ముగిసిన సత్యసాయి జయంతి వేడుకలు | sathyasai jayanthi celebrations | Sakshi
Sakshi News home page

ముగిసిన సత్యసాయి జయంతి వేడుకలు

Published Thu, Nov 24 2016 11:17 PM | Last Updated on Mon, Sep 4 2017 9:01 PM

ముగిసిన సత్యసాయి జయంతి వేడుకలు

ముగిసిన సత్యసాయి జయంతి వేడుకలు

పుట్టపర్తి టౌన్‌ : వారం రోజుల పాటు సాగిన సత్యసాయి 91వ జయంతి వేడుకలు బుధవారంతో ముగిశాయి. వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చివరి రోజు భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని నివాళులర్పించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది సత్యసాయి సేవాదల్‌ సైతం తరలివచ్చి వేడుకల్లో సేవలను అందించారు.

వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో సందడిగా మారిన పుట్టపర్తి బోసిపోయింది. భక్తులు గురువారం స్వస్థలాలకు బయలుదేరడంతో పుట్టపర్తి ఆర్టీసీ బస్టాండ్‌, ప్రశాంతి రైల్వేస్టేషన్‌ కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఆటోలు, టాటాఏస్‌ వాహనాలు, కార్లకు గిరాకీ ఏర్పడింది. వివిధ క్యాంపస్‌లకు చెందిన సత్యసాయి విద్యార్థుల కోసం ఆర్టీసీ ముద్దనహళ్లి, అనంతపురం, బృందావన్‌కు ప్రత్యేక బస్సు సర్వీసులు కేటాయించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement