![CM KCR Participated In PV Narasimha Rao Jayanti Celebrations - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/28/CM-KCR-Participated-In-PV-Narasimha-Rao.jpg.webp?itok=StW5BKUV)
సాక్షి, హైదరాబాద్: నేడు(బుధవారం) మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 102వ జయంతి. ఇక, పీవీ జయంతి వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ క్రమంలో దేశానికి పీవీ అందించిన సేవలను కేసీఆర్ సర్మించుకున్నారు.
ఈ క్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు. నాడు పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలే నేడు దేశ ప్రజల అనుభవంలోకి వచ్చాయని చెప్పారు. పలు సంస్కరణలతో భారతదేశ ఔన్నత్యాన్ని పీవీ కాపాడారు. పీవీ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని వెల్లడించారు. తెలంగాణ ఠీవీ.. మన పీవీ అని చెప్పారు. పీవీ స్ఫూర్తితో దేశాభివృద్ధి దిశగా ముందుకు సాగుతామని వెల్లడించారు.
మరోవైపు.. పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణిదేవి కూడా జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వాణిదేవి మాట్లాడుతూ.. పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల అభివృద్ధి ఫలాలు మనం అనుభవిస్తున్నాం. పీవీ జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నది అని తెలిపారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ బీజేపీ.. మరీ ఇంత గందరగోళమా?
Comments
Please login to add a commentAdd a comment