
సాక్షి,హైదరాబాద్: తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. గురు పౌర్ణమి సందర్భంగా జూలై 3న అరుణాచలంలో జరిగే గిరి ప్రదర్శనకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును నడపాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది.
సర్వీసు నంబర్ 98889 గల ఈ బస్సు.. జులై 2న ఉదయం 6 గంటలకు హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ నుంచి బయలుదేరి.. ఆంధ్రప్రదేశ్ కాణిపాకంలోని విఘ్నేశ్వరుని దర్శనానంతరం అదే రోజు రాత్రి 10 గంటలకు అరుణాచలం చేరుకుంటుంది. గిరి ప్రదర్శన పూర్తయిన తర్వాత జులై 3 సాయంత్రం 3 గంటలకు వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్ వెళ్లి.. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్‌కు మరుసటి రోజు జులై 4 ఉదయం 10 గంటలకు చేరుకుంటుంది. ఈ మేరకే టీఎస్ఆర్టీసీ అరుణాచల గిరి ప్రదర్శనను టూర్ ప్యాకేజీలాగా అందిస్తోంది. ఈ ప్యాకేజీ ధరను ఒక్కొక్కరికి రూ.2600గా సంస్థ నిర్ణయించింది.
‘గురుపౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరిప్రదర్శనకు భక్తుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ సదుపాయాన్ని అరుణాచల గిరి ప్రదర్శన చేయాలనుకునే భక్తులు వినియోగించుకోవాలని సూచించింది. ఈ టూర్ ప్యాకేజీని సంస్థ అధికారిక వెబ్ సైట్ www.tsrtconline.in లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఎంబీజీఎస్, జేబీఎస్, దిల్ సుఖ్ నగర్ బస్టాండ్ తో పాటు సమీప టీఎస్ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్లలోనూ బుక్ చేసుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీకి సంబందించిన పూర్తి సమాచారం కోసం 9959226257,9959224911 ఫోన్ నంబర్లను సంప్రదించాల్సి ఉంటుంది.’ ఈ మేరకు టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ఐపీఎస్ సూచించారు.
చదవండి: జోగిపేట ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌పై కేసు నమోదు.. కారణం ఇదే..
Comments
Please login to add a commentAdd a comment