అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించనున్న ఏపీ సీఎం
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం నేపథ్యంలో కొంతకాలంగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదివారం కలుసుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ‘అమరావతి’ శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించేందుకు ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో కేసీఆర్ అధికారిక నివాసానికి చంద్రబాబు కుటుంబ సమేతంగా వెళ్లనున్నారు. ఈ మేరకు 5 గంటలకు కేసీఆర్ అపాయింట్‌మెంట్ కావాలని చంద్రబాబు కోరగా... కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
నేడు కేసీఆర్ ఇంటికి బాబు
Published Sun, Oct 18 2015 2:11 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM
Advertisement
Advertisement