జగజ్జీవన్రామ్కు వైఎస్ జగన్ ఘన నివాళి
హైదరాబాద్: భారత మాజీ ఉప ప్రధాని, దళిత నేత బాబూ జగజ్జీవన్రామ్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఆదివారం హైదరాబాద్ లోటస్ పాండ్లోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జగజ్జీవన్రామ్ చిత్ర పటానికి వైఎస్ జగన్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం వైఎస్ జగన్ ...దేశానికి బాబూ జగజ్జీవన్రామ్ చేసిన సేవలను కొనియాడారు. వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో జరిగిన జగజ్జీవన్రామ్ జయంతి వేడుకలకు ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులతో పాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.