కాలిఫోర్నియాలో మహానేత వర్ధంతి | YSRCP Bay Area Tributes To Dr YSR On 09th Vardhanthi | Sakshi
Sakshi News home page

కాలిఫోర్నియాలో మహానేత వర్ధంతి

Published Wed, Sep 12 2018 12:45 PM | Last Updated on Wed, Sep 12 2018 1:00 PM

YSRCP Bay Area Tributes To Dr YSR On 09th Vardhanthi - Sakshi

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా అమెరికాలోని కాలిఫోర్నియా (బే ఏరియా) ప్రాంతంలో ఉన్న సంక్రాంతి రెస్టారెంట్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో మహనేతకు ఘనంగా నివాళులు అర్పించారు. బేఏరియా వైఎస్సార్‌ సీపీ టీమ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి యూఎస్‌ వైఎస్సార్‌ సీపీ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యులు కె. వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు. వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ, విజయవాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, బే ఏరియా ప్రముఖులు డాక్టర్‌ లక్కిరెడ్డి హనిమిరెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. వైఎస్సార్‌ఆర్‌ అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

అంతకుముందు మద్దూరి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారీ కార్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ బేఏరియా టీమ్‌ సురేంద్ర అబ్బవరం, మధు వంగా, గోపిరెడ్డి, శ్రీధర్‌, త్రిలోక్ ఆరవ‌, సహదేవ్‌, అమరనాథ్‌ రెడ్డి, కొండారెడ్డి, చంద్రహాస్, నరేష్, శివ, రమాకాంత్, చెన్నకేశవ, వీర, అమర్, నరేంద్ర అట్టునూరి, వెంకట్, విజయ్ ఎద్దుల, శ్రీధర్, కోటిరెడ్డి, డాక్టర్‌ రాఘవ, సుగుణ, ప్రవీణ, హరీంద్ర, రామచంద్ర, ఆదిత్య, రాంకీ, రవి, సురేంద్ర వల్లూరి, నరేంద్ర కొత్తకోట, నారాయణ, పెంచలరెడ్డి, సురేష్‌లతో పాటు ‘నాటా’ సభ్యులు విజయ్ చవ్వా(టీసీఏ), ధనిరెడ్డి అరికట్ల, సూర్య కురలి, చంద్ర కావలి, రవి కర్రి, సురేంద్ర పులగం, లోకేష్, సునీల్, శేషాద్రి పోలిశెట్టి, విశ్వనాధ్, శేషారెడ్డి, ధర్మేంద్ర జంబుల, సత్య బండారు, సంకీర్త్, వైఎస్సార్‌ సీపీ యూఎస్‌ స్టూడెంట్ నాయకులూ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement