కాలిఫోర్నియా: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డా.వైఎస్రాజశేఖరరెడ్డి 74వ జయంతి సందర్భంగా అమెరికాలో కాలిఫోర్నియా, బే ఏరియాలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం జులై 10వ తేదీ ఉదయం,ఆహా ఇండియన్ హోటల్‌లో జయంతి వేడుకలను నిర్వహించారు.
‘ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటి ఫలాలను ప్రతి పేదవాడికి అందించిన గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి. బడుగు, బలహీన వర్గాల ఆరాధ్య దైవం,. ఎందరికో అసాధ్యమైన అనేక అభ్యుదయ పథకాలను సుసాధ్యం చేసి దేశంలోనే గుర్తింపు తెచ్చుకున్న మహానేత అని వైఎస్సార్‌సీపీ అమెరికా గవర్నింగ్ కౌన్సిల్ మెంబెర్ కేవీరెడ్డి గుర్తు తెచ్చుకున్నారు. మాట తప్పని..మడమ తిప్పని రాజకీయ నేత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. విద్యార్థుల సంక్షేమం కోసం ఫీజు రీ ఎంబర్సుమెంట్, రైతులకు రుణమాఫీ, పావలా వడ్డీ, పశుక్రాంతి, జలయజ్ఞం, ఉచిత విద్యుత్ వంటి ఎన్నో మహత్తర కార్యక్రమాలు ప్రవేశపెట్టి రాష్ట్రంలోని ప్రజలంతా బాగుండాలి. ప్రజల బాగోగులు చూసుకోవాలి అని నిరంతరం తపించిన వ్యక్తి ఆయన అన్నారు .
వైఎస్సార్ స్పూర్తి, ఆశయాలతోవారి కుమారుడు , ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదర్స పరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. వైఎస్సార్‌సీపీ అమెరికా కమిటీ ముఖ్య సభ్యులు సురేంద్ర అబ్బవరం, కిరణ్ కూచిభట్ల , సహదేవ్ బోడె , తిరుపతిరెడ్డి , వెంకట్ , అంకిరెడ్డి , ఆనంద్ బందార్ల, అశోక్, ప్రశాంతి, అమర్ బడే తదితరులు వైఎస్సార్ సేవలను, సంక్షేమ పాలనను వారితో గల అనుబంధాన్ని గుర్తు తెచ్చుకున్నారు. వారి తనయుడు ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజన్న రాజ్యాన్ని అందిస్తున్నారని ప్రశంసించారు.
ఇంకా ఈ కార్యక్రమలో బే ఏరియా వైస్సార్ అభిమానులు హరి, కొండారెడ్డి , త్రోలోక్ , సుబ్బారెడ్డి , రామిరెడ్డి , నరేంద్ర కొత్తకోట, వినయ్, ఇతర వైఎస్సార్‌సీపీ స్టూడెంట్ విభాగం నాయకులూ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment