దేశవ్యాప్తంగా 9 వందే భారత్ రైళ్లు ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే..? | PM Modi To Flag Off 9 New Vande Bharat Trains Today | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్తంగా 9 వందే భారత్ రైళ్లు ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే..?

Published Sun, Sep 24 2023 10:17 AM | Last Updated on Sun, Sep 24 2023 1:14 PM

PM Modi To Flag Off 9 New Vande Bharat Trains Today - Sakshi

ఢిల్లీ: దేశవ్యాప్తంగా తొమ్మిది వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. 11 రాష్ట్రాల్లో అనుసంధానం పెంచే ఈ రైలు మార్గాలు ప్రయాణికుల సమయాన్ని ఘనణీయంగా ఆధా చేయనున్నాయి. 

ఉదయ్‌పూర్‌ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌
ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఉదయ్‌పూర్-జైపూర్ మధ్య నడుస్తుంది. ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయాణిస్తున్న అత్యంత వేగవంతమైన రైలు కంటే ఇది దాదాపు 30 నిమిషాల సమయాన్ని ఆధా చేస్తుంది. రాజస్థాన్‌లో ఇది మూడో వందే భారత్ రైలు. మిగిలిన రెండు జోధ్‌పూర్-సబర్మతి, అజ్మీర్-ఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్.

తిరునెల్వేలి-మధురై-చెన్నై వందే భారత్
తిరునెల్వేలి-మధురై-చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు తిరునెల్వేలి, మధురైలను చెన్నైతో కలుపుతుంది. దీంతో ప్రయాణ సమయం రెండు గంటలకు పైగా తగ్గే అవకాశం ఉంది. ఈ రైలు తిరునెల్వేలి జంక్షన్ నుంచి బయలుదేరి విరుదునగర్, మధురై, దిండిగల్, తిరుచిరాపల్లిలో అనేక స్టాప్‌లతో చెన్నై చేరుకుంటుంది. 

కాచిగూడ-బెంగళూరు
ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్‌లోని కాచిగూడ-బెంగళూరులోని యశ్వంత్‌పూర్ మధ్య నడుస్తుంది. మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం, ధరంవరం స్టేషన్లలో  స్థానికంగా ఆగుతుంది. ఈ రైలులో 530 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యంతో ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్, ఏడు ఛైర్‌ కార్ కోచ్‌లు ఉంటాయి.

విజయవాడ-చెన్నై వందే భారత్‌
చెన్నైలో ప్రధాని మోదీ ప్రారంభించనున్న రెండో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇది. ఈ రైలు తిరుపతి పుణ్యక్షేత్రానికి రేణిగుంట మార్గంలో వెళ్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా విజయవాడ, చెన్నై మధ్య నడుస్తుంది.

పాట్నా-హౌరా వందే భారత్
ఈ రైలు మార్గం బీహార్‌లోని పాట్నా జంక్షన్‌ను పశ్చిమ బెంగాల్‌లోని హౌరాతో కలుపుతుంది. ఇది 6 గంటల 35 నిమిషాల్లో 532 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. ఈ రైలు పాట్నా సాహెబ్, మొకామా, లక్కీసరాయ్ జంక్షన్, జసిదిహ్, జమ్తారా, అసన్సోల్, దుర్గాపూర్‌లలో రెండు నిమిషాల చొప్పున ఆగుతుంది.

కాసరగోడ్ - తిరువనంతపురం
కాసరగోడ్ - తిరువనంతపురం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కేరళకు చెందింది. ఇది సుమారు మూడు గంటల ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. ఏడు గంటల 55 నిమిషాల్లో 573 కి.మీ. ప్రయాణిస్తుంది. 

పూరీ-భువనేశ్వర్- రూర్కెలా
ఈ రైలు ఒడిశాలోని పూరిలో ఉదయం 5 గంటలకు బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 12:45 గంటలకు రూర్కెలా చేరుకుంటుంది. తిరిగి వచ్చే సమయంలో, రైలు రూర్కెలా నుండి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి రాత్రి 9 గంటలకు పూరీకి చేరుకుంటుంది. ఇది ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, దెంకనల్, అంగుల్, సంబల్పూర్ సిటీ, ఝర్సుగూడలో స్టాప్‌లను కలిగి ఉంటుంది.

రాంచీ-హౌరా వందే భారత్
రాంచీ-హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుంది. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లోని నగరాలను కలిపే అత్యంత వేగవంతమైన రైలు ఇది. ఇది రాంచీలో ఉదయం 5:15 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:20 గంటలకు హౌరా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో, రైలు హౌరా నుంచి మధ్యాహ్నం 3:45 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 10:50 గంటలకు రాంచీబాట్ చేరుకుంటుంది.

జామ్‌నగర్-అహ్మదాబాద్ వందే భారత్
జామ్‌నగర్-అహ్మదాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఐదు స్టాప్‌లతో 4 గంటల 40 నిమిషాల్లో 331 కి.మీ ప్రయాణిస్తుంది. ఇది జామ్‌నగర్‌లో 5:30 గంటలకు బయలుదేరి రాజ్‌కోట్, వాంకనేర్, సురేంద్రనగర్, విరామ్‌గామ్, సబర్మతి మీదుగా ఉదయం 10:10 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది.

ఇదీ చదవండి: ప్రధాని మోదీ భద్రతా వలయంలో కలకలం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement