అధునాతన టెక్నాలజీతో ప్రారంభమైన సారథి స్టూడియోస్.. | Music Director MM Keeravani Started Saradhi Studio With New Technology | Sakshi
Sakshi News home page

Keeravani: సారథి స్టూడియోస్‌ను ప్రారంభించిన ఎంఎం కీరవాణి

Published Fri, Apr 26 2024 9:25 PM | Last Updated on Fri, Apr 26 2024 9:25 PM

Music Director MM Keeravani Started Saradhi Studio With New Technology

హైదరాబాద్‌లో తెలుగు సినిమాకు ఐకాన్.. ఇంకా చెప్పాలంటే మొట్ట మొదటి  స్టూడియోగా శ్రీ సారథీ స్టూడియోస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలనాటి నుంచి.. నేటి సినిమాల వరకు ఎన్నెన్నో చిత్రాలు ఇక్కడ షూటింగ్ జరుపుకున్నవే. మారుతున్న కాలానికి తగ్గట్లుగా అధునాతన టెక్నాలజీతో అన్ని రకాల హంగులతో ఈ స్టూడియోస్‌ను తీర్చిదిద్దారు. తాజాగా  తెలుగు రాష్ట్రాల్లోనే అధునాతన డాల్బీ మిక్సింగ్,  సౌండ్ డిజైన్ స్టూడియోలను శ్రీ సారథీ స్టూడియోస్ ప్రారంభించారు.  ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ప్రారంభించగా..  సౌండ్ డిజైన్ స్టూడియోను ప్రముఖ సినీ సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర ప్రారంభించారు.

ఈ సందర్భంగా శ్రీ సారథీ స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్ ఆర్.వి. ప్రసాద్ మాట్లాడుతూ..'ఈ స్టూడియోని మల్టీఫ్లెక్స్ థియేటర్స్‌గా మార్చాలన్న ఆలోచన చేసి ఆ తర్వాత విరమించుకున్నాం. సినీ స్టూడియోస్‌గానే  కొనసాగించాలని నిర్ణయించుకున్న అనంతరం షూటింగులకు కావలసిన అన్ని రకాల హంగులు, అలాగే నేటి కాలానికి పోటీపడేవిధంగా పోస్ట్ ప్రొడక్షన్స్ కు కావలసిన అధునాతన టెక్నాలజీని మా స్టూడియోలో అందుబాటులోకి తీసుకుని వచ్చాం. మేము ఆరంభించిన డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్స్‌ చాలా అధునాతనమైనవి. ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ  మా స్టూడియోలో మొదలైన మొదటి సినిమా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న క్రేజీ సినిమా "కల్కి" అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం" అని అన్నారు.

శ్రీ సారథీ స్టూడియోస్ డైరెక్టర్ కేవీ రావు మాట్లాడుతూ.. 'మా స్టూడియోలో షూటింగ్ ప్రారంభిస్తే పోస్ట్ ప్రొడక్షన్స్‌తో సహా సినిమా మొదటి కాపీని సిద్ధం చేసుకునేంతవరకు కావలసిన సామాగ్రి అంతా ఉందని అన్నారు. సినిమా అనగానే  సౌండింగ్ కు ఉన్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. అందుకే అధునాతన టెక్నాలజీని మేము ప్రవేశపెట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు కేఎస్ రామారావు, కేఎల్ నారాయణ, రచయిత విజయేంద్రప్రసాద్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్, సంగీత దర్శకుడు భీమ్స్, స్టూడియో జనరల్ మేనేజర్ బాలచంద్ర, పలువురు సినీ ప్రముఖులు పాల్గొని యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement