
నేడు మహానేత జయంతి
విజయనగరం మున్సిపాలిటీ: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు, అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. ఏడేళ్ల పాలనలో బడుగు, బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గా ల అభివృద్ధికి పెద్ద పీట వేసిన నాయకుడుగా వైఎస్‌ఆర్ ప్రజల గుండెల్లో నిలిచారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ కార్పొరేట్ వైద్యం అందించడంతో పాటు జలయజ్ఞం ద్వా రా బీడు వారిన భూములను సస్యశ్యామలం చేసేందుకు కడదాకా కృషి చేశారు. ఏటా జూలై 8న నిర్వహించే ఈ వేడుకల్లో భాగంగా మంగళవారం స్థానిక రాజీవ్ క్రీడామైదానంలో మెగా రక్తదాన శిబిరంతో పాటు, వరుణయాగం నిర్వహించనున్నట్టు ఆ పార్టీ నాయకుడు కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వైఎస్ జయం తి వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈమేరకు ఆపార్టీ అధికార ప్రతినిధి యడ్ల ఆదిరాజు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆ గురుతులు పదిలం
పార్వతీపురం టౌన్: తెల్లని ఆహార్యం... చల్లని దరహాసం... అంతా నా వారే అనిపించే ఆప్యా య పలకరింపు... వెరసి వైఎస్ రాజశేఖర రెడ్డి. నేడు ఆ మహనీయుని జయంతి. వైఎస్ లోకా న్ని విడిచి ఇన్నేళ్లు గడిచినా ప్రజల గుండెల్లో మాత్రం చిరంజీవిగానే ఉన్నారు. అందులోనూ పార్వతీపురం డివిజన్ ప్రజల గుండెల్లో ఆయన గురుతులు పదిలంగా ఉన్నాయి. ఏ మాత్రం తీరిక దొరికినా తనమానస పుత్రిక జంఝావతి రబ్బరు డ్యామ్‌కు వచ్చి, కాసేపు ఇంజనీర్లతో ముచ్చటించి వెళ్లడం ఆయనకెంతో ఆనందం. అంతేకాదు ఆయనను చూసేందుకు వచ్చిన ప్రతి రైతునూ పలకరించి కుశల ప్రశ్నలు అడిగిన జ్ఞాపకాలు ఇంకా ఇక్కడ పచ్చగానే ఉన్నా యి. కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద గల జంఝావతి నది ప్రాంగణంలో ఉన్న ఏ శిలా ఫలకాన్ని, ప్రశ్నించినా, ఏ రెళ్లిదుప్పును కదిపినా ఆ మహానేత అడుగుల సవ్వడిని విని పిస్తాయి.
జంఝావతిపై డ్యామ్‌ను ఆస్ట్రియా పరిజ్ఞానంతో ఆసియాలోనే మొదటిదిగా జూన్, 2005లో మహానేత తన చేతులమీదుగా ప్రారంభించారు. అనంతరం నిత్యం అధికారులను అప్రమత్తం చేస్తూ ఆ ఏడాది డిసెంబర్ నాటికి వచ్చి, ప్రాజెక్టు పూర్తయిన విషయాన్ని తెలుసుకున్నారు. అనంతరం 2006 జనవరి-1న మరల జంఝావతి వచ్చి తన మానస పుత్రిక జంఝావతి రబ్బరు డ్యామ్‌ను జలయజ్ఞంలోని తొలి ఫలంగా జాతికి అంకితం చేశారు. దీనిలో భాగంగా సమీపంలోని తోటపల్లిని పలుమార్లు సందర్శించి అక్కడ తన స్నేహితుడైన ఇంజనీర్‌ను కలిసి తన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకునేవారు. దీనికి తోడు 108, 104, ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, పింఛన్లు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి.