హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 31 వర్ధంతి సందర్భంగా ఆయనకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా నివాళులు అర్పించింది. వైఎస్‌ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన జగ్జీవన్ రామ్ చిత్రపటానికి ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే ఆదిమూలపు రవికుమార్,పార్టీ అధికార ప్రతినిధి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.