
స్వర్గీయ భారత ప్రధాని పీవీ నరసింహరావుగారి బయోపిక్ తీస్తానని ఆయన మనవరాలు అజిత అన్నారు. తన తాతగారి బహుభాషా ప్రావీణ్యం, అసాధారణ రాజకీయ చాతుర్యంతోపాటు బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియని ఎన్నో విషయాలను ఈ బయోపిక్ లో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. బయోపిక్ కోసం తన తల్లి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ వాణిదేవి సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని, నేటి యువతకు స్పూర్తి నింపేలా చిత్రాన్ని తెరకెక్కిస్తామని చెప్పారు.
పీవీ నరసింహారావుతో అజిత(పాత ఫోటో)
ఇక తమ ఫిల్మ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతూ.. ‘త్వరలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఉంది. మా దగ్గరున్న గ్రీన్ మ్యాట్ స్టూడియో, ఆడియో మిక్సింగ్, ఎడిటింగ్, డబ్బింగ్ యూనిట్ లను అందరికీ అందుబాటులో ఉంచడం ద్వారా సినిమా రంగానికి మావంతు సేవలందించాలని భావిస్తున్నాం. అలాగే ఈ ప్రాంగణంలో షూటింగ్స్ మరియు ఓపెనింగ్, ఆడియో రిలీజ్ వంటి ఫంక్షన్స్ చేసుకునేందుకు కూడా వీలు కల్పిస్తున్నాము’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment