inaugaration
-
అధునాతన టెక్నాలజీతో ప్రారంభమైన సారథి స్టూడియోస్..
హైదరాబాద్‌లో తెలుగు సినిమాకు ఐకాన్.. ఇంకా చెప్పాలంటే మొట్ట మొదటి స్టూడియోగా శ్రీ సారథీ స్టూడియోస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలనాటి నుంచి.. నేటి సినిమాల వరకు ఎన్నెన్నో చిత్రాలు ఇక్కడ షూటింగ్ జరుపుకున్నవే. మారుతున్న కాలానికి తగ్గట్లుగా అధునాతన టెక్నాలజీతో అన్ని రకాల హంగులతో ఈ స్టూడియోస్‌ను తీర్చిదిద్దారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోనే అధునాతన డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్ స్టూడియోలను శ్రీ సారథీ స్టూడియోస్ ప్రారంభించారు. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ప్రారంభించగా.. సౌండ్ డిజైన్ స్టూడియోను ప్రముఖ సినీ సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర ప్రారంభించారు.ఈ సందర్భంగా శ్రీ సారథీ స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్ ఆర్.వి. ప్రసాద్ మాట్లాడుతూ..'ఈ స్టూడియోని మల్టీఫ్లెక్స్ థియేటర్స్‌గా మార్చాలన్న ఆలోచన చేసి ఆ తర్వాత విరమించుకున్నాం. సినీ స్టూడియోస్‌గానే కొనసాగించాలని నిర్ణయించుకున్న అనంతరం షూటింగులకు కావలసిన అన్ని రకాల హంగులు, అలాగే నేటి కాలానికి పోటీపడేవిధంగా పోస్ట్ ప్రొడక్షన్స్ కు కావలసిన అధునాతన టెక్నాలజీని మా స్టూడియోలో అందుబాటులోకి తీసుకుని వచ్చాం. మేము ఆరంభించిన డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్స్ చాలా అధునాతనమైనవి. ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మా స్టూడియోలో మొదలైన మొదటి సినిమా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న క్రేజీ సినిమా "కల్కి" అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం" అని అన్నారు.శ్రీ సారథీ స్టూడియోస్ డైరెక్టర్ కేవీ రావు మాట్లాడుతూ.. 'మా స్టూడియోలో షూటింగ్ ప్రారంభిస్తే పోస్ట్ ప్రొడక్షన్స్‌తో సహా సినిమా మొదటి కాపీని సిద్ధం చేసుకునేంతవరకు కావలసిన సామాగ్రి అంతా ఉందని అన్నారు. సినిమా అనగానే సౌండింగ్ కు ఉన్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. అందుకే అధునాతన టెక్నాలజీని మేము ప్రవేశపెట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు కేఎస్ రామారావు, కేఎల్ నారాయణ, రచయిత విజయేంద్రప్రసాద్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్, సంగీత దర్శకుడు భీమ్స్, స్టూడియో జనరల్ మేనేజర్ బాలచంద్ర, పలువురు సినీ ప్రముఖులు పాల్గొని యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. -
ఏఐ రూపంలో అలరించబోతున్న అలనాటి చందమామ కథలు
పండు వెన్నెల్లో శ్వేతవర్ణంలో వెలిగిపోయే చందమామను చూపిస్తూ అమ్మ గోరు ముద్దలు పెడుతుంటే ఆ హాయిదనం అలాగే ఉండాలనిపిస్తుంది. అమ్మ ప్రేమ ఎంత మాధుర్యమో ... అమ్మ భాష కూడా అంతే తియ్యదనం. తేనెలూరే తెలుగు భాషలో కథలను చెబుతూ అమ్మ తినిపిస్తుంటే ఊహా ప్రపంచాన్ని చుట్టి వచ్చేస్తూ ఉంటాం. అలాంటి చందమామ కథలను మళ్లీ వినాలని ఉందా.. ఆ కథలను కొత్తగా చూడాలని ఉందా. అయితే మీ ఆశ, ఆకాంక్ష తీరే రోజు దగ్గరకొచ్చేసింది. టెక్నాలజీ పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో, నాగరికత కొత్త పుంతలు తొక్కుతున్న ఈ కాలంలో .. నాటి నీతికథలు, సాహసగాథలు నేటి పిల్లలకు ఎంతో అవసరం. అందుకే అదే టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ స్వేచ్ఛ సంస్థ చందమామ కథలను ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ టూల్ ద్వారా సరికొత్తగా మనకు అందిస్తుంది. నేడు మన మొబైల్ లో వాడే తెలుగు అక్షరాలు ఈ స్వేచ్ఛ సృష్టించినవే. అదే స్వేచ్ఛ నేడు ఈ అద్భుతమైన అందమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 40 వేల కథలను ఇప్పటికే అప్ లోడ్ చేసిన స్వేచ్ఛ బృందం .. సరికొత్త కథలు వచ్చేలా టూల్ ను కూడా సిద్ధం చేసింది. అమృతగాథలను సృష్టించే ఈ వినూత్న కార్యక్రమానికి తెలుగు సాహితీవేత్తలు, రచయితలు, కవులతో పాటు, మాతృభాషపై మమకారం కలిగిన ప్రతి ఒక్కరికీ ఆహ్వానం పలుకుతున్నామని నిర్వాహకులు తెలిపారు. రేపు (శనివారం 2024 జనవరి 6వ తేదీ) ఈ ఆవిష్కరణ జరగనుంది. గచ్చిబౌలి స్వేచ్ఛ ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. -
అమెరికాలోనూ.. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ వేడుకలు!
యూపీలోని అయోధ్యలో త్వరలో నూతన రామాలయం ప్రారంభంకానుంది. దీనిపై భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలోని హిందువులలో అమితమైన ఆసక్తి నెలకొంది. ఇదిలావుండగా అమెరికాలోని వాషింగ్టన్లో ఆదివారం రామాలయంలో రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. వాషింగ్టన్‌లోని హిందువులు.. అయోధ్య వే స్ట్రీట్‌లోని ఆంజనేయ ఆలయం వద్ద కారు, బైక్ ర్యాలీ నిర్వహించారు. తమ వాహనాలపై కాషాయ జెండాలను ఎగురవేశారు. అమెరికాలో ఉంటున్న హిందువులు అయోధ్యలోని రామాలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హిందువులంతా తమ ఇళ్లలో ఐదు దీపాలను వెలిగించాలని నిర్ణయించారు. అలాగే వివిధ నగరాల్లో కారు ర్యాలీలు నిర్వహించనున్నారు. రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అందరూ వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిగురించి విశ్వహిందూ పరిషత్ ఆఫ్ అమెరికా (వీహెచ్‌పీఏ) అధికారి అమితాబ్ మిట్టల్ మాట్లాడుతూ ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని అమెరికాలోని వెయ్యికి పైగా ఆలయాలలో వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో భాగస్వాములయ్యేందుకు అమెరికాలోని హిందువుల సౌకర్యార్థం వెబ్‌సైట్‌ను ప్రారంభించామని అమితాబ్ మిట్టల్ తెలిపారు. అమెరికాలో ఉంటున్న డాక్టర్ భరత్ బరాయ్ మాట్లాడుతూ మనందరి కల ఇన్నాళ్లకు సాకారం కాబోతున్నదని అన్నారు. రామ మందిరం కోసం లెక్కలేనంత మంది పోరాడారని, త్వరలో తాము అయోధ్యకు వెళ్లాలని అనుకుంటున్నామన్నారు. ఇది కూడా చదవండి: నేడు ప్రధాని మోదీ వారణాసి రాక.. -
పులివెందులలో శిల్పారామం ప్రారంభించిన సీఎం జగన్
-
దేశవ్యాప్తంగా 9 వందే భారత్ రైళ్లు ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే..?
ఢిల్లీ: దేశవ్యాప్తంగా తొమ్మిది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. 11 రాష్ట్రాల్లో అనుసంధానం పెంచే ఈ రైలు మార్గాలు ప్రయాణికుల సమయాన్ని ఘనణీయంగా ఆధా చేయనున్నాయి. 9 New #VandeBharat poised for debut. Prime Minister #NarendraModi inagurated all the #VandeBharatExpress today. pic.twitter.com/sBgBcRpUWa — Nitu Kumari (@nitukumari_94) September 24, 2023 ఉదయ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఉదయ్‌పూర్-జైపూర్ మధ్య నడుస్తుంది. ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయాణిస్తున్న అత్యంత వేగవంతమైన రైలు కంటే ఇది దాదాపు 30 నిమిషాల సమయాన్ని ఆధా చేస్తుంది. రాజస్థాన్‌లో ఇది మూడో వందే భారత్ రైలు. మిగిలిన రెండు జోధ్‌పూర్-సబర్మతి, అజ్మీర్-ఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్. తిరునెల్వేలి-మధురై-చెన్నై వందే భారత్ తిరునెల్వేలి-మధురై-చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు తిరునెల్వేలి, మధురైలను చెన్నైతో కలుపుతుంది. దీంతో ప్రయాణ సమయం రెండు గంటలకు పైగా తగ్గే అవకాశం ఉంది. ఈ రైలు తిరునెల్వేలి జంక్షన్ నుంచి బయలుదేరి విరుదునగర్, మధురై, దిండిగల్, తిరుచిరాపల్లిలో అనేక స్టాప్‌లతో చెన్నై చేరుకుంటుంది. కాచిగూడ-బెంగళూరు ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్‌లోని కాచిగూడ-బెంగళూరులోని యశ్వంత్‌పూర్ మధ్య నడుస్తుంది. మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం, ధరంవరం స్టేషన్లలో స్థానికంగా ఆగుతుంది. ఈ రైలులో 530 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యంతో ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్, ఏడు ఛైర్ కార్ కోచ్‌లు ఉంటాయి. విజయవాడ-చెన్నై వందే భారత్ చెన్నైలో ప్రధాని మోదీ ప్రారంభించనున్న రెండో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇది. ఈ రైలు తిరుపతి పుణ్యక్షేత్రానికి రేణిగుంట మార్గంలో వెళ్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా విజయవాడ, చెన్నై మధ్య నడుస్తుంది. పాట్నా-హౌరా వందే భారత్ ఈ రైలు మార్గం బీహార్‌లోని పాట్నా జంక్షన్‌ను పశ్చిమ బెంగాల్‌లోని హౌరాతో కలుపుతుంది. ఇది 6 గంటల 35 నిమిషాల్లో 532 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. ఈ రైలు పాట్నా సాహెబ్, మొకామా, లక్కీసరాయ్ జంక్షన్, జసిదిహ్, జమ్తారా, అసన్సోల్, దుర్గాపూర్లలో రెండు నిమిషాల చొప్పున ఆగుతుంది. కాసరగోడ్ - తిరువనంతపురం కాసరగోడ్ - తిరువనంతపురం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కేరళకు చెందింది. ఇది సుమారు మూడు గంటల ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. ఏడు గంటల 55 నిమిషాల్లో 573 కి.మీ. ప్రయాణిస్తుంది. పూరీ-భువనేశ్వర్- రూర్కెలా ఈ రైలు ఒడిశాలోని పూరిలో ఉదయం 5 గంటలకు బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 12:45 గంటలకు రూర్కెలా చేరుకుంటుంది. తిరిగి వచ్చే సమయంలో, రైలు రూర్కెలా నుండి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి రాత్రి 9 గంటలకు పూరీకి చేరుకుంటుంది. ఇది ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, దెంకనల్, అంగుల్, సంబల్పూర్ సిటీ, ఝర్సుగూడలో స్టాప్‌లను కలిగి ఉంటుంది. రాంచీ-హౌరా వందే భారత్ రాంచీ-హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుంది. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లోని నగరాలను కలిపే అత్యంత వేగవంతమైన రైలు ఇది. ఇది రాంచీలో ఉదయం 5:15 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:20 గంటలకు హౌరా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో, రైలు హౌరా నుంచి మధ్యాహ్నం 3:45 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 10:50 గంటలకు రాంచీబాట్ చేరుకుంటుంది. జామ్‌నగర్-అహ్మదాబాద్ వందే భారత్ జామ్‌నగర్-అహ్మదాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఐదు స్టాప్‌లతో 4 గంటల 40 నిమిషాల్లో 331 కి.మీ ప్రయాణిస్తుంది. ఇది జామ్‌నగర్‌లో 5:30 గంటలకు బయలుదేరి రాజ్‌కోట్, వాంకనేర్, సురేంద్రనగర్, విరామ్‌గామ్, సబర్మతి మీదుగా ఉదయం 10:10 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది. ఇదీ చదవండి: ప్రధాని మోదీ భద్రతా వలయంలో కలకలం -
పర్యాటక రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది: సీఎం జగన్
-
అమీర్‌పేట్‌లో అవాన్య నెయిల్ అకాడమీ.. ‘బేబీ’ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ సందడి (ఫోటోలు)
-
125 అడుగుల అంబెడ్కర్ భారీ విగ్రహావిష్కరణ
-
తిరుమలలో శిల్పకళా ప్రదర్శనను ప్రారంభించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి
-
గంగా విలాస్ యాత్రను ప్రారంభించిన ప్రధాని మోదీ
-
కర్తవ్యపథ్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
-
పెద్దపల్లి జిల్లా: నూతన కలెక్టరేట్ ఆఫీసును ప్రారంభించిన సీఎం కేసీఆర్
-
ఆగష్టు 4న పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవానికి సిద్ధం
-
టీసీఎల్ ద్వారా 2వేల మందికి ఉపాధి లభిస్తోంది: సీఎం వైఎస్ జగన్
-
కైతలాపూర్ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-
ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఎనర్జీ పవర్ ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్థాపన
-
తెలంగాణలో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమం ప్రారంభం
-
యునెస్కో ‘భాగ్యం’ దక్కాలి
సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి: టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌కు తీసిపోనిరీతిలో చారిత్రక సంపద ఉన్న హైదరాబాద్‌కు యునెస్కో హెరిటేజ్ సిటీగా గుర్తింపు తీసుకురావాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. రూ.333.50 కోట్లతో 2.71 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ‘రాయదుర్గం–షేక్‌పేట్’ ఫ్లైఓవర్‌ను శనివారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో చార్మినార్ మొదలు గోల్కొండ వరకు ఎన్నో అద్భుతమైన చారిత్రక కట్టడాలు ఉన్నాయన్నారు. రసూల్‌పుర జంక్షన్ వద్ద కేంద్ర హోంశాఖకు సం బంధించిన స్థలం అందించి ఫ్లైఓవర్ నిర్మాణానికి సహకరించాలని కిషన్‌రెడ్డిని కోరారు. కంటోన్మెంట్ లో మిలటరీ అధికారులు మూసేసిన 21 రోడ్లను తెరిపించే బాధ్యతను తీసుకోవాలన్నారు. హైదరా బాద్‌కు అనుసంధానంగా ఉన్న 8 జాతీయ రహదా రుల వెంట అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నా మని పేర్కొన్నారు. ఎస్ఆర్డీపీలో ఫ్లైఓవర్లు, అం డర్పాస్లు, గ్రేడ్ సెపరేటర్లు తదితర 24 ప్రాజెక్ట్‌లు పూర్తి అయ్యాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా 11వ, జనాభా పరంగా 12వ స్థానం, దేశానికి సంపద అందించడంలో 4వ స్థానంలో ఉందని ఇటీవల రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన నివేదికలో పేర్కొనట్లు కేటీఆర్ వెల్లడించారు. రూ.100 కోట్లతో ఔటర్‌రింగ్ రోడ్డును ఎల్ఈడీ లైట్ల వెలుగులతో దేశంలో ఏ నగరానికి లేనంతగా ఒక మణిహారంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ తెలంగాణకు మకుటం... కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్)కు అనుమతించామని, స్థలసేకరణ సేకరణ వేగవంతంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఆర్ఆర్ఆర్ తెలంగా ణకు మకుటం లాంటిదని, గేమ్ ఛేంజర్‌గా మారు తుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణకు మరిన్ని జాతీయ రహదారులు మంజూరయ్యాయని, త్వరలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని తెలిపారు. హైదరా బాద్‌లో సైన్స్ సిటీ నిర్మాణానికి 25 ఎకరాల స్థలం కేటాయించాలని సీఎంకు లేఖ రాశానన్నారు. ఎస్సార్డీపీ ద్వారా చేసిన పలు పనులకు రాష్ట్ర ప్రభుత్వమే నిధులు ఖర్చు చేసిందని, మరిన్ని పనులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి ద్వారా రూ.10 వేల కోట్లను స్పెషల్ ప్యాకేజీ కింద ఇప్పించాలని కిషన్‌రెడ్డిని మంత్రి తలసాని శ్రీని వాస్‌యాదవ్ కోరారు. కార్యక్రమంలో రాష్ట్రమం త్రులు మహుమూద్ అలీ, సబితాఇంద్రారెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్ అరికపూడి గాంధీ, ఎమ్మెల్సీలు మహేందర్‌రెడ్డి, సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, కార్పొరేటర్లు పాల్గొన్నారు. అప్పటి చీఫ్ ఇంజనీర్‌కు గుర్తింపు షేక్‌పేట ఫ్లై ఓవర్‌ను ప్రారంభించే అవకాశాన్ని ఈఎన్సీకి ఇచ్చి మునిసిపల్ మంత్రి కేటీఆర్ పనిచేసేవారికి గుర్తింపునిచ్చారు. జీహెచ్ఎంసీలో ఎస్సార్డీపీ ద్వారా పూర్తి చేసిన 24 పనుల్లో కీలకపాత్ర పోషించిన అప్పటి చీఫ్ ఇంజనీర్, ప్రస్తుతం రాష్ట్ర ప్రజారోగ్యశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్‌గా ఉన్న శ్రీధర్ రుమాండ్లతో రిబ్బన్ కట్ చేయించి ఈ ఫ్లై ఓవర్‌ను ప్రారంభోత్సవం చేయించారు. -
Pragya Jaiswal: కాకినాడలో ముగ్ధ టెంపుల్ థీమ్ 14వ షోరూమ్ ప్రారంభం
-
మంత్రాలయంలో సచివాలయ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
-
నూతన కార్యవర్గం
డాబాగార్డెన్స్:నగరంలోని బురుజుపేటలో వెలసిన కనకమహలక్ష్మి అమ్మవారి ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం మంగళవారం ఆలయ ప్రాంగణంలో జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉపకమిషనర్ ఎన్.వి.ఎస్.ఎన్.మూర్తి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మండలి చైర్మన్‌గా వుప్పల భాస్కరరావును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ధర్మకర్తల మండలి సభ్యులుగా చిప్పాడ చంద్రరావు, పి.వి.గిరిధర్, పి.వెంకటరమణ, కదా భాస్కరరావు, ఓదూరు శివయ్య, రావి చలపతిరావు, విజయ్‌కుమార్, చీదరాల దుర్గాప్రసాద్‌తో పాటు ఎక్ష్‌అఫిషియో సభ్యుడిగా బందావన దేశికాచార్యుడుచే ప్రమాణం స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేషకుమార్, బీజేపీ నగర అధ్యక్షుడు ఎం.నాగేంద్ర, విశాఖపట్నం పోర్టు ట్రస్టీ టి.సుబ్బరామిరెడ్డి, ఆలయ ఉప కలెక్టర్, ఈవో ఎస్.జ్యోతిమాధవి,ఆలయ ఉప కార్యనిర్వాహక ఇంజనీరు సీహెచ్‌వీ రమణ, సహాయ కార్యనిర్వాహణాధికార్లు వి.రాంబాబు, పి.రామారావు, సహాయ ఇంజనీరు కె.ఎస్.ఎన్.మూర్తి, పర్యవేక్షకులు ఎన్.వి.వి.ఎస్.ఎస్.ఏ.ఎన్.రాజు, సూర్యకుమారి పాల్గొన్నారు. -
నేడు కేసీఆర్ ఇంటికి బాబు
అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించనున్న ఏపీ సీఎం సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం నేపథ్యంలో కొంతకాలంగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదివారం కలుసుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ‘అమరావతి’ శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించేందుకు ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో కేసీఆర్ అధికారిక నివాసానికి చంద్రబాబు కుటుంబ సమేతంగా వెళ్లనున్నారు. ఈ మేరకు 5 గంటలకు కేసీఆర్ అపాయింట్మెంట్ కావాలని చంద్రబాబు కోరగా... కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. -
కోటి మంది బాబులనైనా ఎదుర్కొంటాం
-
కోటి మంది బాబులనైనా ఎదుర్కొంటాం
మహబూబ్‌నగర్ జిల్లా కరువును తీరుస్తాం: సీఎం కేసీఆర్ ♦ ఎవరడ్డుపడినా కుర్చీ వేసుకొని కూర్చొని ప్రాజెక్టును కట్టించి తీరుతా ♦ తల తాకట్టు పెట్టయినా నాలుగేళ్లలో పూర్తి చేస్తాం ♦ పాలమూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన, పైలాన్ ఆవిష్కరణ ♦ తెలంగాణ అభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడుతున్నారని ధ్వజం ♦ ప్రాజెక్టు నిర్వాసితులకు తక్షణమే కుటుంబానికో ఉద్యోగం ♦ అనువైన ప్రాంతంలో వ్యవసాయ భూమి, డబుల్బెడ్రూం ఇళ్లు ♦ కర్ణాటకతో మాట్లాడి ఆర్డీఎస్ను దగ్గరుండి పూర్తి చేయిస్తానని వెల్లడి సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కోటిమంది చంద్రబాబులు కొంగజపం చేసినా.. హరిహర బ్రహ్మాది రుద్రాదులు అడ్డుపడ్డా పాలమూరు ప్రాజెక్టును అనుకున్న సమయానికి నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శపథం చేశారు. పాలమూరు ప్రజలకు పట్టెడన్నం పెట్టడానికి ఎత్తిపోతల పథకాన్ని తాను తీసుకొస్తే అనుమతి ఎవరిచ్చారంటూ ఓ ఆంధ్రా మంత్రి నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు. ఏపీలో పొతిరెడ్డిపాడు, హంద్రీనీవా, కండలేరు, వెలిగొండ, పట్టిసీమ ప్రాజెక్టులను ఎవరి అనుమతితో కట్టారని ప్రశ్నించారు. లేనిపోని వంకర మాటలతో, చేతలతో తెలంగాణ ప్రాజెక్టును అడ్డుకోవాలని చూస్తే ఖబడ్దార్ జాగ్రత్త అని కేసీఆర్ హెచ్చరించారు. రాష్ర్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకానికి గురువారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరు మండలం కర్వెనలో శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. పైలాన్‌ను కూడా ఆవిష్కరించారు. అనంతరం అక్కడే నిర్వహించిన సభలోనూ, తర్వాత భూత్పూరులో జరిగిన భారీ బహిరంగసభలోనూ కేసీఆర్ మాట్లాడారు. అవసరమైతే తన తల తాకట్టు పెట్టయినా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తిచేస్తానని.. పాలమూరుకు నీళ్లు రావడం కలేనని అపహాస్యం చేసిన వారికి చెంపపెట్టులా ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను త్వరితగతిన చేపడతామని సీఎం పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును తానే స్వయంగా కుర్చీ వేసుకొని కూర్చొని కట్టించి తీరుతానన్నారు. అహోరాత్రులు శ్రమించి ఎక్కువ మంది రైతులకు ఉపయోగపడేలా ఈ ప్రాజెక్టును తానే డిజైన్ చేయించానని చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రధానికి ఫిర్యాదు చేస్తామని ఏపీ మంత్రి దేవినేని ఉమ బెదిరిస్తున్నారని, నరేంద్రమోదీ ఆంధ్రా రాష్ట్రానికే ప్రధాని కాదని, ఆయన తమకూ ప్రధానే అని వ్యాఖ్యానించారు. దీన్ని అడ్డుకోడానికి ఎన్ని కుక్కలు ప్రయత్నం చేసినా న్యాయంవైపే కేంద్రం ఉంటుందన్నారు. చంద్రబాబు ఏనాడూ తెలంగాణ అభివృద్ధిని కోరుకోలేదని.. ఇప్పుడూ అడ్డుపడుతున్నారని విమర్శించారు. పాలమూరు కరువు తీరేలా, జిల్లాలో సిరులు కురిసేలా, వలసలకు స్వస్తి పలికేలా రూ. 35,200 కోట్లతో ఈ భారీ ప్రాజెక్టును చేపట్టినట్లు కేసీఆర్ వివరించారు. వట్టెం, కర్వెన ప్రాంతాల్లో రెండేళ్లలోపే సాగునీటిని అందిస్తామన్నారు. ఈ పనులను స్వయంగా పర్యవేక్షిస్తానని.. అవసరమైతే ఇక్కడే విశ్రాంతి భవనం నిర్మించుకుని 15 రోజులకోసారి వచ్చి పరిశీలిస్తానని చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల వల్ల రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల కరువు తీరుతుందన్నారు. తెలంగాణకు జలవనరులపై ఉన్న హక్కును ఇంచు కూడా వదులుకోబోమని, ఆర్డీఎస్‌పై మళ్లీ దృష్టి పెడతామని ఆయన స్పష్టం చేశారు. త్వరలో కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఆర్డీఎస్ కట్ట దగ్గర కుర్చీ వేసుకుని కూర్చుని ప్రాజెక్టును పూర్తిచేయిస్తానని సీఎం పేర్కొన్నారు. ‘పాలమూరు’కు కురుమూర్తి దేవుడి పేరు పాలమూరు ప్రాజెక్టు పరిధిలో మూడు తండాలు ముంపునకు గురవుతున్నాయని, ఆ కుటుంబాలను ప్రభుత్వం కంటికి రెప్పలాగా చూసుకుంటుందన్నారు. వారికి అవసరమైన చోట దిగువ ఆయకట్టు ప్రాంతంలో ఎంత ఖర్చయినా సరే భూములను కొనివ్వడానికి సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ చెప్పారు. అలాగే ప్రతి ఇంటికీ ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని.. ప్రాజెక్టు పనులు ప్రారంభించేలోపే వారికి తొలి వేతనం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. డబుల్బెడ్రూం ఇళ్లు కూడా నిర్మించి ఇస్తామన్నారు. భూ నిర్వాసితుల సమస్యను పరిష్కరించడానికి అవసరమైతే తండావాసులతో తానే సమావేశమవుతానన్నారు. నిర్వాసితుల వివరాలను సేకరించే పని, ఉద్యోగాలు ఇప్పించే పని తక్షణమే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశిస్తానని చెప్పారు. వచ్చే మార్చి నుంచి రైతులకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పగటిపూటే కరెంటు ఇచ్చి తీరుతామన్నారు. మహబూబ్‌నగర్ ప్రజల ఆరాధ్యదైవంగా భావించే కురుమూర్తి దేవుడి పేరును పాలమూరు ప్రాజెక్టుకు పెడుతున్నట్లు సభికుల హర్షధ్వానాల మధ్య ఆయన ప్రకటించారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోని హేమసముద్రంలో 10 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టును త్వరలో చేపడతామన్నారు. -
తల తాకట్టు పెట్టయినా..
మహబూబ్‌నగర్: పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ గురువారం ఉదయం శంకుస్థాపన చేశారు. అనంతరం కరివెన గ్రామంలో ఏర్పాటుచేసిన పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తల తాకట్టు పెట్టయినా పాలమూరుకు వచ్చే నాలుగేళ్లలో కృష్ణా నీళ్లు తెస్తామన్నారు. సమైక్య రాష్ట్రంలో పాలమూరుకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు కింద వీలైనంత తక్కువగా ముంపు ఉండేలా చూస్తామన్నారు. ప్రాజెక్టు నిర్వాసితులందరికి డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. ప్రాజెక్టు కింద మూడు తండాలు పోతున్నాయని.. నిర్వాసితుల్లో గిరిజనలు, నిరుపేదలున్నారన్నారు. నిర్వాసితుల కడుపు నింపే ప్రాజెక్ట్ మొదలు పెడతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తక్షణమే కలెక్టర్‌తో మాట్లాడి ప్రతి ఇంటికో ఉద్యోగం ఇచ్చి, ప్రాజెక్ట్ మొదలయ్యే వరకే నిర్వాసితులకు సర్కార్ జీతం వచ్చేలా చూస్తామన్నారు. నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. 15 రోజులకోసారి ప్రాజెక్ట్ పనులు పర్యవేక్షిస్తానని చెప్పారు. రూ.35,200 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తిచేస్తామని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే మూడు జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది. దీంతో పాటు హైదరాబాద్ నగరానికి 20 టీఎంసీల నీరు రానుంది.