Saradhi studio
-
అధునాతన టెక్నాలజీతో ప్రారంభమైన సారథి స్టూడియోస్..
హైదరాబాద్‌లో తెలుగు సినిమాకు ఐకాన్.. ఇంకా చెప్పాలంటే మొట్ట మొదటి స్టూడియోగా శ్రీ సారథీ స్టూడియోస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలనాటి నుంచి.. నేటి సినిమాల వరకు ఎన్నెన్నో చిత్రాలు ఇక్కడ షూటింగ్ జరుపుకున్నవే. మారుతున్న కాలానికి తగ్గట్లుగా అధునాతన టెక్నాలజీతో అన్ని రకాల హంగులతో ఈ స్టూడియోస్‌ను తీర్చిదిద్దారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోనే అధునాతన డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్ స్టూడియోలను శ్రీ సారథీ స్టూడియోస్ ప్రారంభించారు. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ప్రారంభించగా.. సౌండ్ డిజైన్ స్టూడియోను ప్రముఖ సినీ సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర ప్రారంభించారు.ఈ సందర్భంగా శ్రీ సారథీ స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్ ఆర్.వి. ప్రసాద్ మాట్లాడుతూ..'ఈ స్టూడియోని మల్టీఫ్లెక్స్ థియేటర్స్‌గా మార్చాలన్న ఆలోచన చేసి ఆ తర్వాత విరమించుకున్నాం. సినీ స్టూడియోస్‌గానే కొనసాగించాలని నిర్ణయించుకున్న అనంతరం షూటింగులకు కావలసిన అన్ని రకాల హంగులు, అలాగే నేటి కాలానికి పోటీపడేవిధంగా పోస్ట్ ప్రొడక్షన్స్ కు కావలసిన అధునాతన టెక్నాలజీని మా స్టూడియోలో అందుబాటులోకి తీసుకుని వచ్చాం. మేము ఆరంభించిన డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్స్ చాలా అధునాతనమైనవి. ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మా స్టూడియోలో మొదలైన మొదటి సినిమా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న క్రేజీ సినిమా "కల్కి" అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం" అని అన్నారు.శ్రీ సారథీ స్టూడియోస్ డైరెక్టర్ కేవీ రావు మాట్లాడుతూ.. 'మా స్టూడియోలో షూటింగ్ ప్రారంభిస్తే పోస్ట్ ప్రొడక్షన్స్‌తో సహా సినిమా మొదటి కాపీని సిద్ధం చేసుకునేంతవరకు కావలసిన సామాగ్రి అంతా ఉందని అన్నారు. సినిమా అనగానే సౌండింగ్ కు ఉన్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. అందుకే అధునాతన టెక్నాలజీని మేము ప్రవేశపెట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు కేఎస్ రామారావు, కేఎల్ నారాయణ, రచయిత విజయేంద్రప్రసాద్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్, సంగీత దర్శకుడు భీమ్స్, స్టూడియో జనరల్ మేనేజర్ బాలచంద్ర, పలువురు సినీ ప్రముఖులు పాల్గొని యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. -
తెలంగాణలో షూటింగ్స్ సందడి
-
మెట్రో స్టేషన్ నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
హైదరాబాద్: రాజధానిలోని అమీర్‌పేట మెట్రోరైల్ స్టేషన్ మొదటి అంతస్తు పైనుంచి దూకి గుర్తుతెలియని వ్యక్తి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఉదయం 7.40 గంటలకు ఓ గుర్తుతెలియని వ్యక్తి అమీర్‌పేట సారథి స్టూడియో వైపు నుంచి మెట్రో స్టేషన్ మెట్లపై నుంచి చేతులు ఊపుకుంటూ మొదటి అంతస్తుకు వెళ్లాడు. రేలింగ్ వద్ద కొద్దిసేపు నిలబడి అటూఇటూ చూస్తూ ఒక్కసారిగా దానిపైకి ఎక్కాడు. కొద్దిదూరంలో నిలబడి ఉన్న మరో వ్యక్తి గమనించి పడిపోతావు కిందకు దిగు అంటుండగానే దూకేశాడు. వ్యక్తి పడిపోవడాన్ని గమనించిన స్థానికులు మెట్రో అధికారులకు సమాచారం అందించారు. భద్రతా సిబ్బంది వెళ్లి రాళ్లపై పడిన వ్యక్తిని చూడగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. స్టేషన్ కంట్రోలర్ చక్రవర్తి ఫిర్యాదుతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు విచారణ జరిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తిగా కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఒంటిపై చొక్కా మినహా ఎలాంటి దుస్తులు లేవు. మృతుడి వయసు 35 నుంచి 40 ఏళ్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. దాదాపు 40 అడుగుల ఎత్తు నుంచి దూకడంతో అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచామని, బంధువులు ఎవరైనా ఉంటే పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు. -
రేపటి నుంచి ఎస్వీ రంగారావు శతాబ్ది ఉత్సవాలు
హైదరాబాద్ : హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ (హెచ్ఎఫ్సీ), శ్రీసారధి స్టూడియో సంయుక్తంగా ఈ నెల 3 నుంచి 8 వరకు విశ్వ నట చక్రవర్తి ఎస్వీ రంగారావు శతాబ్ది ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఫిల్మ్‌క్లబ్ సెక్రటరీ ఎస్ఎస్ ప్రకాష్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అమీర్‌పేట సారధి స్టూడియోస్ ప్రివ్యూ థియేటర్స్‌లో జరిగే ఈ వేడుకలు మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు తలసాని శ్రీనివాస్‌యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని వివరించారు. అలాగే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్మోహన్రావు, వెంగళరావునగర్ కార్పొరేటర్ పరుచూరి వెంకటేశ్వరరావు, సినీ రచయిత, నటుడు పరుచూరి వెంకటేశ్వరరావు, డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్‌కృష్ణ, నటి కవిత, ఫిల్మ్ మేకర్, హెచ్ఎఫ్సీ సలహాదారుడు అల్లాని శ్రీధర్‌లు హాజరవుతారన్నారు. ఆరు రోజులు..ఎనిమిది సినిమాలు... ఎస్వీ.రంగారావు శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఐదు రోజుల పాటు రోజుకొక చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభోత్సవం అనంతరం మాయాబజార్, ఈ నెల 4న సాయంత్రం 6 గంటలకు బాంధవ్యాలు, 5న సాయంత్రం 6 గంటలకు పాతాళభైరవి, 6న సాయంత్రం 6 గంటలకు సుఖదుఃఖాలు, 7న మధ్యాహ్నం 3 గంటలకు పాండవ వనవాసం, సాయంత్రం 6 గంటలకు భక్త ప్రహ్లాద, 8న 3 గంటలకు నర్తనశాల, 6 సాయంత్రం గంటలకు పండంటికాపురం చిత్ర ప్రదర్శనలు ఉంటాయని వివరించారు. -
కొత్త హంగులతో సారథి
‘‘తెలుగు సినిమా అనే పదానికి ఉపమానం లాంటి ‘సారథీ స్డూడియో’ మళ్లీ ఇన్నాళ్ల తర్వాత సరికొత్త సొబగులు అద్దుకోవడం ఆనందంగా ఉంది. దాదాపు 25 నుంచి 30 సినిమాలు నేను ఈ స్టూడియోలోనే రూపొందించా’’ అని దర్శక రత్న దాసరి నారాయణరావు అన్నారు. హైదరాబాద్‌లో తొలి తరం ఫిలిమ్ స్టూడియోగా తెలుగు సినీ అభిమానుల హృదయాల్లో నిలిచిపోయిన సారథీ స్టూడియోను స్థాపించి, 60 ఏళ్లు పూర్తయింది. 1956లో ప్రారంభమైన ఈ స్డూడియో నేటి షూటింగ్‌లకు అనుగుణంగా సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంది. శుక్రవారం జరిగిన ఈ స్టూడియో పునరంకితోత్సవంలో సీనియర్ దర్శకులు కె.విశ్వనాథ్ సారథీ స్టూడియో వెబ్సైట్ ‘సినీ సారథి’నీ, దాసరి ప్రివ్యూ థియేటర్‌నూ, కె. రాఘవేంద్రరావు డబ్బింగ్, ఎడిటింగ్ విభాగాలనూ ఆవిష్కరించారు. ఇక నుంచి ‘సారథి సంస్థ’ పేరుతో కొనసాగుతుందని సంస్థ చైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి. ప్రసాద్, డెరైక్టర్ కేవీ రావు తెలిపారు.