బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్న వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: భారతదేశ మాజీ ఉప ప్రధాని, సమతావాది బాబూ జగ్జీవన్ రామ్ 111వ జయంతి సందర్భంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. గుంటూరు జిల్లాలోని ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గురువారం వేజేండ్ల శివారులో ఏర్పాటు చేసిన జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను వైఎస్ జగన్ కొనియాడారు.
కేంద్ర కార్యాలయంలో..
హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా పార్టీ నేతలు బత్తుల బ్రహ్యానంద రెడ్డి, పద్మజ, సంజీవరావు తదితరులు పాల్గొని జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
రాష్ట్ర కార్యాలయంలో..
విజయవాడలోని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నాయకులు మేరుగ నాగార్జున, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, బొప్పన భవకుమార్ తదితరులు జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
Comments
Please login to add a commentAdd a comment