హైదరాబాద్ : హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ (హెచ్‌ఎఫ్‌సీ), శ్రీసారధి స్టూడియో సంయుక్తంగా ఈ నెల 3 నుంచి 8 వరకు విశ్వ నట చక్రవర్తి ఎస్వీ రంగారావు శతాబ్ది ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఫిల్మ్‌క్లబ్ సెక్రటరీ ఎస్‌ఎస్ ప్రకాష్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అమీర్‌పేట సారధి స్టూడియోస్ ప్రివ్యూ థియేటర్స్‌లో జరిగే ఈ వేడుకలు మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు తలసాని శ్రీనివాస్‌యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని వివరించారు. అలాగే తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్మోహన్‌రావు, వెంగళరావునగర్ కార్పొరేటర్ పరుచూరి వెంకటేశ్వరరావు, సినీ రచయిత, నటుడు పరుచూరి వెంకటేశ్వరరావు, డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్‌కృష్ణ, నటి కవిత, ఫిల్మ్ మేకర్, హెచ్‌ఎఫ్‌సీ సలహాదారుడు అల్లాని శ్రీధర్‌లు హాజరవుతారన్నారు.
ఆరు రోజులు..ఎనిమిది సినిమాలు...
ఎస్వీ.రంగారావు శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఐదు రోజుల పాటు రోజుకొక చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభోత్సవం అనంతరం మాయాబజార్, ఈ నెల 4న సాయంత్రం 6 గంటలకు బాంధవ్యాలు, 5న సాయంత్రం 6 గంటలకు పాతాళభైరవి, 6న సాయంత్రం 6 గంటలకు సుఖదుఃఖాలు, 7న మధ్యాహ్నం 3 గంటలకు పాండవ వనవాసం, సాయంత్రం 6 గంటలకు భక్త ప్రహ్లాద, 8న 3 గంటలకు నర్తనశాల, 6 సాయంత్రం గంటలకు పండంటికాపురం చిత్ర ప్రదర్శనలు ఉంటాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment