'పాలమూరు'కు శంకుస్థాపన చేసిన కేసీఆర్ | palamooru lift irrigation project inaugarated by cm kcr | Sakshi
Sakshi News home page

'పాలమూరు'కు శంకుస్థాపన చేసిన కేసీఆర్

Published Thu, Jun 11 2015 11:46 AM | Last Updated on Fri, Mar 22 2019 2:57 PM

'పాలమూరు'కు శంకుస్థాపన చేసిన కేసీఆర్ - Sakshi

'పాలమూరు'కు శంకుస్థాపన చేసిన కేసీఆర్

మహబూబ్నగర్: పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ గురువారం ఉదయం శంకుస్థాపన చేశారు. రూ.35,200 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తిచేస్తామని ఆయన తెలిపారు. అనంతరం కరివెన గ్రామంలో ఏర్పాటుచేసిన పైలాన్ ను సీఎం ఆవిష్కరించనున్నారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే మూడు జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది. దీంతో పాటు హైదరాబాద్ నగరానికి 20 టీఎంసీల సాగునీరు చేకూరుతుంది.

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, గువ్వల బాలరాజు, ఎంపీ జితేందర్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అడ్డాకులలోని ఎంపీ జితేందర్ రెడ్డి విశ్రాంతి భవనంలో భోజనంచేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు భూత్పూరు మండల కేంద్రంలో ఆయన బహిరంగ సభ నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement