సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి: టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌కు తీసిపోనిరీతిలో చారిత్రక సంపద ఉన్న హైదరాబాద్‌కు యునెస్కో హెరిటేజ్ సిటీగా గుర్తింపు తీసుకురావాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. రూ.333.50 కోట్లతో 2.71 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ‘రాయదుర్గం–షేక్‌పేట్’ ఫ్లైఓవర్‌ను శనివారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో చార్మినార్ మొదలు గోల్కొండ వరకు ఎన్నో అద్భుతమైన చారిత్రక కట్టడాలు ఉన్నాయన్నారు.
రసూల్‌పుర జంక్షన్ వద్ద కేంద్ర హోంశాఖకు సం బంధించిన స్థలం అందించి ఫ్లైఓవర్ నిర్మాణానికి సహకరించాలని కిషన్‌రెడ్డిని కోరారు. కంటోన్మెంట్ లో మిలటరీ అధికారులు మూసేసిన 21 రోడ్లను తెరిపించే బాధ్యతను తీసుకోవాలన్నారు. హైదరా బాద్‌కు అనుసంధానంగా ఉన్న 8 జాతీయ రహదా రుల వెంట అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నా మని పేర్కొన్నారు. ఎస్‌ఆర్‌డీపీలో ఫ్లైఓవర్లు, అం డర్‌పాస్‌లు, గ్రేడ్ సెపరేటర్లు తదితర 24 ప్రాజెక్ట్‌లు పూర్తి అయ్యాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా 11వ, జనాభా పరంగా 12వ స్థానం, దేశానికి సంపద అందించడంలో 4వ స్థానంలో ఉందని ఇటీవల రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన నివేదికలో పేర్కొనట్లు కేటీఆర్ వెల్లడించారు. రూ.100 కోట్లతో ఔటర్‌రింగ్ రోడ్డును ఎల్‌ఈడీ లైట్ల వెలుగులతో దేశంలో ఏ నగరానికి లేనంతగా ఒక మణిహారంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు.
ఆర్‌ఆర్‌ఆర్ తెలంగాణకు మకుటం...
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్)కు అనుమతించామని, స్థలసేకరణ సేకరణ వేగవంతంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఆర్‌ఆర్‌ఆర్ తెలంగా ణకు మకుటం లాంటిదని, గేమ్ ఛేంజర్‌గా మారు తుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణకు మరిన్ని జాతీయ రహదారులు మంజూరయ్యాయని, త్వరలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని తెలిపారు. హైదరా బాద్‌లో సైన్స్ సిటీ నిర్మాణానికి 25 ఎకరాల స్థలం కేటాయించాలని సీఎంకు లేఖ రాశానన్నారు.
ఎస్సార్‌డీపీ ద్వారా చేసిన పలు పనులకు రాష్ట్ర ప్రభుత్వమే నిధులు ఖర్చు చేసిందని, మరిన్ని పనులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి ద్వారా రూ.10 వేల కోట్లను స్పెషల్ ప్యాకేజీ కింద ఇప్పించాలని కిషన్‌రెడ్డిని మంత్రి తలసాని శ్రీని వాస్‌యాదవ్ కోరారు. కార్యక్రమంలో రాష్ట్రమం త్రులు మహుమూద్ అలీ, సబితాఇంద్రారెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్ అరికపూడి గాంధీ, ఎమ్మెల్సీలు మహేందర్‌రెడ్డి, సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
అప్పటి చీఫ్ ఇంజనీర్‌కు గుర్తింపు
షేక్‌పేట ఫ్లై ఓవర్‌ను ప్రారంభించే అవకాశాన్ని ఈఎన్‌సీకి ఇచ్చి మునిసిపల్ మంత్రి కేటీఆర్ పనిచేసేవారికి గుర్తింపునిచ్చారు. జీహెచ్‌ఎంసీలో ఎస్సార్‌డీపీ ద్వారా పూర్తి చేసిన 24 పనుల్లో కీలకపాత్ర పోషించిన అప్పటి చీఫ్ ఇంజనీర్, ప్రస్తుతం రాష్ట్ర ప్రజారోగ్యశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్‌గా ఉన్న శ్రీధర్ రుమాండ్లతో రిబ్బన్ కట్ చేయించి ఈ ఫ్లై ఓవర్‌ను ప్రారంభోత్సవం చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment