కాలిఫోర్నియాలో వైఎస్సార్ వర్ధంతి | YS Rajashekara Reddy 7th death anniversary to be held in california | Sakshi
Sakshi News home page

కాలిఫోర్నియాలో వైఎస్సార్ వర్ధంతి

Published Sat, Aug 13 2016 6:35 PM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM

కాలిఫోర్నియాలో వైఎస్సార్ వర్ధంతి - Sakshi

కాలిఫోర్నియాలో వైఎస్సార్ వర్ధంతి

కాలిఫోర్నియా(యూఎస్): దివంగత ముఖ్యమంత్రి, ప్రజల నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని వైఎస్సార్ కాంగ్రెస్ అమెరికా విభాగం నాయకులు కాలిఫోర్నియాలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 3న బే ఏరియాలో డాక్టర్ వైఎస్సార్ 7వ వర్ధంతిని నిర్వహించనున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ అమెరికా కన్వీనర్ రత్నాకర్ తెలిపారు.

కాలిఫోర్నియాలో జరగనున్న ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ అధ్యక్షత వహిస్తారని, అలాగే పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పాల్గొంటారని రత్నాకర్ తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ అమెరికా విభాగం కార్యకర్తలు, బే ఏరియా లోకల్ సపోర్టర్లు, డాక్టర్ వైఎస్సార్ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 3 శనివారం ఉదయం 11 నుంచి సాయంత్రం 4గంటల వరకు కాలిఫోర్నియాలోని ఒయాసిస్ రెస్టారెంట్లో జరగనుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement