దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్. రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు అమెరికాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూఎస్ఏ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. డల్లాస్ లోని బసేరా ఇండియన్ క్యూసిన్లో జరిగిన వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలకు ఎన్ఆర్ఐలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. కొవ్వొత్తులు వెలిగించి, వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన ఆంద్రప్రదేశ్ ప్రజలకు స్వర్ణయుగంలాంటిదని వారు అభిప్రాయపడ్డారు.
తెలుగు ప్రజలకు వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సేవలు, పేదల పట్ల ఆయన కనబరిచిన ప్రత్యేక శ్రద్ధను ప్రస్తావించారు. తండ్రికి తగ్గ తనయుడిగా వైఎస్ జగన్ అనేక సంక్షేమ పథకాలను చేపట్టారని ఈ సందర్భంగా కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment