుకల్లో భాగంగా మంగళవారం స్థానిక రాజీవ్ క్రీడామైదానంలో మెగా రక్తదాన శిబిరంతో పాటు, వరుణయాగం నిర్వహించనున్నట్టు ఆ పార్టీ నాయకుడు కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వైఎస్ జయం తి వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈమేరకు ఆపార్టీ అధికార ప్రతినిధి యడ్ల ఆదిరాజు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ గురుతులు పదిలం పార్వతీపురం టౌన్: తెల్లని ఆహార్యం... చల్లని దరహాసం... అంతా నా వారే అనిపించే ఆప్యా య పలకరింపు... వెరసి వైఎస్ రాజశేఖర రెడ్డి. నేడు ఆ మహనీయుని జయంతి. వైఎస్ లోకా న్ని విడిచి ఇన్నేళ్లు గడిచినా ప్రజల గుండెల్లో మాత్రం చిరంజీవిగానే ఉన్నారు. అందులోనూ పార్వతీపురం డివిజన్ ప్రజల గుండెల్లో ఆయన గురుతులు పదిలంగా ఉన్నాయి. ఏ మాత్రం తీరిక దొరికినా తనమానస పుత్రిక జంఝావతి రబ్బరు డ్యామ్‌కు వచ్చి, కాసేపు ఇంజనీర్లతో ముచ్చటించి వెళ్లడం ఆయనకెంతో ఆనందం. అంతేకాదు ఆయనను చూసేందుకు వచ్చిన ప్రతి రైతునూ పలకరించి కుశల ప్రశ్నలు అడిగిన జ్ఞాపకాలు ఇంకా ఇక్కడ పచ్చగానే ఉన్నా యి. కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద గల జంఝావతి నది ప్రాంగణంలో ఉన్న ఏ శిలా ఫలకాన్ని, ప్రశ్నించినా, ఏ రెళ్లిదుప్పును కదిపినా ఆ మహానేత అడుగుల సవ్వడిని విని పిస్తాయి. జంఝావతిపై డ్యామ్‌ను ఆస్ట్రియా పరిజ్ఞానంతో ఆసియాలోనే మొదటిదిగా జూన్, 2005లో మహానేత తన చేతులమీదుగా ప్రారంభించారు. అనంతరం నిత్యం అధికారులను అప్రమత్తం చేస్తూ ఆ ఏడాది డిసెంబర్ నాటికి వచ్చి, ప్రాజెక్టు పూర్తయిన విషయాన్ని తెలుసుకున్నారు. అనంతరం 2006 జనవరి-1న మరల జంఝావతి వచ్చి తన మానస పుత్రిక జంఝావతి రబ్బరు డ్యామ్‌ను జలయజ్ఞంలోని తొలి ఫలంగా జాతికి అంకితం చేశారు. దీనిలో భాగంగా సమీపంలోని తోటపల్లిని పలుమార్లు సందర్శించి అక్కడ తన స్నేహితుడైన ఇంజనీర్‌ను కలిసి తన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకునేవారు. దీనికి తోడు 108, 104, ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, పింఛన్లు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి.