పుట్టపర్తి టౌన్ : పట్టణంలో శనివారం సత్యసాయి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. శుక్రవారం నిర్వాహకులు మాట్లాడుతూ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం 6.30 గం టలకు ప్రశాంతి నిలయం గణేష్ గేట్ వద్ద గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుందన్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని సత్యసాయి ఆశీస్సులు పొందాలని వారు కోరారు.