పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ గురువారం ఉదయం శంకుస్థాపన చేశారు. అనంతరం కరివెన గ్రామంలో ఏర్పాటుచేసిన పైలాన్ను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తల తాకట్టు పెట్టయినా పాలమూరుకు వచ్చే నాలుగేళ్లలో కృష్ణా నీళ్లు తెస్తామన్నారు.