రాజన్న స్మరణ.. | Tribute to ysr | Sakshi
Sakshi News home page

రాజన్న స్మరణ..

Published Thu, Sep 3 2015 2:47 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM

రాజన్న స్మరణ.. - Sakshi

రాజన్న స్మరణ..

కాజీపేట రూరల్ : జిల్లాలో వైఎస్సార్ సీపీ శ్రే ణులు బుధవారం మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధం తి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హన్మకొండలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మునిగాల విలియం ఆధ్వర్యంలో వైఎస్సార్ 6వ వర్ధంతి జరిగాయి. రాజశేఖరరెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మునిగాల విలియం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీడికంటి శివ మాట్లాడుతూ.. పేదల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహానేత రాజశేఖరరెడ్డి అని అన్నారు.

ఇటీవల జిల్లాలో జరిగిన వైఎస్ తనయ షర్మిల పరమార్శ యాత్రకు ప్రజలు చూపించి అభిమానం మరచిపోలేమన్నారు. గ్రేటర్ అధ్యక్షుడు కాయిత రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రజల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి ఎప్పటికి ఆదరణ ఉంటుందన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు మునిగాల కల్యాణ్‌రాజ్, దుప్పటి శివకుమార్, మంచె అశోక్, ఎండీ షంషీర్ బేగ్, చల్లా అమరేందర్‌రెడ్డి, ముజఫరుద్దీన్ ఖాన్, జి.సమ్మయ్య, బద్రుద్దీన్ ఖాన్, నాగపురి దయాకర్, బొడ్డు శ్రావన్, బి.సాల్మన్ రాజ్, సంగాల ఈర్మియా, అరెపెల్లి రాజు, పి.ప్రభాకర్, ఎండీ రహమత్, గాంధీ, నాగవెల్లి రజినికాంత్, ప్రతీఫ్, ప్రశాంత్, సాయి గౌతం, హరీష్, జానారెడ్డి, షంషీరుద్దిన్, అంజత్‌ఖాన్, భిక్షపతి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement