Vani Devi
-
తెలంగాణ ఠీవీ.. మన పీవీ: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: నేడు(బుధవారం) మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 102వ జయంతి. ఇక, పీవీ జయంతి వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ క్రమంలో దేశానికి పీవీ అందించిన సేవలను కేసీఆర్ సర్మించుకున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు. నాడు పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలే నేడు దేశ ప్రజల అనుభవంలోకి వచ్చాయని చెప్పారు. పలు సంస్కరణలతో భారతదేశ ఔన్నత్యాన్ని పీవీ కాపాడారు. పీవీ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని వెల్లడించారు. తెలంగాణ ఠీవీ.. మన పీవీ అని చెప్పారు. పీవీ స్ఫూర్తితో దేశాభివృద్ధి దిశగా ముందుకు సాగుతామని వెల్లడించారు. మరోవైపు.. పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణిదేవి కూడా జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వాణిదేవి మాట్లాడుతూ.. పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల అభివృద్ధి ఫలాలు మనం అనుభవిస్తున్నాం. పీవీ జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నది అని తెలిపారు. ఇది కూడా చదవండి: తెలంగాణ బీజేపీ.. మరీ ఇంత గందరగోళమా? -
ఖాదీ వస్త్ర ప్రదర్శన ప్రారంభం
సనత్‌నగర్: ఖాదీని ప్రోత్సహించడమంటే మన సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించడమేనని మాజీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో బేగంపేట బ్రాహ్మణవాడీలోని స్వామి రామానంద తీర్థలో ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శనను శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రదర్శనలో ఉంచిన ఖాదీ వ్రస్తాలను ఆయన తిలకించారు. అనంతరం వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాన్ చైర్పర్సన్, ఎమ్మెల్సీ వాణీదేవి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మధుసూదనాచారి మాట్లాడుతూ.. ప్రకృతికి అనుగుణంగా దుస్తులను తయారు చేయడం గొప్ప కళగా అభివర్ణించారు . చీరాంబరాలను అగ్గిపెట్టెల్లో ఎగుమతి చేసిన కళా నైపుణ్యం మన సొంతం అన్నారు. స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మన బ్రాండ్లు అంతర్జాతీయ బ్రాండ్లుగా ఎదగాలని, అందుకోసం మరింతగా కళా నైపుణ్యం పెంపొందించుకోవడంతో పాటు ప్రభుత్వాలు సైతం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఖాదీ కళాకారులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందేలా చూస్తానన్నారు. భవిష్యత్తు తరాలకు భారతీయ ఖాదీ గొప్పతనాన్ని తెలియజేయాలని ఆయన సూచించారు. ఈ నెల 31 వరకు వస్త్ర ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, దయానంద్, స్వామి రామానంద తీర్థ మెమోరియల్ కమిటీ ఫౌండర్ చైర్మన్ పీవీ ప్రభాకర్‌రావు, వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాన్ వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తాతయ్య బయోపిక్ తీస్తా: అజిత
స్వర్గీయ భారత ప్రధాని పీవీ నరసింహరావుగారి బయోపిక్ తీస్తానని ఆయన మనవరాలు అజిత అన్నారు. తన తాతగారి బహుభాషా ప్రావీణ్యం, అసాధారణ రాజకీయ చాతుర్యంతోపాటు బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియని ఎన్నో విషయాలను ఈ బయోపిక్ లో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. బయోపిక్ కోసం తన తల్లి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణిదేవి సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని, నేటి యువతకు స్పూర్తి నింపేలా చిత్రాన్ని తెరకెక్కిస్తామని చెప్పారు. పీవీ నరసింహారావుతో అజిత(పాత ఫోటో) ఇక తమ ఫిల్మ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతూ.. ‘త్వరలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఉంది. మా దగ్గరున్న గ్రీన్ మ్యాట్ స్టూడియో, ఆడియో మిక్సింగ్, ఎడిటింగ్, డబ్బింగ్ యూనిట్ లను అందరికీ అందుబాటులో ఉంచడం ద్వారా సినిమా రంగానికి మావంతు సేవలందించాలని భావిస్తున్నాం. అలాగే ఈ ప్రాంగణంలో షూటింగ్స్ మరియు ఓపెనింగ్, ఆడియో రిలీజ్ వంటి ఫంక్షన్స్ చేసుకునేందుకు కూడా వీలు కల్పిస్తున్నాము’అని అన్నారు. -
మహిళా జర్నలిస్టులపై ‘టెక్ ఫాక్స్’ వేధింపులపై ఎమ్మెల్సీ కవిత ఫైర్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా మహిళా జర్నలిస్టులపై జరుగుతున్న వేధింపులు దాడిపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. తమ గళం వినిపించిన మహిళా జర్నలిస్టులపై ‘టెక్ ఫాక్స్’ద్వారా వేధింపులకు పాల్పడుతున్నారని, ఇది ఎవరో తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా బీజేపీపై విమర్శలు చేశారు. రాణా, స్వాతి లాంటి ప్రముఖ జర్నలిస్టులకు వ్యతిరేకంగా లక్షల కొద్దీ ట్వీట్స్ చేసి వేధింపులకు పాల్పడ్డారంటూ కొన్ని గణాంకాలను సభాముఖంగా చదివి వినిపించారు. ప్రశ్నించేవారిని అణచి వేసే ధోరణి దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.. ఈ సందర్భంగా ముఖ్య అతిధులుగా వచ్చిన సీనియర్ జర్నలిస్టులు ధన్యా రాజేంద్రన్ (న్యూస్ మినిట్), మాలిని సుబ్రహ్మణ్యంకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టుల కోసం నిర్వహిస్తున్న రెండు రోజుల వర్క్‌షాప్ ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జర్నలిస్టులు ‘కోర్’ విలువలు పాటించాలని . బేగంపేటలోని టూరిజం ప్లాజాలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టుల కోసం నిర్వహిస్తున్న రెండు రోజుల వర్క్‌షాప్ ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యూస్ రాసే జర్నలిస్టులు కోర్ (క్రెడిబిలిటీ, ఆబ్జెక్టివిటీ, రెస్పాన్సిబిలిటీ,ఎథిక్స్) విలువలను పాటించడం ద్వారానే వార్తకు సంపూర్ణత చేకూరుతుందని, సమాజంలోవారికి గౌరవం పెరుగుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మనం తక్కువోల్లం కాదు.. సానా గొప్పోల్లం ఇంతమంది జర్నలిస్టులు ఒక్క చోటికి రావడం అద్భుతం. ఏ రంగమైనా మహిళలకు ఇబ్బందులు తప్పవు. అయినా ఏ మాత్రం వెరవకుండా నిబద్ధతగా ఉండాలన్నారు. మగవారి కన్న మనం 100 శాతం ఎ క్కువ శ్రమ చేయాల్సిందే అన్నారు. మనం తక్కువోల్లం కాదు..సానా గొప్పోల్లం..ఇదే స్ఫూర్తితో పట్టుదలగా విధి నిర్వహణలో సెన్సిటివిటీగా ఉండాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి కొత్తగా నిర్మాణమవుతున్న సెక్రటేరియట్లో మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక గదిని కేటాయించేలా కృషి చేస్తానని కవిత హామీనిచ్చారు. అలాగే సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌తో మాట్లాడి మీడియా సంస్థల్లో మహిళలపై వేధింపులు, వివక్షను నిరోధించే కమిటీలు వేయించేందుకు ప్రయత్నిస్తా అన్నారు. అంతేకాదు జర్నలిస్టులకు సంబంధించిన కమిటీలలో ఆడవారి ప్రాతినిధ్యం లేదని అర్థమవుతోందని, ఇకపై వారి ప్రాతినిధ్యం ఉండేలా జాగ్రత్తపడాలని అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణకు సూచించారు. ఏప్రిల్ 23, 24 తేదీల్లో ఈ వర్క్‌షాప్‌లో ముగింపు సమావేశంలో విద్యావేత్త, ఎమ్మెల్సీ వాణీదేవి మాట్లాడుతూ జనాన్ని జాగృతం చేయగలిగే సత్తా ఒక్క జర్నలిస్టులకే ఉందని, ఆ వైపుగా మహిళా జర్నలిస్టులు చేస్తున్న కృషి సంతోషంగా ఉందని కొనియాడారు. -
జాబ్ నోటిఫికేషన్లు.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
సనత్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయనున్న నేపథ్యంలో బేగంపేట బ్రాహ్మణవాడీలోని స్వామి రామానందతీర్థ మెమోరియల్ కమిటీలో పీవీ నరసింహారావు స్మారక గ్రంథాలయంలో ఉద్యోగార్థులు చదువుకునేందుకు అనుకూలమైన వాతావరణం కల్పించనున్నట్లు ఎమ్మెల్సీ, కమిటీ చైర్పర్సన్ వాణీదేవి తెలిపారు. కమిటీ ప్రాంగణంలోని ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆమె మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఇక్కడి గ్రంథాలయంలో అవసరమైన సమాచారం, పుస్తకాలను అందుబాటులో ఉంచుతామన్నారు. గ్రంథాలయంలో చదువుకునేందుకు అనువైన వాతావరణం కల్పించినట్లు తెలిపారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు పీవీ స్మారక గ్రంథాలయం తెరిచి ఉంటుందని ఆమె తెలిపారు. సమావేశంలో సురభి సోలార్ ఎనర్జీ కేంద్రం డైరెక్టర్ శేఖర్ మారంరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీగా వాణీదేవి ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి ఎమ్మెల్సీగా ఆదివారం ప్రమాణం స్వీకారం చేశారు. శాసనమండలిలో వాణీదేవి చేత ప్రొటెం ఛైర్మన్ భూపాల్ రెడ్డి ప్రమాణం చేయించారు. హైదరాబాద్-రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వాణీదేవి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఈ సందర్భంగా వాణీదేవి మాట్లాడుతూ, టీఆర్ఎస్కు ఆమెకు కృతఙ్ఞతలు తెలిపారు. ‘‘రాజకీయ వాతావరణంలో పెరిగాం. ప్రజాసేవ చేయడానికి పదవి అక్కర్లేదని అనుకున్నా. కానీ అధికారం ఉంటే ఇంకా ఎక్కువ సేవ చేయొచ్చని భావించా. అప్పుడే తనకు సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారు’’ అని వాణీదేవి అన్నారు. ఇవీ చదవండి: మీ ఇష్టం.. గణేష్ విగ్రహాల విషయంలో ఆంక్షల్లేవ్ శ్మశానంలో ‘డాక్టర్’ చదువు